అన్వేషించండి

Veera Simha Reddy Trailer : మాస్ మొగుడు వెనక్కి - 'వీర సింహ రెడ్డి' ట్రైలర్ ముందుకి!

Balakrishna New Movie Trailer : నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా 'వీర సింహా రెడ్డి'. త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నారు.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy). ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. థియేటర్లలో సినిమా సందడి చేయడానికి పట్టుమని పది రోజులు కూడా లేదు. మరి, ట్రైలర్ ఎప్పుడు?

త్వరలో ట్రైలర్...
పాటను వెనక్కి నెట్టి!
'వీర సింహా రెడ్డి' ట్రైలర్ (Veera Simha Reddy Trailer) ను త్వరలో విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది. తొలుత ఇందులో బాలకృష్ణ, శ్రుతీపై తెరకెక్కించిన 'మాస్ మొగుడు' పాటను జనవరి 3న... అనగా మంగళవారం రాత్రి 7 గంటల 55 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు ఆ పాటను వెనక్కి తీసుకు వెళ్ళారు. 'మాస్ మొగుడు' తర్వాత విడుదల చేస్తామని... ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం పేర్కొంది.
  
సాంగ్స్ సూపర్ హిట్టు
ఇప్పటి వరకు 'వీర సింహా రెడ్డి' సినిమాలోని మూడు పాటలను విడుదల చేశారు. ఆ మూడు పాటల్లో 'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి...' హైలైట్. నారి నారి నడుమ అన్నట్టు.... హీరోయిన్ హానీ రోజ్, 'చీకటి గదిలో చితక్కొట్టుడు' ఫేమ్ చంద్రికా రవితో బాలకృష్ణ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో కూడా ఆ సాంగ్ చాలా  స్పెషల్‌గా ఉండబోతోందని, ప్రేక్షకుల చేత థియేటర్లలో స్టెప్పులు వేయించేలా ఉంటుందని సమాచారం. తొలుత 'జై బాలయ్య' పాటపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ... మెల్లగా జనాల్లోకి ఎక్కేసింది. 'సుగుణ సుందరి' పాటలో శ్రుతీతో బాలకృష్ణ వేసిన స్టెప్పులు కూడా నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Also Read : జనవరిలో తెలుగు థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఏవో చూడండి
 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

దుమ్ము లేపుదాం! - తమన్
సంక్రాంతికి సినిమా చూడాలని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానుల్లో సంగీత దర్శకుడు తమన్ మరింత అంచనాలు పెంచేశారు. 'అఖండ' విజయంలో నేపథ్య సంగీతం ముఖ్య భూమిక పోషించింది. థియేటర్లలో జనాలను ఒక ట్రాన్స్‌లోకి తీసుకు వెళ్ళింది. అయితే, అమెరికాలో కొంత మంది సౌండ్ ఎక్కువైందని కంప్లైంట్స్ చేశారు. బహుశా... ఆ విషయం తమన్ మనసులో బలంగా ఉందనుకుంట!  ''కలుద్దాం... దుమ్ము లేపుదాం! జై బాలయ్య. ఈసారి థియేటర్స్... దయచేసి కంప్లైంట్స్ చేయకండి. ప్రిపేర్ అవ్వండి'' అని తమన్ ట్వీట్ చేశారు. అదీ సంగతి!

Also Read : ఫిబ్రవరిలో ఒకే రోజు నాలుగు సినిమాలు - మళ్లీ థియేటర్ల రచ్చ?

బాలకృష్ణకు దర్శకుడు గోపీచంద్ మలినేని వీరాభిమాని. లుక్స్ పరంగా మరింత కేర్ తీసుకుని, అభిమానులు కోరుకునే విధంగా చూపించారట. సాధారణంగా కమర్షియల్ సినిమాల రన్ టైమ్ రెండున్నర గంటల లోపు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడతారు. అంత కంటే ఎక్కువ ఉన్న సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందులో 'అఖండ' ఒకటి. ఆ సినిమా రన్ టైమ్ రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' రన్ టైమ్ కూడా అటు ఇటుగా అంతే ఉంటుందని సమాచారం.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Venkataram Reddy Arrested: సచివాలయం ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డి మందుపార్టీ- అరెస్టు చేసిన పోలీసులు 
సచివాలయం ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డి మందుపార్టీ- అరెస్టు చేసిన పోలీసులు 
HP Black Friday Deals: బ్లాక్ ఫ్రైడే బంపర్ ఆఫర్ ఇస్తున్న హెచ్‌పీ - ల్యాప్‌టాప్‌లు, పీసీలపై భారీ క్యాష్‌బ్యాక్!
బ్లాక్ ఫ్రైడే బంపర్ ఆఫర్ ఇస్తున్న హెచ్‌పీ - ల్యాప్‌టాప్‌లు, పీసీలపై భారీ క్యాష్‌బ్యాక్!
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Embed widget