అన్వేషించండి

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

OTT Review - Repeat Movie : నవీన్ చంద్ర, మధుబాల, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రిపీట్' సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

సినిమా రివ్యూ : రిపీట్ 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : నవీన్ చంద్ర, మధుబాల, అచ్యుత్ కుమార్, స్మృతి వెంకట్, 'సత్యం' రాజేష్, పూజా రామచంద్రన్, రాఘవ్ విజయ్, మైమ్ గోపి, సుదర్శన్, కాళీ వెంకట్, నవీనా రెడ్డి తదితరులు
మాటలు : కె.వి. రాజమహి
ఛాయాగ్రహణం : పీజీ ముత్తయ్య
సంగీతం : జిబ్రాన్
సహ నిర్మాతలు : విజయ్ పాండి, పీజీ ముత్తయ్య
నిర్మాత : రామాంజనేయులు జవ్వాజి
రచన, దర్శకత్వం : అరవింద్ శ్రీనివాసన్
విడుదల తేదీ: డిసెంబర్ 1, 2022
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

నవీన్ చంద్ర (Naveen Chandra) పోలీస్ ఆఫీసర్ రోల్ చేసిన సినిమా 'రిపీట్' (Repeat Movie). ఇందులో మధుబాల, అచ్యుత్ కుమార్ ప్రధాన తారలు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది. నవీన్ చంద్ర, 'సత్యం' రాజేష్, సుదర్శన్, పూజా రామచంద్రన్ వంటి కొందరిని మినహాయిస్తే... ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక వర్గం పని చేసిన తమిళ సినిమా 'డెజావు' తెలుగు అనువాదం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది. అదీ, ఇదీ ఒక్కటే కథ. మరి, ఈ సినిమా ఎలా ఉంది (Repeat Telugu Review)?

కథ (Repeat Movie Story) : ఓ అర్ధరాత్రి సుబ్రహ్మణ్యం (అచ్యుత్ కుమార్) పోలీస్ స్టేషన్‌కు వెళతాడు. తనను తాను రచయితగా పరిచయం చేసుకుంటాడు. తాను రాసిన కల్పిత కథల్లో పాత్రలు నిజ జీవితంలోకి వచ్చి తనను బెదిరిస్తున్నాయని చెబుతాడు. కంప్లైంట్ తీసుకోమంటాడు. తాగిన మైకంలో ఉన్నాడని పోలీసులు పెద్దగా పట్టించుకోరు. తెల్లారిన తర్వాత డీజీపీ ఆశా ప్రమోద్ (మధుబాల) కుమార్తె పూజ (స్మృతి వెంకట్) కనిపించడం లేదని తెలుస్తుంది. డీజీపీ కన్న కుమార్తె మిస్సింగ్ అని తెలిస్తే పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయని... ఆ కేసును సైలెంట్‌గా ఇన్వెస్టిగేట్ చేయమని ఏసీపీ విక్రమ్ కుమార్ (నవీన్ చంద్ర) కి అప్పగిస్తారు. అతను ఏం చేశాడు? సుబ్రహ్మణ్యం రాస్తున్న కథలో సన్నివేశాలే నిజంగా ఎలా జరుగుతున్నాయి? ఆయన కథకు, ఈ కేసుకు లింక్ ఏమిటి? ఏడాది క్రితం జరిగిన ఓ అమ్మాయిపై నలుగురు ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడిన ప్రదేశంలో పూజ బ్యాగ్ ఎందుకు దొరికింది? చివరకు, విక్రమ్ కుమార్ కేసును ఎలా పరిష్కరించాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Repeat Movie Telugu Review) : 'రిపీట్' అంతా చూశాక... ఓ మేజర్ ట్విస్ట్ రిపీట్ చేసినట్లు ఉంటుంది. ప్రభాస్ 'సాహో'లో ఓ ట్విస్ట్ గుర్తుకు వస్తుంది. అది పక్కన పెడితే... ఇదీ ఓ రివేంజ్ థ్రిల్లర్! దిశా ఎన్‌కౌంటర్ ఘటన ఛాయలు కథలో కీలక మలుపుకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. కథగా చూస్తే... 'రిపీట్' ప్రేక్షకులకు తెలిసిన కథే. కానీ, కొత్తగా చెప్పాలని దర్శకుడు అరవింద్ శ్రీనివాసన్ చేసిన కృషి మొదటి గంటలో స్పష్టంగా కనిపిస్తుంది. 

'రిపీట్' సినిమా మొదలైన గంట వరకు... 'తర్వాత ఏం జరుగుతుంది? అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు? ఎందుకు చేశారంటారు?' వంటి ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో కలిగిస్తూ దర్శకుడు కథను వేగంగా ముందుకు తీసుకు వెళ్ళాడు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా, లాజిక్స్ మిస్ అయినా వదిలేస్తాం. ఎందుకంటే? నవీన్ చంద్ర, అచ్యుత్ కుమార్ అద్భుత నటన రైటింగ్ పరంగా జరిగిన తప్పులను కవర్ చేసింది. ఎప్పుడైతే ఏడాది క్రితం అత్యాచారం జరిగిందని చెబుతారో... అప్పుడు ఆ కేసుకు, అమ్మాయి కిడ్నాప్‌కు లింక్ ఉందని డౌట్ రావడం మొదలవుతుంది. ఆ తర్వాత థ్రిల్లర్ సినిమాలు రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకులకు ట్విస్టులు ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు.
 
ఆసక్తికరమైన కథనంతో, కొత్తగా మొదలైన 'రిపీట్'... పతాక సన్నివేశాలు వచ్చేసరికి రొటీన్ రూటులోకి వెళ్ళింది. అత్యాచార కేసులో పోలీసులు ఒత్తిళ్ళకు తల దించడం, రివేంజ్ వంటివి 'రిపీట్'ను రొటీన్ చేశాయి. అయితే... జిబ్రాన్ సంగీతం  సినిమాను ఇంట్రెస్టింగ్‌గా మార్చింది. పీజీ ముత్తయ్య సినిమాటోగ్రఫీ బావుంది. నేచురల్ లొకేషన్స్‌ను చక్కగా చూపించారు. నవీన్ చంద్ర సన్నివేశాలు మినహా మిగతావి తమిళ సినిమా 'డెజావు'లోనివే. అందువల్ల, కొన్నిచోట్ల డబ్బింగ్ సినిమా చూస్తున్నట్లు ఉంటుంది.
   
నవీన్ చంద్ర, అచ్యుత్ కుమార్, 'సత్యం' రాజేష్, పూజా రామచంద్రన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మధుబాలను చూడటం కొత్తగా ఉంటుంది. సీరియస్‌గా సాగుతున్న కథలో సుదర్శన్‌కు కాస్త నవ్వించే అవకాశం దక్కింది. అప్పుడప్పుడూ తమిళ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న కాళీ వెంకట్, మైమ్ గోపి, స్మృతి వెంకట్ తదితరులు సినిమాలో కనిపించారు. 
   
Also Read : 'తోడేలు' రివ్యూ : తెలుగులో సినిమా హిట్టా? ఫట్టా?

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'రిపీట్'... ఓ డీసెంట్ థ్రిల్లర్! సినిమా స్టార్ట్ అయిన గంట వరకు తల పక్కకు తిప్పలేరు. అంత ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత రొటీన్ ట్రాప్‌లోకి వెళుతుంది. అలాగని, సినిమా బాలేదని చెప్పలేం! కానీ, కంప్లీట్ థ్రిల్లర్ చూసిన శాటిస్‌ఫ్యాక్షన్ ఎక్కడో మిస్ అవుతుంది. వీకెండ్ వేరే ఆప్షన్స్ లేకపోతే ఓ లుక్ వేయొచ్చు. సినిమా నిడివి రెండు గంటలే. 

Also Read : 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' రివ్యూ : 'అల్లరి' నరేష్ ఎన్నికల సినిమాకు ప్రేక్షకులు ఓటేస్తారా? లేదా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Embed widget