News
News
X

Veerayya Vs Veerasimha: బాలయ్య వర్సెస్ చిరు - అల్టిమేటం జారీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు?

చిరంజీవి, బాలయ్య సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

FOLLOW US: 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఇదివరకు చాలా సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ పోటీకి సిద్ధమవుతున్నారు. చిరంజీవి-బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వాల్తేర్ వీరయ్య' సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్లుగానే షూటింగ్ జరుగుతోంది. ఇందులో రవితేజ(Raviteja) కీలకపాత్రలో కనిపించనున్నారు. అలానే మరోపక్క బాలకృష్ణ సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది.

గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా కూడా సంక్రాంతికే రాబోతుందని ప్రకరించారు. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదల అవ్వడం సహజమే కానీ ఈసారి భారీ బడ్జెట్ సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. 'ఆదిపురుష్', వారసుడు' లాంటి సినిమాలు రేసులో ఉన్నాయి. ఇప్పుడు చిరు, బాలయ్య కూడా తోడైతే థియేటర్లు అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది. 

Veerayya Vs Veerasimha: Distributors Gave The Ultimatum: ఈ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి, బాలయ్య సినిమాలను నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఒకేసారి తమ బ్యానర్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ చేయడమంటే చిన్న విషయం కాదు. రీసెంట్ గా కొందరు డిస్ట్రిబ్యూటర్లు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలను కలిసినట్లు తెలుస్తోంది. చిరు, బాలయ్యల సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసే విషయంపై చర్చలు జరిపారట. ఓపెనింగ్స్ విషయంలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దని.. రెండు సినిమాలు ఓపెనింగ్స్ పంచుకోవాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం. 

కొందరు డిస్ట్రిబ్యూటర్లయితే.. రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయొద్దని అల్టిమేటం జారీ చేశారట. ఎక్కువ రేట్లు పెట్టి సినిమాలు కొన్నవారు కలెక్షన్స్ రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని.. రెండూ మాస్ సినిమాలే అయినప్పటికీ ఒకేరోజు థియేటర్లలోకి వస్తే ఆశించిన స్థాయిలో లాభాలు రావని వాదిస్తున్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మాత్రం వెనకడుగు వేసే ఛాన్స్ లేదు. మహా అయితే ఒకట్రెండు రోజుల గ్యాప్ లో సినిమాలను రిలీజ్ చేస్తారేమో కానీ వాయిదా వేసే ఆలోచనలో మాత్రం లేరని తెలుస్తోంది. 

News Reels

చిరంజీవి-బాబీ సినిమా విషయానికొస్తే.. ఇందులో హీరో ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడతారట. వింటేజ్ స్టఫ్ తో కూడిన మంచి ఎంటర్టైనర్ గా సినిమా నిలుస్తుందని ఇటీవల చిరు వెల్లడించారు. ఈ సినిమాలో చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  

బాలయ్య సినిమా విషయానికొస్తే.. దీనికి 'వీర సింహారెడ్డి' (Veera Simha Reddy) టైటిల్ ఖరారు చేశారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళ భామ హానీ రోజ్ ఓ పాత్రలో కనిపించనుంది. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. 

Also Read: ‘కాంతార’ సినిమా చూస్తూ ప్రేక్షకుడు మృతి

Published at : 27 Oct 2022 04:05 PM (IST) Tags: Balakrishna Waltair veerayya Chiranjeevi Veerasimhareddy

సంబంధిత కథనాలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

టాప్ స్టోరీస్

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

YSRCP BC Leaders : డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !

YSRCP BC Leaders :  డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !