Shaakuntalam: సమంత 'శాకుంతలం' ఆలస్యానికి కారణమిదే!
సమంత 'శాకుంతలం' సినిమా ఆలస్యంగా కావడానికి గల కారణాలను గుణశేఖర్ వెల్లడించారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. విడాకుల తరువాత నటిగా తన జోరు మరింత పెంచింది. వరుస ప్రాజెక్ట్ లు ఒప్పుకుంటూ బిజీ స్టార్ గా మారింది. ఇప్పటికే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. కానీ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. చాలా నెలల నుంచి ఈ సినిమా అసలు చర్చల్లోనే లేదు. సమంత సినిమాల లైనప్ లో 'శాకుంతలం' పేరుతో ఒక సినిమా ఉందనే విషయం కూడా జనాలు మర్చిపోయారు.
రీసెంట్ గా చిత్ర నిర్మాత నీలిమ గుణ.. తమ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది తప్ప అంతకుమించి సినిమా గురించి ఏ అప్డేట్ ఇవ్వలేదు. దీంతో సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గుణశేఖర్ ను ట్యాగ్ చేస్తూ సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. 'శాకుంతలం' భారీ గ్రాఫిక్స్ తో ముడిపడ్డ సినిమా అని.. అందుకోసం చాలా సమయం, శ్రమ, అవసరం పడుతున్నాయని.. అందుకే ఈ ఆలస్యం అని చెబుతున్నారు గుణశేఖర్.
ఆడియన్స్ కి మంచి సినిమా అందించాలనేది తమ తాపత్రయమని, అంతవరకు వేచి చూడాలని ఆయన కోరారు. ఇక ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా.. దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో డిఆర్‌పి, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై రూపొందుతోన్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Also Read: కొరటాల, బుచ్చిబాబు సినిమాలు - ఎన్టీఆర్ ప్లాన్ ఇదే!
Also Read: జగపతిబాబు వల్ల డబ్బులు పోగొట్టుకున్నా - త్రివిక్రమ్ సినిమా అందుకే వద్దన్నా: వేణు తొట్టెంపూడి
View this post on Instagram