Gopichand Malineni: శృతిహాసన్‌కు ‘ఐ లవ్ యూ’ - ఫన్నీ ట్రోల్స్‌పై స్పందించిన దర్శకుడు గోపీచంద్
గోపిచంద్ మలినేని శృతిహాసన్, వరలక్ష్మీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శృతికి ఐ లవ్ యు అని చెప్తే తను అన్నయ్య అన్నదన్నారు. తన మూవీ క్యారెక్టర్ కు సరిపోతుందనే వరలక్ష్మిని ఓకే చేశామన్నారు.
సంక్రాంతి బరిలో నిలిచి సత్తా చాటిన సినిమా ‘వీరసింహా రెడ్డి’. నట సింహం నందమూరి బాల కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ దుమ్మురేపుతోంది. భారీగా వసూళ్లను సాధిస్తూ మరోసారి మాన్ హీరోగా నిరూపించుకున్నారు బాలకృష్ణ. అయితే, ‘వీరసింహా రెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ధర్శకుడు గోపీ చంద్ మలినేని.. శృతిహాసన్‌కు ‘ఐ లవ్ యూ’ చెప్పడం, ఆమె ఆయన్ని అన్నయ్య అని పిలవడంపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ చక్కర్లు కొడుతున్నాయి.
శృతిహాసన్‌కు ‘ఐ లవ్ యూ’ - ఆ ట్రోల్స్ నేను చూశా: గోపీచంద్
ఈ సినిమా హిట్ అయిన తర్వాత గోపిచంద్ మలినేని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో బాలయ్య, హీరోయిన్ శృతిహాసన్ తో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో బాలయ్య డైలాగుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ఆయనకు సూటయ్యే డైలాగులు మాత్రమే రాసినట్లు చెప్పారు. ఈ సినిమాలో కొన్ని సీన్లలో బాలయ్య కంట తడి పెట్టడం ప్రేక్షకులను కదిలించిందన్నారు. అటు ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ పవర్ ఫుల్ రోల్ చేసినట్లు చెప్పారు. ఈ సినిమాలోని ఆ క్యారెక్టర్ కు తను మాత్రమే సూటవుతుందని భావించినందునే ఓకే చేసినట్లు చెప్పారు. అనుకున్నట్లుగానే తన నటనతో ఈ సినిమాకు ఎంతో ప్లస్ గా మారిందన్నారు. ఈ చిత్రంలో తన కొడుకు నటన చూసి షాక్ అయినట్లు గోపీచంద్ వెల్లడించారు. అనుకున్న దానికంటే బాగా నటించినట్లు చెప్పారు. హీరోయిన్ శృతి హాసన్ తో తనకు బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఉందన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను శృతికి ‘ఐ లవ్ యు’ చెప్తే, ఆమె ‘అన్నయ్య’ అని చెప్పడంపై సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ నడిచిందన్నారు. ఆ ఫన్నీ వీడియోలను చూసి చాలా నవ్వుకున్నట్లు వెల్లడించారు. అయితే, తాను శృతి హాసన్ మాట్లాడిన తర్వాత మాట్లాడానని.. కానీ వాటిని వెనకవి ముందుకు వేసి అలా మీమ్స్ వదిలారని తెలిపారు.
View this post on Instagram
అభిమానులను అలరించిన 'వీర సింహారెడ్డి'
'క్రాక్' విజయం తర్వాత గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం, 'అఖండ' విడుదల తర్వాత బాలకృష్ణ నుంచి వచ్చిన సినిమా కూడా ‘వీర సింహా రెడ్డి’ కావడంతో ఆయన అభిమానుల్లో మంచి ఊపు తీసుకొచ్చింది. ఇందులోని ఫైట్స్ తో పాటు 'వీర సింహా రెడ్డి'గా బాలకృష్ణ యాక్టింగ్ అద్భుతమనే టాక్ వచ్చింది. యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన ఆర్ఆర్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. శృతి హాసన్ కథానాయికగా, హనీ రోజ్ మరో నాయికగా, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతినాయిక ఛాయలు ఉన్న పాత్రలో, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ‘చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.
Read Also: 3 రోజుల్లో రూ.108 కోట్లు రాబట్టిన ‘వాల్తేరు వీరయ్య’ - మరి ‘వీరసింహా రెడ్డి’?