అన్వేషించండి

Sai Pallavi Sreeleela : సాయి పల్లవికి శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ అవుతోందా? - 'ఫిదా' బ్యూటీ కండిషన్స్ 'ధమాకా' భామకు ప్లస్సా?

తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా యువతలో శ్రీలీలకు ఇప్పుడు సూపర్ క్రేజ్ ఉంది. మాస్ మహారాజ్ రవితేజకు జంటగా ఆమె నటించిన 'ధమాకా' అందుకు ఉదాహరణ. సాయి పల్లవి పెట్టే కండిషన్లు శ్రీలీలకు ప్లస్ అవుతున్నాయా?

శ్రీలీల (Sreeleela)... శ్రీలీల... శ్రీలీల... ఇప్పుడు తెలుగులో ఎటు చూసినా, ఎక్కడ విన్నా ఆమె పేరు వినబడుతోంది. చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల మాటల్లో మాంచి కమర్షియల్ సినిమాలకు సెట్ అయ్యే కథానాయిక దొరికిందని అంటుంటే... అటు ప్రేక్షకుల్లోని యువతరం ఆమె అందానికి, ముఖ్యంగా డ్యాన్సులకు పడి చస్తోంది. ఫిదా అవుతోంది. అయితే... దర్శక నిర్మాతలకు సాయి పల్లవి (Sai Pallavi) పెడుతున్న కండిషన్స్ శ్రీలీలకు ప్లస్ అవుతున్నాయా?

సాయి పల్లవి... శ్రీలీల... 
ఇద్దరూ బెస్ట్ డ్యాన్సర్లు!
తెలుగు సినిమా కథానాయికల్లో బెస్ట్ డ్యాన్సర్లు ఎవరు? అని ప్రశ్నిస్తే... పరిశ్రమలో ప్రముఖులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా సాయి పల్లవి పేరు చెబుతారు. ఆమె నేపథ్యమే డ్యాన్స్. 'ఢీ' షోలో సాధారణ కంటెస్టెంట్ స్థాయి నుంచి కెరీర్ స్టార్ట్ చేసింది. 'ఫిదా' సినిమాలో ఒళ్లును విల్లులా వంచి చేసిన డ్యాన్సులు ఎవరైనా మరువగలరా? 

సాయి పల్లవి కంటే శ్రీలీల జూనియర్. 'ఫిదా'తో 2017లో తెలుగులో సాయి పల్లవి కెరీర్ స్టార్ట్ చేస్తే... గత ఏడాది విడుదలైన 'పెళ్లి సందD'తో శ్రీలీల కెరీర్ స్టార్ట్ చేశారు. తెలుగులో ఆమె నటించిన సినిమాలు రెండు అంటే రెండు విడుదల అయ్యాయి. ఆ రెండిటితో మంచి డ్యాన్సర్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఆ విషయంలో ఇద్దరికీ సేమ్ మార్కులు పడతాయి. కానీ, అవకాశాలు అందుకునే విషయంలో సాయి పల్లవి కంటే శ్రీలీల కొంచెం ముందు ఉన్నారు. 

సాయి పల్లవి కంటే 
శ్రీలీల ఎందులో బెటర్!?
సాయి పల్లవి మంచి డ్యాన్సర్ మాత్రమే కాదు... అంతకు మించి అద్భుతమైన నటి కూడా! 'ఫిదా'తో నటిగా కూడా ఆమె ప్రూవ్ చేసుకున్నారు. అంతకు ముందు ఆమెను 'ప్రేమమ్'లో చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళూ ఉన్నారు. అయితే... యువ హీరోల సరసన అవకాశాలు అందుకోవడంలో ఆమె కాస్త వెనుకబడి ఉన్నారు. 

'పెళ్లి సందD' విడుదలకు ముందు మాస్ మహారాజ్ రవితేజతో సినిమా చేసే ఛాన్స్ శ్రీలీల సొంతం అయ్యింది. 'ధమాకా' విడుదలకు ముందు భారీ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు. నితిన్ సినిమా కూడా ఆమె ఖాతాలో ఉంది. మరో మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. 

