News
News
X

Urvashi Rautela Trolled : పాపం ఊర్వశి, రిషబ్ పేరుతో ఆమెకు ఎన్ని తిప్పలో!? మళ్ళీ ట్రోలింగ్ షురూ

రిషబ్... రిషబ్... ఈ పేరును, ఊర్వశి రౌటేలాను ఇప్పట్లో వేరు చేసి చూడలేం ఏమో! రిషబ్... ఆర్పీ... ఊర్వశిని వదలడం లేదు. మరోసారి రిషబ్ పేరు చూపించి సోషల్ మీడియాలో నెటిజనులు ఆమెను ఆడుకుంటున్నారు.

FOLLOW US: 
Share:

ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) జీవితంలో 'రిషబ్' పేరుకు చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) తన కోసం హోటల్ లాబీల్లో గంటల తరబడి వెయిట్ చేసేవాడని, తనను కలవడానికి తెగ ట్రై చేసేవాడని ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి చెప్పడం... ఆ తర్వాత ఆమెకు రిషబ్ పంత్ కౌంటర్ ఇవ్వడంతో పాటు 'చెల్లెమ్మా' అని పేర్కొనడం తెలిసిన విషయాలే. అప్పట్నుంచి సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు.
 
రిషబ్ పంత్ యాక్సిడెంట్ తర్వాత అతడు ఉన్న హాస్పిటల్ ఫోటోను సోషల్ మీడియాలో ఊర్వశి రౌటేలా షేర్ చేయడం కూడా విమర్శలకు కారణమైంది. 'రిషబ్'ను ఊర్వశి వదలడం లేదంటూ కొందరు కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ విమర్శలు పక్కన పెట్టి సినిమాలకు వస్తే...

రిషబ్... ఆర్పీ...
ఊర్వశి సినిమాల్లో!
ఊర్వశి రీల్ లైఫ్‌లో కూడా రిషబ్, ఆర్పీ పేర్లు ఉన్నాయి. రీసెంట్ ఊర్వశి రౌటేలా సోషల్ మీడియా పోస్ట్ చూశారా? రిషబ్ శెట్టి 'కాంతార 2'లో తాను నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇంకేముంది? జనాలకు మంచి మెటీరియల్ దొరికినట్టు అయ్యింది.

ఊర్వశికి రిషబ్ కావాలంతే!
రిషబ్ శెట్టితో దిగిన ఫోటోను పోస్ట్ చేసి 'కాంతార 2'లో నటిస్తున్నట్లు ఊర్వశి రౌటేలా పేర్కొన్నారు. ఆ ఫోటో కింద ''రిషబ్ శెట్టి హాయ్ చెబితే... రిషబ్ చాలు అని చెప్పి ఉంటుంది'' అని ఒకరు... ''అక్కా! నీ జీవితంలో ఎంత మంది 'రిషబ్'లు ఉన్నారు'' అంటూ ఇంకొకరు... ''రిషబ్ పంత్ నహీ తో రిషబ్ శెట్టి సహీ'' అంటూ మరొకరు... ''రిషబ్ పేరు చాలు... మాకు అర్థమైంది'', ''అక్క జీవితంలో అందరూ రిషబ్, ఆర్ఫీలే'' అంటూ ఇతరులు కామెంట్స్ మీద కామెంట్స్ చేశారు. రిషబ్ పేరుతో ఆమెను ఆడుకుంటున్నారు.
 
రామ్ పోతినేని సినిమాలో...
ఆర్పీ అంటే రిషబ్ పంత్ కాదు... రామ్ పోతినేని! - ఈ డైలాగ్ కూడా కొన్ని రోజుల క్రితం వైరల్ అయ్యింది. ఎందుకు అంటే... రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమాలో ఊర్వశి రౌటేలా ఐటెమ్ సాంగ్ చేస్తున్నారు. అప్పట్లో రామ్ పోతినేనితో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తే... 'రిషబ్ పంత్ షార్ట్ ఫామ్ ఆర్పీ, రామ్ పోతినేని షార్ట్ ఫామ్ ఆర్పీ! అందుకే సాంగ్ చేసిందేమో' అని కొందరు కామెంట్ చేశారు. 

Also Read : 80 థియేటర్ల నుంచి ఎనిమిదికి, భారీ లాస్ - జీ5 దెబ్బకు 'వేద' తెలుగు నిర్మాత విలవిల'కాంతార' ప్రీక్వెల్, రామ్ పోతినేని సినిమాలు విడుదల అయ్యే వరకు వాటి గురించి ఊర్వశి రౌటేలా చాలా పోస్టులు చేస్తారు. పోస్ట్ చేసిన ప్రతిసారీ కింద కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ రిషబ్, ఆర్పీ కామెంట్స్ కొన్ని ఉండటం కామన్ అనుకోవాలి. రిషబ్, ఊర్వశి పేర్లు చుట్టూ జరిగే సోషల్ మీడియా హంగామా ఇప్పట్లో ఆగేలా లేదు.  

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సంక్రాంతి హిట్ 'వాల్తేరు వీరయ్య'లో హీరో ఇంట్రడక్షన్ సాంగులో ఊర్వశి రౌటేలా కనిపించారు. గత ఏడాది తమిళ సినిమా 'ది లెజెండ్'లో నటించారు. ఇప్పుడు రామ్ పోతినేని సినిమాలో సాంగ్ చేశారు. 'బ్లాక్ రోజ్' అని తెలుగులో ఓ సినిమా చేశారు. అది విడుదల కావాల్సి ఉంది. 

Also Read : నారా, నందమూరి కుటుంబాలకు ఎన్టీఆర్ దూరమా? చెక్ పెట్టిన బ్రాహ్మణి, ప్రణతి

Published at : 12 Feb 2023 08:48 AM (IST) Tags: Rishabh Pant Ram Pothineni Rishab Shetty Kantara Prequel Urvashi Rautela Trolled

సంబంధిత కథనాలు

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !