Ghani OTT Release: అఫీషియల్ - 'గని' ఓటీటీ రిలీజ్ ప్రకటన
ఏ సినిమా అయినా విడుదలైన నాలుగైదు వారాల తరువాతే ఓటీటీలోకి వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సినిమా రెండు, మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
మెగాహీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా 'గని'. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. రిలీజ్ కి ముందు సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో మొదటి వీకెండ్ లోనే చాలా థియేటర్ల నుంచి సినిమాను తీసేశారు. ఇక 'బీస్ట్', 'కేజీఎఫ్2' లాంటి సినిమాలు విడుదల కావడంతో 'గని' అడ్రెస్ లేకుండా పోయింది.
ఈ సినిమా ఫెయిల్ అయిందని వరుణ్ తేజ్ స్వయంగా ఒప్పుకున్నారు. ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. రిజల్ట్ విఫలమైనా.. లెర్నింగ్ అనేది ఆగదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఏ సినిమా అయినా విడుదలైన నాలుగైదు వారాల తరువాతే ఓటీటీలోకి వస్తుంది. నిర్మాతలు అలానే అగ్రిమెంట్స్ చేసుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సినిమా రెండు, మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
ఇప్పుడు 'గని' సినిమాను కూడా అనుకున్నదానికంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 22న 'గని' ఓటీటీలోకి రానుందని ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' ప్రకటించింది. సయీ మంజ్రేకర్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమాలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి వారు కీలకపాత్రలు పోషించారు.
Also Read: 'ఆచార్య' ప్రీరిలీజ్ ఈవెంట్ - ఎప్పుడు? ఎక్కడ?
Also Read: రామ్ సినిమాలో శింబు మాస్ సాంగ్
View this post on Instagram