శ్రీలీలకు వస్తున్న అవకాశాలు సాయి పల్లవికి ఎందుకు రావడం లేదు? అని ఓ ప్రశ్న వేసుకుంటే... 'ఫిదా' బ్యూటీ పెడుతున్న కండిషన్లు అని టాలీవుడ్ ఇన్‌సైడ్‌ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. 

మాస్ కమర్షియల్ సినిమాలకు
సాయి పల్లవి దూరం దూరం! 
సాయి పల్లవి తన దగ్గరకు వచ్చిన అన్ని సినిమాలను ఓకే చేయరు. ఆమెకు కొన్ని రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటారు. ధనుష్ 'మారి 2'లోని 'రౌడీ బేబీ' మాస్ కమర్షియల్ సాంగ్ కావచ్చు. ఆ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ మాసీగా ఉండొచ్చు. అది మాస్ సినిమా కావచ్చు. కానీ, సినిమా మొత్తం చూస్తే సాయి పల్లవి రోల్ మాస్ కాదు. ఆమె క్యారెక్టర్ ద్వారా ఓ సందేశం ఇచ్చారు. 

నాలుగు పాటలు, ఐదు సన్నివేశాలు, ఆరేడు సార్లు స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్లు చేసి క్యాష్ చేసుకోవాలని సాయి పల్లవి ఎప్పుడూ అనుకోలేదు. ముఖ్యంగా పక్కా కమర్షియల్ సినిమాలకు ఆవిడ దూరం. అందులోనూ ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ మెసేజ్ మూవీస్ చేస్తున్నారు. తెలుగులో సాయి పల్లవి చేసిన ఒకే ఒక్క కమర్షియల్ సినిమా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'. అది విడుదలైన తర్వాత కొంచెం డిజప్పాయింట్ అయినట్లు తెలిసింది. ప్రాధాన్యం లేని పాత్రలకు దూరంగా ఉండాలని ఆ సినిమా తర్వాత డిసైడ్ అయ్యారట. 

శ్రీలీల అలా కాదు... కమర్షియల్ సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. స్టార్ హీరోల సరసన నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తెలుగులో ఇప్పుడు హీరోయిన్ల కొరత ఉంది. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, శృతి హాసన్, కాజల్ అగర్వాల్, రాశీ ఖన్నా వంటి హీరోయిన్లతో యువ స్టార్ హీరోలు సినిమాలు చేశారు. పూజా హెగ్డేతో కొందరు హీరోలు చేసినా... మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. రష్మిక హిందీ సినిమాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అందువల్ల, కొత్త భామల కోసం చూస్తున్నారు. 

Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?

టార్చ్ వేసి మరీ ఎవరు ఉన్నారు? కొత్త కథానాయిక ఎవరు? అని ఇండస్ట్రీ జనాలు వెతుకుతున్న సమయంలో శ్రీలీల కనపడింది. డ్యాన్సింగ్ స్కిల్స్ ఆమెకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతున్నాయి. హీరోలతో పాటు సమానంగా డ్యాన్స్ చేయగలగడం ఆమెకు కలిసి వచ్చే అంశం. అందువల్ల, ఎక్కువ సినిమా అవకాశాలను శ్రీలీల అందుకుంటున్నారు. 'ధమాకా'కు వస్తున్న వసూళ్ళు, పాటల్లో ఆమె డ్యాన్స్ చేసినప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న రియాక్షన్లు చూస్తుంటే... శ్రీలీలకు మరిన్ని తెలుగు సినిమా అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్నట్టు... తెలుగుకు రావడానికి ముందు ఆమె కన్నడ సినిమాలు చేశారు. ఆ సినిమాలకు అందుకున్న రెమ్యూనరేషన్ కంటే డబుల్, ట్రిపుల్ ఇప్పుడు తెలుగు సినిమాలకు కోట్ చేస్తున్నారట. ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటే అంతకు అంత ఇవ్వడానికి నిర్మాతలు ఎప్పుడూ రెడీనే.  

Also Read : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget