Allu Arjun: ఐకాన్‌కి ‘రౌడీ’ గిఫ్ట్.. ఏం ఇచ్చాడంటే?
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. పుష్ప రిలీజ్ సందర్భంగా ఐకాన్ స్టార్‌కు అల్లు అర్జున్‌కి గిఫ్ట్ ఇచ్చాడు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప శుక్రవారం విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించాడు. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.
వీరిద్దరి మధ్య మధ్య మంచి బాండింగ్ ఉంది. ఎవరి సినిమాలు విడుదలైనా ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు వీరి ఫ్రెండ్‌షిప్ బహుమతులు ఇచ్చి పుచ్చుకునే స్థాయికి పెరిగింది. విజయ్ దేవరకొండ ‘రౌడీ’ క్లోత్ బ్రాండింగ్ కింద దుస్తులను విక్రయిస్తున్న సంగతి కూడా తెలిసిందే.
ఇప్పుడు తన క్లాతింగ్ బ్రాండ్ నుంచి ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన బ్లాక్ కలర్ స్వెట్‌షర్ట్‌ను బన్నీకి బహుమతిగా అందించాడు. ‘రౌడీ లవ్స్ అల్లు అర్జున్’ అని దాని మీద ప్రత్యేకంగా ప్రింట్ చేయించారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదలైన సందర్భంగా తన కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లే సమయంలో ఈ షర్ట్‌నే వేసుకున్నాడు.
విజయ్ షర్ట్‌తో పాటు ఆల్ ద బెస్ట్ చెబుతూ చిన్న లెటర్‌ను కూడా రాశాడు. అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ‘థ్యాంక్యూ సో మచ్ బ్రదర్’ అంటూ ఈ లేఖలో పేర్కొన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్పకు ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన్న భారీ బడ్జెట్ చిత్రం మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్పను రూపొందించారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం అనన్య పాండేతో కలిసి లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2022 ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది.
Also Read: సిరి ఓట్లకు గండి కొట్టిన ‘బిగ్ బాస్’.. ఆమె ఫేక్ ఎలిమినేషన్‌తో షన్ను ‘లెక్క’ మారుతుందా?
Also Read: ‘బిగ్ బాస్’ విజేత ఎవరు? ఇలా ఓటేసి విన్నర్‌ను మీరే నిర్ణయించండి
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు సపోర్ట్‌గా మహిళా మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి