Venkatesh Saindhav : 'సైంధవ్' స్టోరీ లైన్ మాములుగా లేదుగా - వెంకీ మామ మూడు క్లూస్ వదిలాడు
వెంకటేష్ పాన్ ఇండియా సినిమా 'సైంధవ్' కథేంటి? ఈ రోజే పూజ చేశారు, నిన్నే టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అప్పుడే కథ గురించి ఎందుకంటారా? ఆ గ్లింప్స్ చూస్తే... మూడు క్లూస్ వదిలారు. వాటిని గమనించారా?
ఇప్పుడు విక్టరీ వెంకటేష్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అదే 'సైంధవ్'. హీరోగా ఆయనకు 75వ చిత్రమిది. 'హిట్' డైరెక్టర్ శైలేష్ కొలనుతో చేస్తున్నారు. ఈ రోజు సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. నిన్న టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.
'సైంధవ్' టైటిల్ గ్లింప్స్‌లో వెంకీ మామ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చాలా రాగా తన ఏజ్ కి తగ్గట్లుగా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. చాలా మంది గ్లింప్స్ చూశాక కమల్ హాసన్ 'విక్రమ్' స్టైల్ లో దర్శకుడు శైలేష్ కొలను ఏదో చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఇచ్చిన బీజీఎం కూడా 'విక్రమ్' టెంప్లేట్ ను గుర్తు చేస్తోంది. శైలేష్ కొలను, వెంకటేష్... ఇద్దరూ ఎలాగో కమల్ హాసన్ ఫ్యాన్స్ కాబట్టి అలా అనుకోవటంలో తప్పులేదు. కానీ, గ్లింప్స్ ను జాగ్రత్తగా గమనిస్తే శైలేష్ మూడు క్లూలు వదిలాడు.
ఆ మెడిసిన్ చూశారా?
జాగ్రత్తగా గ్లింప్స్ గమనిస్తే... వెంకటేష్ బైక్ మీద ఉన్న ఓ బాక్స్ దగ్గరకు వెళతారు. ఆ బాక్స్ మీద ఓ సింబల్ ఉంది. దానికింద Genezo అని రాసి ఉంది. ఈ సింబల్ కు అర్థం ఏంటీ అంటే అది జీన్ సింబల్. అంటే ఇది జన్యువుల మీద వర్క్ చేసే కంపెనీకి సంబంధించిన మెడిసిన్ బాక్స్.
ఆ తర్వాత ఆ బాక్స్ ను ఓపెన్ చేసి ఓ లిక్విడ్ పైప్ ను తీసి చేత్తో పట్టుకుంటారు వెంకటేష్. దాని మీద కూడా ఈ కంపెనీ పేరుతో పాటు ఓనాసెమ్నోజీన్ అబేపార్వోవేక్ అని రాసి ఉంది. ఇందేటా అని ఆరా తీస్తే తేలింది ఏంటంటే... SMA అంటే Spine Muscular Atrophy అనే మోటార్ న్యూరాన్ డిసీజ్ కు వాడే జీన్ థెరపీ మెడికేషన్ అన్నమాట. ఈ మెడిసిన్ నే సింపుల్ గా జోల్ జెన్ స్మా అంటారు. ఈ జోన్ జెన్ స్మా అనే పేరు ఎక్కడో విన్నట్లు ఉందని ఆ పేరుతో నెట్ లో సెర్చ్ చేస్తే.... ఓ కథనం కనిపించింది.
ఆ కథనం సారాంశం ఏంటంటే... రెండేళ్ల ఈ పాపకు జోల్ జెన్ స్మా ఇంజక్షన్ చేయించాలి. తను కూడా ఇలాంటి SMA డిసీజ్ తోనే బాధపడుతుంటే... ఇంపాక్ట్ గురూలో క్రౌండ్ ఫండింగ్ తో మూడు నెలల్లో లక్ష మంది కలిసి ఈ ఇంజక్షన్ ను కొనటానికి అయ్యే డబ్బులను పోగు చేశారు. ఎందుకు అంటారా జోల్ జెన్ స్మా అనే డ్రగ్ ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ డ్రగ్స్ లో ఒకటి. దీని విలువ 2.15 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయిల్లో అక్షరాలా 17 కోట్ల 50 లక్షల రూపాయలు. సో ఈ క్లూ తో తెలిసింది ఏంటంటే ఈ డ్రగ్ ను కాపాడేందుకు లేదా తన దగ్గర నుంచి ఎవరూ తీసుకెళ్లకుండా ట్రై చేసేందుకు వెంకటేష్ ప్రయత్నిస్తున్నారు. గ్లింప్స్ లో డైలాగ్ కూడా ఉంది కదా... 'నేను ఇక్కడే ఉంటాను రా, ఎక్కడికీ వెళ్లను! రమ్మను' అని! ఆ పక్కన చాలా మందిని అప్పటికే వెంకటేష్ కొట్టి పడేశారు.
'సైంధవ్' పేరు వెనుక కథేంటి?
అసలు ఎవరీ సైంధవ్? అంటే... మహాభారతం ప్రకారం కౌరవులకు చెల్లెలైన దుశ్శలకు భర్త. అంటే... దుర్యోధనుడికి భావ. సైంధవుడికి శివుడు ఓ వరం ఇస్తాడు. అర్జునుడు తప్ప మిగిలిన పాండవులను అవసరమైనప్పుడు సైంధవుడు అడ్డుకోగలడు. ఆ వరంతోనే అర్జుణుడిని ఏమార్చి... అభిమన్యుడిని పద్మ వ్యూహంలోకి రప్పిస్తారు. అప్పుడు మిగిలిన పాండవులను సైంధవుడు అడ్డుకుంటే... అభిమన్యుడిని పద్మ వ్యూహంలో హతమారుస్తారు కౌరవులు. 'సైంధవుడిలా అడ్డుపడుతున్నాడు' అనే సామెతను ఇప్పటికీ తెలుగు జనాలు వాడుతూ ఉంటారు.
అటువంటి నెగిటివ్ క్యారెక్టర్ పేరు టైటిల్ రోల్ కు ఎందుకు పెట్టారు? వెంకటేష్ పాత్రలో గ్రే షేడ్స్ చూపిస్తారా? లేదా సైంధవుడు అందరికీ ఎలా అయితే అడ్డు పడగలడో? అలా ఎవరినైనా ఎదిరించి అడ్డుపడగలిగే క్యారెక్టర్ ఉన్నవాడు కాబట్టి వెంకటేష్ సినిమాకు ఆ పేరు పెట్టారా? వెయిట్ అండ్ సీ!
చంద్రప్రస్థ నగరంలో...
గ్లింప్స్ మొదట్లోనే సిటీ పేరు చెప్పాడు డైరెక్టర్ శైలేష్. చంద్ర ప్రస్థ అనే ఫిక్షనల్ పోర్ట్ ఏరియా అన్నాడు. బైక్ మీద కూడా CP అని ఉంటుంది. అంటే చంద్రప్రస్థ అనే ఈ పోర్ట్ సిటీ మహాభారతంలోని ఇంద్రప్రస్థానికి రెప్లికా అయ్యి ఉండొచ్చు. భారతంలో పాండవులు ఈ ఇంద్రప్రస్థాన్నే రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు.
Also Read : రాజమౌళి ఫ్యామిలీపై కేంద్రం ప్రత్యేక ప్రేమ చూపిస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏంటంటే?
సో ఇది ఇలా మూడు క్లూ స్ కావాలనే చూపిస్తూ...గ్లింప్స్ నే చాలా ఇంట్రెస్టింగా ప్రజెంట్ చేశాడు శైలేష్ కొలను. వెంకటేష్ 75 వ సినిమా ఓ మంచి సినిమా చూడనున్నామనైతే అనిపిస్తోంది. పైగా ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా ఉన్నారు. హిందీ సినిమాలు చూసే వారందరికీ అతనెంత గొప్ప యాక్టరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్విట్టర్ లో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నవాజుద్దీన్ అభిమానులు గర్వపడేలా ఈ క్యారెక్టర్ ఉంటుందని... దాని కోసం చాలా కష్టపడతానని శైలేష్ కొలను చెప్పారు. సో వెంకీ మామ 75 వ సైంధవ ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని ఇస్తుందని ఆశిద్దాం.
Also Read : 'హంట్' రివ్యూ : షాక్ ఇచ్చిన సుధీర్ బాబు, సినిమా ఎలా ఉందంటే?