Upasana - Handcrafted Cardle : ఉపాసనకు బహుమతిగా ఊయల - తయారీలో అందరూ మహిళలే
త్వరలోనే హీరో రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రజ్వలా ఫౌండేషన్ తమకు ఊయలను గిఫ్ట్ గా ఇచ్చారని, గర్వంగా ఉందని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు
Upasana : పెళ్లైన పదేళ్ల తర్వాత తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో త్వరలోనే మెగా వారి ఇంట్లో పిల్లల చిన్నారి సందడితో మరిన్ని సంతోషాలు నెలకొంటాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ తరుణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ను పంచుకున్నారు. తనకు ప్రజ్వలా ఫౌండేషన్ గిఫ్ట్ గా ఇచ్చిన ఊయల గురించి చెప్పుకొచ్చారు.
#PrajwalaFoundation అనే హ్యాష్ ట్యాగ్ తో ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఉపాసన... ఊయల ప్రాముఖ్యతను, అది తయారుచేసిన విధానాన్ని వివరించారు. దీన్ని ప్రజ్వల ఫౌండేషన్ లోని కొంతమంది యువతులు తమకు ఈ ఊయలను బహుమతిగా ఇచ్చారని ఉపాసన తెలిపారు. అందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. దీన్ని చేతితో తయారు చేశారని, దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు. ఇది బలం, ఆశకు ప్రతీక అని ఉపాసన పోస్టులో పేర్కొననారు. అంతే కాదు తన బిడ్డ పుట్టినప్పట్నుంచి ట్రాన్స్ ఫార్మ్ అయిన ప్రయాణాన్ని, ఆత్మగౌరవాన్ని సూచిస్తుందని ఆమె రాసుకొచ్చారు. దాంతో ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునితా కృష్ణన్ కు ఉపాసన కృతజ్ఞతలు తెలియజేశారు. వీటన్నింటితో పాటు త్వరలోనే తాము ముగ్గురం కాబోతున్నామని వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె ఫౌండేషన్ నిర్వాహకులను కలిసిన, మాట్లాడిన ఫొటోలను జోడించారు. అంతే కాకుండా వారు ఊయలను తయారు చేస్తున్నప్పటి సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలను కూడా యాడ్ చేశారు.
View this post on Instagram
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోకు నెటిజన్లు చాలా పాజిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. పుట్టబోయే బిడ్డ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కొందరు కామెంట్ చేస్తుండగా... కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ చాలా మంది ఉపాసన పోస్టుకు ప్రతిస్పందిస్తున్నారు. కాగా ఈ వీడియో షేర్ అయిన పది నిమిషాల్లో 10వేలకు పైగా వ్యూస్ రావడం చెప్పుకోదగిన విషయం.
గతేడాది డిసెంబర్ లో రామ్ చరణ్ - ఉపాసన దంపతులు ఈ గుడ్ న్యూస్ ను చెప్పారు. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు ఇతర సెలబ్రెటీలు, ప్రముఖులు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవలే ఉపాసన మరో ఆసక్తికర విషయాన్ని షేర్ చేశారు. తాను ప్రెగ్నెంట్ కాబోతున్నానన్న వార్తను రామ్ కు చెప్పగానే అతడు ఎలా ఫీలయ్యాడో చెప్పారు. తాను ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని రామ్ చరణ్ కు చెప్పగానే తను ఒకే ఒక్క మాట చెప్పారని వెల్లడించింది ఉపాసన. ప్రశాంతంగా ఉండాలని సూచించారు. "నేను ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నాను అని చెప్పగానే.. ఎక్కువగా ఎగ్జైట్ కాకు, ప్రశాంతంగా ఉండు” అని చెప్పినట్లు వివరించింది. ఎందుకైనా మంచిదని మరోసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి ధృవీకరించుకున్నట్లు వెల్లడించింది. అప్పుడు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు వివరించింది. “నేను రామ్‌ని ఎక్కువగా ఇష్టపడతాను. ఆరాధిస్తాను. అతడు నా జీవితంలో ప్రశాంతతకు మూల కారణం. నన్ను నిత్యం ఎంతో ఉత్సాహంగా ఉండేలా చూసుకుంటాడు. నా భావాలను తను పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటాడు. మేము ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే పిల్లలు కనాలి అనుకున్నాం. అలాగే చేస్తున్నాం” అని వెల్లడించింది.
Read Also : Kiara Advani - Jr NTR : ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూలో కియారా అడ్వాణీ - రామ్ చరణ్ సినిమా తర్వాత!