By: Ram Manohar | Updated at : 01 Dec 2022 03:07 PM (IST)
అన్‌స్టాపబుల్ షో లేటెస్ట్ ప్రోమో సురేష్ బాబు, అల్లు అరవింద్, రాఘవేంద్ర రావు పంచ్‌లతో అదిరిపోయింది. (Image Credits: Twitter\ahavideo)
Unstoppable With NBK S2:
నవ్వులే నవ్వులు..
బాలకృష్ణ హోస్ట్‌గా ఆహాలో స్ట్రీమ్ అవుతున్న Unstoppbale సీజన్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్య ఇంత బాగా హోస్ట్ చేయగలడా అని అందరూ ఆశ్చర్యపోయారు. చెప్పాలంటే...ఆయన ఫ్యాన్ బేస్‌ని మరింత పెంచింది ఈ ప్రోగ్రామ్. మొదటి సీజన్ పూర్తయ్యాక..కాస్త గ్యాప్ తీసుకుని ఈ మధ్యే సీజన్ 2 మొదలుపెట్టారు. దీనికీ...మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సారి తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రముఖులైన డైరెక్టర్ రాఘవేంద్ర రావు, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబులను గెస్ట్‌లుగా పిలిచారు. ఈ ప్రోమో ఇటీవలే విడుదలైంది. "తెలుగు సినిమా"కు 90 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను రూపొందించారు. "తెలుగు సినిమా పొత్తిళ్లలో పుట్టిన వాళ్లు. సినిమానే ప్రపంచంగా పెరిగిన వాళ్లు. ఇవాళ మన నిర్మాతలు" అని బాలయ్య బాబు ఇంట్రడ్యూస్ చేయగా...అల్లు అరవింద్, సురేష్ బాబు స్టేజ్‌పైకి వచ్చారు. వెంటనే బాలయ్య బాబు తన హ్యూమర్‌తో అందరినీ నవ్వించారు. "నాకు మీ ఇద్దరినీ చూస్తుంటే...భలే దొంగ,మంచి దొంగ..ఇలాంటి దొంగ సినిమాలన్నీ గుర్తుకొస్తున్నాయి" అంటూ సెటైర్ వేశారు. దీనికి సురేష్ బాబు "కథానాయకుడు లాంటి మంచి సినిమాలు చెప్పొచ్చుగా" అని నవ్వుతూ బదులిచ్చారు. సురేష్ బాబుతో తాను ఆల్‌రెడీ సినిమాలు చేశానని, మన కాంబినేషనే బ్యాలెన్స్
ఉందని బాలకృష్ణ అల్లు అరవింద్‌తో అన్నారు. వెంటనే అల్లు అరవింద్ దీనికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. "మీరు, చిరంజీవి కాంబినేషన్‌తో సినిమా తీద్దామని వెయిట్ చేస్తున్నాను" అని ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే బదులిచ్చారు. దానికి బాలయ్య "అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందప్పుడు" అని పంచ్ వేశారు.
రాఘవేంద్ర రావు అదిరిపోయే పంచ్‌లు..
సురేష్ బాబు గురించి చెబుతూ అల్లు అరవింద్ "ఆయన వెజిటేరియన్" అని అనగా...బాలయ్య "అంటే మీలో ఉన్న మ్యూజిక్ ఆయనలో లేదా" అంటూ సెటైర్ వేయడం నవ్వులు పూయిస్తోంది. ఇదే సమయంలో వెంకీ, బన్నీల ప్రస్తావనా తీసుకొచ్చారు బాలయ్య. "వాళ్లతో ఎలా వేగుతున్నారు" అని ప్రశ్నించగా..."చెప్పుకోలేని కష్టాలు కొన్ని ఉంటాయ్" అని ఫన్నీగా బదులిచ్చారు అల్లు అరవింద్. తెలుగు సినిమా ప్రత్యేకతేంటి అని ఆసక్తికర ప్రశ్న అడిగారు బాలయ్య. దీనికి సురేష్ బాబు "తెలుగు సినిమా థాలీ మీల్స్ లాంటిది" అని ఆన్సర్ ఇచ్చారు.
ఇక డైరెక్టర్ రాఘవేంద్ర రావు స్టేజ్ మీదకు వచ్చీ రాగానే పంచ్ వేశారు. "జీవితమంతా ఈ ఇద్దరితోనే శాండ్‌విచ్ అయి ఉన్నాను. మళ్లీ ఇక్కడ కూడా వీళ్లేనా"అంటూ నవ్వించారు. "రాఘవేంద్ర రావు BA అంటే ఏంటో తెలుసా. బొడ్డు మీద యాపిల్ అని అర్థం" అని అల్లు అరవింద్ వేసిన పంచ్ అదిరిపోయింది. మితభాషి అనుకునే రాఘవేంద్ర రావు కూడా పంచ్‌ల మీద పంచ్‌లు వేశారు. "న్యూటన్ యాపిల్ పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టాడు. నేను ఎక్కడ పడాలో కనిపెట్టాను" అని తనలోని హ్యూమర్‌ను బయట పెట్టారు. నెపోటిజం గురించీ బాలయ్య ప్రశ్నించగా..."ఇది చెప్పినందుకు నన్ను ట్రోల్ చేస్తారు" అని అల్లు అరవింద్ అన్నారు. ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే. ప్రోమో చివర్లో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా బాలయ్య బాబు "జోహార్ ఎన్టీఆర్" అంటూ నివాళి అర్పించారు. ఓ స్పెషల్ సాంగ్ కూడా రూపొందించారు. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలతో కట్ చేసిన ప్రోమో ఇప్పటికే మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక ఫుల్ ఎపిసోడ్ రావడమే బ్యాలెన్స్.
Also Read: Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్‌దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!
Naga Panchami December 6th శివయ్య ఎదురుగానే ప్రాణం వదిలేస్తా.. షాకిచ్చిన పంచమి!
Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!
Jagadhatri December 6th Episode : అవమానంతో రగిలిపోతున్న యువరాజ్.. మీనన్ హ్యాండ్ ఓవర్లో ధాత్రి
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
/body>