1134 Telugu Movie: జనవరి 5న నో బడ్జెట్‌తో తీసిన '1134' సినిమా విడుదల
తెలుగు ప్రేక్షకుల దృష్టి అంతా ఇప్పుడు సంక్రాంతి సినిమాలపై ఉంది. అయితే... సంక్రాంతికి ముందు వారంలో నాలుగైదు చిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అందులో '1134' ఒకటి.
![1134 Telugu Movie: జనవరి 5న నో బడ్జెట్‌తో తీసిన '1134' సినిమా విడుదల Upcoming Telugu Movie no budget film 1134 releasing on Jan 5th 1134 Telugu Movie: జనవరి 5న నో బడ్జెట్‌తో తీసిన '1134' సినిమా విడుదల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/1c2485f41a4764a001c594dbfacac2fb1704258343328313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Upcoming Telugu Movies 2024, January 5th releases: సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ఇప్పుడు ప్రేక్షకులందరూ జనవరి రెండో వారంలో వస్తున్న సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే... అంతకు ముందు జనవరి 5న నాలుగైదు చిన్న సినిమాలు వస్తున్నాయి. అందులో '1134' ఒకటి.
జనవరి 5న '1134' విడుదల
ఇప్పుడు కమర్షియల్ సినిమాలతో పాటు కొత్తదనంతో కూడిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ నమ్ముకుని వస్తున్న చిత్రమే '1134'. శరత్ చంద్ర తడిమేటి (Ssharadh Chandra Tadimeti)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.... రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా సంస్థలు '1134'ను తెరకెక్కించాయి. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు సైతం శరత్ చంద్ర చూసుకున్నారు. భరత్ కుమార్ పాలకుర్తి సహ నిర్మాత.
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. జనవరి 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాత శరత్ చంద్ర తడిమేటి తెలిపారు.
Also Read: మహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్... నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో, అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?
''1134' ప్రయోగాత్మక సినిమా. హైదరాబాద్ సిటీలో కొన్నాళ్ళ క్రితం జరిగిన వరుస దొంగతనాలు, వాటికి కారణమైన వ్యక్తులను పట్టుకున్న పోలీసులు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా తీశాం'' అని సహ నిర్మాత భరత్ పాలకుర్తి చెప్పారు. కృష్ణ మదుపు, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్, ఫణి శర్మ, గంగాధర్... '1134' సినిమా ద్వారా ఐదుగురు కొత్త కుర్రాళ్లను శరత్ చంద్ర తడిమేటి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు.
Also Read: ఆ ఓటీటీలో, టీవీలో 'నా సామి రంగ'... డీల్ సెట్ చేసిన కింగ్ నాగార్జున
కారు నంబరే సినిమా టైటిల్?
'హైదరాబాద్ నగరం నిద్రపోతున్న వేళ వాళ్ళు విరుచుకుపడ్డారు' అని అర్థం వచ్చేలా '1134' ట్రైలర్ చివరలో ఓ కొటేషన్ ఉంచారు. మిడ్ నైట్ జరిగిన దొంగతనాల నేపథ్యంలో సినిమా తెరకెక్కించారు.
ఒకరి ఒకరు పరిచయం లేని ముగ్గురు వ్యక్తులు కలిసి తొలుత దొంగతనాలు చేయడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత వాళ్ళకు మరో వ్యక్తి తోడు అవుతారు. ఆ తర్వాత నలుగురు కలిసి ఎన్ని దొంగతనాలు చేశారు? వాళ్ళను యంగ్ పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు? అనేది సినిమా కథగా అర్థం అవుతోంది. ట్రైలర్ చూస్తే ఓ కారును హైలైట్ చేశారు. దాని నంబర్ 1134. చివరకు, దానిని టైటిల్ కింద కన్ఫర్మ్ చేశారు. మరి, కారు కూడా కీ రోల్ ప్లే చేస్తుందేమో చూడాలి
కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం : శ్రీ మురళీ కార్తికేయ, సినిమాటోగ్రఫీ: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి, నిర్మాణ సంస్థలు: రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా, సహ నిర్మాత : భరత్ కుమార్ పాలకుర్తి, దర్శకత్వం : శరత్ చంద్ర తడిమేటి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)