By: ABP Desam | Updated at : 17 Apr 2022 03:59 PM (IST)
రామ్ సినిమాలో శింబు మాస్ సాంగ్
యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది వారియర్'. లింగు స్వామి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ను వెల్లడించారు. ఈ సినిమాలో 'బుల్లెట్...' అంటూ సాగే సాంగ్‌ను శింబు ఆలపించారు.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. 'మా హీరో రామ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌తో ఉన్న ఫ్రెండ్షిప్‌తో శింబు 'బుల్లెట్...' సాంగ్ పాడారు. ఇదొక మాస్ నంబర్. సినిమా హైలైట్స్‌లో ఈ సాంగ్ ఒకటి అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఫెంటాస్టిక్ ట్యూన్‌కు, శింబు వాయిస్ యాడ్ అవ్వడంతో సాంగ్ సూపర్ గా వచ్చింది. ఈ పవర్ ప్యాక్డ్ సాంగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. దీంతో పాటు మిగతా పాటలకూ దేవిశ్రీ హిట్ ట్యూన్స్ ఇచ్చారు. ఇటీవల భారీ ఎత్తున ఇంటర్వెల్ సీన్, హీరో హీరోయిన్లపై ఒక పాటను చిత్రీకరించాం. చిత్రీకరణ చివరి దశకు వచ్చింది' అంటూ చెప్పుకొచ్చారు.
ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రామ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని టాక్. ఒకటి పోలీస్ ఆఫీసర్ కాగా.. మరొక గెటప్ ను సస్పెన్స్ గా ఉంచారు. ఈ సినిమా పూర్తయ్యాక బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు రామ్.
Also Read: సెట్స్ లో చూసుకుందాం - రామ్ చరణ్ కి చిరు వార్నింగ్
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్స్టాప్?
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం