Waltair Veerayya Collections: 3 రోజుల్లో రూ.108 కోట్లు రాబట్టిన ‘వాల్తేరు వీరయ్య’ - మరి ‘వీరసింహా రెడ్డి’?
బాక్సాఫీస్ దగ్గర ‘వాల్తేరు వీరయ్య‘ రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే రూ.100 కోట్లు క్రాస్ చేసింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.
టాలీవుడ్ బాస్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తున్నారు. పూనకాల లోడింగ్ మాత్రమే కాదు, రికార్డుల బ్రేకింగ్ అన్నట్లు వసూళ్ల సునామీ కొనసాగుతోంది. కేవలం మూడు రోజుల్లోనూ మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రికార్డుల్లో నాపేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డులు ఉంటాయనే డైలాగ్‌ను నూటికి నూరు శాతం వాస్తవం చేస్తూ దుమ్ము రేపుతోంది. అయితే, ‘వాల్తేరు వీరయ్య కంటే ముందు విడుదలైన ‘వీరసింహా రెడ్డి’ కూడా నాలుగు రోజుల్లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం గమనార్హం.
మూడు రోజుల్లో రూ.108 కోట్లు వసూళ్లు
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. ఇరత స్టార్ హీరోల సినిమాలతో బరిలోకి దిగినా, తన రేంజిలో రికార్డులు కొల్లగొడుతున్నారు చిరంజీవి. చిరంజీవి, శ్రుతిహాసన్ హీరో, హీరోయిన్ గా నటించిన ఈ సినిమా, ఊరమాస్ కంటెంట్ తో ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తోంది. మాస్ మహారాజ రవితేజ పవర్ ఫుల్ క్యారెక్టర్ తో థియేటర్లలో పూనకాలు లోడింగ్ అయ్యాయి. యాక్షన్ ఎపిసోడ్స్ భలే కుదిరాయి. చిరులో మంచి కామెడీ టైమింగ్ ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.108 కోట్లు సాధించింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. అలాగే, బాలయ్య నటించిన ‘వీరసింహా రెడ్డి’ నాలుగు రోజుల్లో రూ.104 కోట్లు వసూళ్లు సాధించింది.
View this post on Instagram
View this post on Instagram
అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’
చిరంజీవి మాస్ సినిమా చేసి చాలా రోజులైంది. రీ ఎంట్రీలో 'ఖైదీ నంబర్ 150' మినహాయిస్తే... ఆ జానర్‌లో మళ్ళీ చేయలేదు. లుంగీ కట్టి రంగు రంగుల చొక్కాలు వేయడంతో 'వాల్తేరు వీరయ్య'పై మెగాభిమానులు కొంచెం అంచనాలు పెట్టుకున్నారు. రవితేజ ఉండటం, ప్రచార చిత్రాలు సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. ఆఅటు అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. చిరంజీవి, శ్రుతీ హాసన్, రవితేజ, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, 'వెన్నెల' కిశోర్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, ప్రదీప్ రావత్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. స్పెషల్ సాంగ్ లో ఊర్వశి రౌతాలా అదరగొట్టింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు మరింత ప్రాణం పోసింది. అయితే, ‘వీరసింహా రెడ్డి’ మూవీకి కూడా టాక్ బాగానే వచ్చింది. కానీ ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ తర్వాత వసూళ్లు తగ్గాయి. దీంతో రెండో రోజు నుంచే కలెక్షన్స్ డౌన్ అయినట్లు సమాచారం. అయితే, ఈ సంక్రాంతికి విజేత ఎవరనేది ఇప్పట్లో చెప్పడం కష్టమే. కలెక్షన్లు బట్టి చూస్తే మాత్రం ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ముందంజలో ఉంది.
Read Also: నిన్న గోల్డెన్ గ్లోబ్, నేడు క్రిటిక్స్ ఛాయిస్ - అంతర్జాతీయ అవార్డుల వేదికపై సత్తా చాటుతున్న ‘RRR’