News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vijay Varma: అమీర్ ఖాన్, కరిష్మా ముద్దులు, అయోమయంలో తమన్నా ప్రియుడు విజయ్ వర్మ- అసలేం జరిగిందంటే?

కొద్ది రోజులుగా తమన్నా, విజయ్ వర్మ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇద్దరి గురించి ఆసక్తికర విషయాలు చెప్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. తాజాగా అమీర్-కరిష్మ ముద్దుల గురించి గురించి చెప్పాడు విజయ్.

FOLLOW US: 
Share:

విజయ్ వర్మ, తమన్నా కలిసి తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రమోషన్ లో భాగంగా తమన్నా, విజయ్ వర్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. తాజాగా 'లస్ట్ స్టోరీస్ 2' ప్రమోషన్‌లలో భాగంగా, తమన్నా, విజయ్ ఓ వీడియో చేశారు. ఇందులో ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ సమయంలో జరిగిన ఘటనలతో పాటు నిత్య జీవితంలో ఎదుర్కొన్న కొన్ని విషయాల గురించి చర్చించారు. విజయ్ వర్మ నటనను చాలా దగ్గరగా చూశానని, కష్టపడే తత్వం ఉందని తమన్నా చెప్పింది. అందుకే అతడితో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు వివరించింది. సుజోయ్ ఘోష్‌తో కలిసి పని చేయాలనే కోరిక కూడా నెరవేరిందని వివరించింది.  

నేను అందుకే కిస్ సీన్లకు దూరంగా ఉన్నా- తమన్నా

తన సినీ కెరీర్ లో కిస్ సీన్లకు దూరంగా ఉండటానికి అసలు కారణం చెప్పింది తమన్నా. “నేను నా 17 ఏండ్ల కెరీర్ లో ఎప్పుడూ లిప్ కిస్ సీన్లు చేయలేదు. కుటుంబంతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు ఈ సీన్లు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్నిసార్లు తల దించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే ఆ సీన్లు చేయకుండా దూరంగా ఉన్నాను. తొలిసారి విజయ్ కోసమే  ఇంటిమేట్ సీన్ చేయడానికి అంగీకరించాను” అని తమన్నా వివరించింది.   

అమీర్- కరిష్మా ముద్దులు-  అయోమయంలో విజయ్

విజయ్ కూడా ముద్దు సీన్లతో ఇబ్బంది పడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఒకప్పుడు జరిగిన విషయాన్ని వివరించారు.  “కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌లో 2, 3 కుటుంబాలతో కలిసి 'రాజా హిందుస్తానీ' చూడ్డానికి థియేటర్ కు వెళ్లాను. మా తల్లిదండ్రులు, మామ, అందరూ 20 మంది ఒకే వరుసలో కూర్చొని ఉన్నాము.  ఒక్కసారిగా అమీర్- కరిష్మా మధ్య ముద్దు సన్నివేశం మొదలైంది. వరుస మొత్తం ఇట్టే స్తంభించిపోయింది. ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. కాస్త ఇబ్బందికరంగానూ అనిపించింది” అని విజయ్ వివరించాడు. అంతేకాదు, తాను నటించిన రొమాంటిక్ సన్నివేశాలను కూడా తెర మీద చూసుకునేందుకు ఇబ్బందిగా ఫీలవుతానని చెప్పారు.

‘లస్ట్ స్టోరీస్ సీజన్ 2’లో నాలుగు కథల్ని చూపించారు. వీటిలో ఒక్కో కథకు ఒక్కొక్కరు దర్శకత్వం వహించారు.  'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ ని సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ నలుగురు దర్శకులు తెరకెక్కించారు. తమన్నా, విజయ్ వర్మ సెగ్మెంట్ కు సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు.  తమన్నా, మృనాల్ ఠాకూర్ విజయ్ వర్మ, అమృతా సుభాష్, అంగద్ బేడీ,కాజోల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, తిలోత్తమా షోమే నటించారు.   జూన్ 29న ఈ వెబ్ సిరీస్  నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.   

Read Also: ఏడాది కాదు, 6 నెలలే - సమంతా బ్రేక్ తీసుకోడానికి అసలు కారణం ఇదేనట!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 07 Jul 2023 01:46 PM (IST) Tags: Aamir Khan Tamanna Bhatia Vijay Varma Karisma Kapoor Raja Hindustani Kiss Scene

ఇవి కూడా చూడండి

Krishna Mukunda Murari November 30th Episode: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: భవానిని తన మాటలతో ఏమార్చిన ముకుంద, మురారి పెళ్లి ముహూర్తం ఫిక్స్

Krishna Mukunda Murari November 30th Episode: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: భవానిని తన మాటలతో ఏమార్చిన ముకుంద, మురారి పెళ్లి ముహూర్తం ఫిక్స్

Nindu Noorella Saavasam November 30th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: మనోహరి మాటలకి షాకైన అరుంధతి, నీలని బురిడీ కొట్టించిన చిత్రగుప్తుడు!

Nindu Noorella Saavasam November 30th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: మనోహరి మాటలకి షాకైన అరుంధతి, నీలని బురిడీ కొట్టించిన చిత్రగుప్తుడు!

Brahmamudi November 30th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : అరుణ్‌ కోసం హాస్పిటల్‌కు వెళ్లిన రాజ్‌, కావ్య - స్వప్నను ఇంట్లోంచి గెంటివేయాలన్న రుద్రాణి

Brahmamudi November 30th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : అరుణ్‌ కోసం హాస్పిటల్‌కు వెళ్లిన రాజ్‌, కావ్య - స్వప్నను ఇంట్లోంచి గెంటివేయాలన్న రుద్రాణి

Bigg Boss Telugu 7: ప్రియాంక, అమర్‌ల మధ్య శోభా చిచ్చు, సూపర్ సక్సెస్ అయిన లేడీ విలన్ ప్లాన్!

Bigg Boss Telugu 7: ప్రియాంక, అమర్‌ల మధ్య శోభా చిచ్చు, సూపర్ సక్సెస్ అయిన లేడీ విలన్ ప్లాన్!

Trinayani Serial Today November 30th Episode : 'త్రినయని' సీరియల్: బెడిసికొట్టిన తిలోత్తమ ప్లాన్, ఫ్యామిలీ ముందు గుట్టు రట్టు చేసిన నయని!

Trinayani Serial Today November 30th Episode : 'త్రినయని' సీరియల్: బెడిసికొట్టిన తిలోత్తమ ప్లాన్, ఫ్యామిలీ ముందు గుట్టు రట్టు చేసిన నయని!

టాప్ స్టోరీస్

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

Lets Vote : ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా !

Lets Vote :  ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు  బాధ్యత కూడా !

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే