News
News
X

Upcoming Telugu Movies : జనవరిలో తెలుగు థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఏవో చూడండి 

కొత్త ఏడాది వచ్చింది. మరి, థియేటర్లలోకి వస్తున్న కొత్త సినిమాలు ఏవో తెలుసా? మరీ ముఖ్యంగా జనవరిలో ఏయే సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయో తెలుసా?

FOLLOW US: 
Share:

Upcoming Telugu Movies January 2023 : తెలుగు ప్రజలు, ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు 2023కి వెల్కమ్ చెప్పేశారు. కొత్త ఏడాదిలో కొత్త సినిమాలు విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ, అసలు ఈ ఏడాది తొలి నెలలో తెలుగు ప్రేక్షకుల ముందుకు థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఏవో తెలుసా? వాటిపై ఓ లుక్ వేయండి. 

సంక్రాంతి సందడి షురూ
తెలుగులో కొత్త ఏడాది మొదలైన తర్వాత థియేటర్లలోకి ముందుగా రానున్న కొన్ని సినిమాల పేర్లు చెబితే ప్రేక్షకులు గుర్తు పట్టడం కష్టమే. తొలి వారంలో మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయి. జనవరి 6న 'దోస్తాన్', 'ఏ జర్నీ టు కాశీ', 'ఎఫ్ఎమ్ 2 డబుల్ మస్తీ' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. జనవరి 1న 'దేవాంతకుడు' అని ఓ చిన్న సినిమా విడుదలైనట్టు టాక్. ప్రేక్షకులు వీటి కోసం కాదు... సంక్రాంతి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సందడి ఆల్రెడీ మొదలైంది. సంక్రాంతికి వస్తున్న సినిమాలు (Sankranti 2023 Movies) చూస్తే...
 
'తెగింపు' వర్సెస్ 'వారసుడు'
తమిళంలో స్టార్ హీరో అజిత్ నటించిన తాజా సినిమా 'తునివు'. దీనికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. కార్తీతో 'ఖాకీ' సినిమా తీసింది ఆయనే. అజిత్ హీరోగా నటించిన 'నెర్కొండ పార్వై' (హిందీ హిట్ 'పింక్' రీమేక్), 'వలిమై' సినిమాలూ ఆయనే తీశారు. అజిత్, దర్శకుడు వినోద్ కలయికలో మూడో చిత్రమిది. తెలుగులో 'తెగింపు'గా విడుదల చేస్తున్నారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. 

మరో తమిళ స్టార్ విజయ్ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ సినిమాకు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత 'దిల్' రాజు తెలుగు వాళ్ళు కావడం విశేషం. 'వారిసు'గా తమిళంలో తెరకెక్కిన సినిమాను తెలుగులో 'వారసుడు'గా విడుదల చేయనున్నారు. జనవరి 12న ఆ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో కూడా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. తమిళంలో 'తునివు', 'వారిసు' సినిమాల మధ్య పోటీ నెలకొంది.    

'వీర సింహా రెడ్డి' వర్సెస్ 'వాల్తేరు వీరయ్య'
'వారసుడు', 'తెగింపు' సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ... మన జనాలు ఎక్కువ ఎదురు చూస్తున్న సినిమాలు 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' కోసమే!

ఫ్యాక్షన్ సినిమాలకు పేటెంట్ రైట్స్ నట సింహం నందమూరి బాలకృష్ణవే అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఫ్యాక్షన్ నేపథ్యంలో చాలా సినిమాలు చేసిన ఆయన, మరోసారి 'వీర సింహా రెడ్డి'తో వస్తున్నారు. దీనికి ఆయన అభిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. 'క్రాక్' తర్వాత ఆయన తీస్తున్న చిత్రమిది. ఈ సినిమా జనవరి 12న విడుదల అవుతోంది.  

చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' అభిమాని దర్శకుడు కావడం విశేషం. మెగా ఫ్యాన్స్ చిరు నుంచి ఏం కోరుకుంటారో, ఆ అంశాలతో బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) సినిమా తీస్తున్నారని ఆల్రెడీ విడుదలైన సాంగ్స్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. 

Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?

సంక్రాంతికి రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ నటించిన 'విద్యా వాసుల అహం', సంతోష్ శోభన్ హీరోగా యువి క్రియేషన్స్ నిర్మించిన 'కళ్యాణం కమనీయం' జనవరి 14న విడుదల కానున్నాయి. మొత్తం సంక్రాంతికి ఆరు సినిమాలు వస్తున్నాయి. 

సంక్రాంతి తర్వాత రిపబ్లిక్ డేకి సందడి!
తెలుగు ప్రేక్షకులు సంక్రాంతి సినిమాల కోసం ఎదురు చూస్తుంటే... పరిశ్రమలో చిన్న మీడియం బడ్జెట్ సినిమాలు తీసిన నిర్మాతలు వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని, పది రోజుల పాటు మరో సినిమా ఏదీ విడుదల కావడం లేదు. సంక్రాంతి సినిమాల రిజల్ట్‌ చూసి... రిలీజ్‌ డేట్స్‌ వేయాలని కొంతమంది చూస్తున్నారు.

సంక్రాంతి తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేటర్లలోకి వస్తాయని చెప్పవచ్చు. అందులో మెయిన్ సినిమా షారుఖ్ ఖాన్ 'పఠాన్' ఒకటి. దానిని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఆ సినిమాలో 'బేషరమ్ రంగ్' పాటలో హీరోయిన్ దీపికా పదుకోన్ బికినీ రంగు కాంట్రావర్సీకి కారణమైంది. అందువల్ల, తెలుగు ప్రేక్షకులకూ సినిమా తెలిసింది. 

రిపబ్లిక్ డేకి వస్తున్న తెలుగు సినిమాల విషయానికి వస్తే... సుధీర్ బాబు 'హంట్' ఒకటి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇందులో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫమే భరత్ కూడా నటించారు. చిత్రా శుక్లా, ఆదర్శ్ ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్ రూమ్ డ్రామా 'గీత సాక్షిగా' కూడా జనవరి 26న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'బుట్ట బొమ్మ' విడుదల కూడా జనవరి 26నే. మరికొన్ని సినిమాలు సమయం కోసం వేచి చూస్తున్నాయి. త్వరలో ప్రకటనలు రావచ్చు.

Also Read : సాయి పల్లవికి శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ అవుతోందా? - 'ఫిదా' బ్యూటీ కండిషన్స్ 'ధమాకా' భామకు ప్లస్సా?

Published at : 01 Jan 2023 07:35 PM (IST) Tags: upcoming telugu movies Telugu Movies January 2023 Sankranti 2023 Movies Republic Day Movies 2023

సంబంధిత కథనాలు

K Viswanath Death: కె.విశ్వనాథ్ కెరీర్‌లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!

K Viswanath Death: కె.విశ్వనాథ్ కెరీర్‌లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!

Sankarabharanam: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ‘శంకరాభరణం’ రిలీజైన రోజే అస్తమించిన కళాతపస్వి!

Sankarabharanam: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ‘శంకరాభరణం’ రిలీజైన రోజే అస్తమించిన కళాతపస్వి!

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Gruhalakshmi February 3rd: ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయేందుకు అభి ప్లాన్- నందు వ్యాపారానికి లాస్య కండిషన్

Gruhalakshmi February 3rd: ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయేందుకు అభి ప్లాన్- నందు వ్యాపారానికి లాస్య కండిషన్

Guppedantha Manasu February 3rd Update: రాజీవ్ అరెస్ట్ తో రిషికి నిజం తెలిసిపోయింది, తనెవరో తెలియాలన్న రిషికి ఫజిల్ వదిలేసిన వసు!

Guppedantha Manasu February 3rd Update: రాజీవ్ అరెస్ట్ తో రిషికి నిజం తెలిసిపోయింది, తనెవరో తెలియాలన్న రిషికి ఫజిల్ వదిలేసిన వసు!

టాప్ స్టోరీస్

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!