Discounts On Tata Cars: హ్యారియర్, సఫారి సహా టాటా కార్లపై భారీ ఆఫర్లు - నవంబర్‌లో రూ.1.75 లక్షల వరకు తగ్గింపు
Offers On Tata Cars: ఈ నవంబర్‌లో టాటా కార్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హ్యారియర్, సఫారి మోడళ్లపై రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

November 2025 Offers On Tata Cars: ఫెస్టివ్ సీజన్ ముగింపు దశకు చేరడంతో టాటా మోటార్స్ కస్టమర్లకు మరో గిఫ్ట్ అందించింది. ఈ నెలలో (నవంబర్ 2025), టాటా కంపెనీ, తన అన్ని మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. వీటిలో ముఖ్యంగా Tata Harrier, Safari Tata కొనుగోలుదారులకు భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. కంపెనీ షోరూమ్‌లలో ఉన్న 2024, 2025 మోడళ్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
హ్యారియర్, సఫారిపై భారీ ఆఫర్లు
టాటా హ్యారియర్, సఫారి అడ్వెంచర్ వెర్షన్‌లపై ఈసారి అత్యధికంగా రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. ఫెస్టివ్ సీజన్‌లో, గత నెలలో ప్రకటించిన డిస్కౌంట్‌తో పోలిస్తే ఇది రూ.92,000 అధిక ఆఫర్. బేస్ మోడల్ “స్మార్ట్” ట్రిమ్‌పై రూ.50,000 వరకు, “ప్యూర్” ట్రిమ్‌పై రూ.1.25 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. టాప్ వెర్షన్‌లైన హ్యారియర్ ఫియర్‌లెస్, సఫారి అకాంప్లిష్డ్ కొనేవాళ్లకు రూ.75,000 నుంచి రూ.1.25 లక్షల మధ్య బెనిఫిట్స్ ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో, టాటా హ్యారియర్ ధరలు ₹14 లక్షల నుంచి ₹26.7 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. టాటా సఫారి ₹14.66 లక్షల నుండి ₹27.44 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు లభిస్తోంది.
Tata Altroz పై తగ్గింపులు
టాటా ఆల్ట్రోజ్ పాత (pre-facelift) మోడళ్లపై రూ.1.35 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. ప్రత్యేకంగా ఆల్ట్రోజ్ రేసర్ వెర్షన్ కొనుగోలుదారులకు ఎక్కువ డిస్కౌంట్ లభిస్తోంది. 2025 మోడళ్లపై రూ.65,000 వరకు ఆఫర్లు ఉన్నప్పటికీ, తాజా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పై ఈ నెల ఎలాంటి తగ్గింపు లేదు. Altroz ధరలు ₹6.30 లక్షల నుంచి ₹10.51 లక్షల మధ్య ఉన్నాయి.
Tata Nexon బెనిఫిట్స్
పెట్రోల్, డీజిల్, CNG - ఏ వెర్షన్ అయినా సరే, టాటా నెక్సాన్ కొనుగోలుదారులకు రూ.45,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. 2025 మోడళ్లకు అదనంగా రూ.20,000 లాయల్టీ బోనస్ కూడా లభిస్తుంది. నెక్సాన్ ధరలు ₹8 లక్షల నుంచి ₹15.40 లక్షల వరకు ఉన్నాయి.
Tata Tiago, Tata Tigor తగ్గింపులు
టాటా ఎంట్రీ లెవల్ కార్లు - టియాగో, టిగోర్ - బయ్యర్లకు వరుసగా రూ.40,000, రూ.45,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. 2025 మోడళ్లపై రూ.25,000 నుంచి రూ.30,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. టియాగో ధరలు ₹4.57 లక్షల నుంచి ₹8.10 లక్షల వరకు, టిగోర్ ధరలు ₹5.49 లక్షల నుండి ₹8.74 లక్షల వరకు ఉన్నాయి.
Tata Punch, Tata Curvv మోడళ్ల ఆఫర్లు
టాటా పంచ్ పై ఈసారి రూ.40,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. 2024 మోడళ్లపై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, 2025 మోడళ్లపై లాయల్టీ & ఎక్స్చేంజ్ బోనస్ కలిపి రూ.40,000 వరకు తగ్గింపు లభిస్తోంది. పంచ్ ధరలు ₹5.5 లక్షల నుంచి ₹9.3 లక్షల మధ్య ఉన్నాయి. అలాగే... టాటా కర్వ్ మోడల్‌పై కూడా రూ.40,000 వరకు ఆఫర్లు కొనసాగుతున్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి.
కొత్త ఏడాది (2026) రాక ముందే కొత్త టాటా కార్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. ఈ ఆఫర్లు నగరాన్ని, స్టాక్‌ను బట్టి మారవచ్చు. కాబట్టి, మరింత ఖచ్చితమైన సమాచారం కోసం మీ సమీప టాటా షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















