అన్వేషించండి

Vettaiyan: చిక్కుల్లో రజనీకాంత్ మూవీ.. బ్యాన్ చేయాలంటూ కేసు, న్యాయస్థానం కీలక నిర్ణయం

Vettaiyan Movie: రజనీకాంత్ తాజా చిత్రం ‘వేట్టయాన్’ చిక్కుల్లో పడింది. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కోర్టులో కేసు వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

Vettaiyan Movie Case : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 10న విడుదలకానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో కొంత మంది మధురై కోర్టులో కేసు వేశారు. ‘వేట్టయాన్‌’ ప్రివ్యూ లోని డైలాగులు అభ్యంతకరంగా ఉన్నాయని, ఎన్ కౌంటర్లను ప్రోత్సహించేలా ఉన్నాయని వెల్లడించారు. ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  

‘వేట్టయాన్’ మూవీపై న్యాయస్థానం కీలక నిర్ణయం

త్వరలో ఈ ‘వేట్టయాన్’ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఈ నెల 20న ‘వేట్టయాన్‌’ ప్రివ్యూ పేరుతో మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులోని కొన్ని డైలాగుపై అభ్యంతరం చెప్తూ కొంత మంది మధురై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. “అత్యంత భయంకరమైన క్రిమినల్స్‌కు  భయపడకుండా ఎన్‌కౌంటర్‌ చేయడం వల్లే వీళ్లు హీరోలు అయ్యారు”! అని చెప్పే డైలాగ్ పై పిటీషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ డైలాగ్ ఎన్ కౌంటర్లను ప్రోత్సహించేలా ఉన్నాయన్నారు. ప్రజల ఆలోచనలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలిపారు. ఈ డైలాగులను సినిమా నుంచి తొలగించాలన్నారు. లేదంటే మ్యూట్ చేయాలని కోరారు. ఈ కేసుపై న్యాయస్థానం విచారణ జరిపింది. సెన్సార్ బోర్డుతో పాటు  లైకా ప్రొడక్షన్స్‌ కు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ వివరణను బట్టి తదుపరి విచారణ ఉంటుందని న్యాయస్థానం వెల్లడించింది. సినిమాపై మధ్యంతర నిషేధం విధించాలన్న విజ్ఞప్తిని మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది.

ఆకట్టుకుంటున్న ‘వేట్టయాన్’ ట్రైలర్

‘వేట్టయాన్’ విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘వేట్టయాన్’ ట్రైలర్ ను విడుదల చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రైలర్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనిపించాయి. రజనీకాంత్ డైలాగ్ లు హైలెట్ గా నిలిచాయి. “క్రైమ్‌ క్యాన్సర్‌ లాంటిది. దానిని పెరగనివ్వకూడదు. నన్ను ఏ పోస్టులో తిప్పి కొట్టినా నేను మాత్రం పోలీస్‌ వాడినే సార్‌. నా నుంచి వాడిని కాపాడటం ఎవరి వల్ల కాదు” అనే డైలాగులు అలరించాయి. అమితాబ్‌ బచ్చన్‌, రానా, ఫహాద్‌ ఫాజిల్‌ పాత్రలను చక్కగా ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ల డైలాగ్స్‌ కూడా చాలా బాగున్నాయి.  రజనీకాంత్‌ తనదైన స్టైల్, మేనరిజంతో ఆకట్టుకున్నారు. పోలీస్‌ వ్యవస్థకు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కు మధ్య జరిగే వార్ ను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.  లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read Also: 43 ఏళ్ల వయసులో నాలుగో పెళ్ళికి రెడీ అయిన ఫైర్ బ్రాండ్.. ముగ్గురు పిల్లలకు తల్లి - మూడు పెళ్ళిళ్ళు పెటాకులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget