Unstoppable With NBK Promo : భార్యకు ఐలవ్యూ చెప్పిన చంద్రబాబు, అల్లుడితో బాలయ్య సరదాలు - 'అన్‌స్టాపబుల్' ప్రోమో అదుర్స్ అంతే!
'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. బావ చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్‌తో బాలకృష్ణ చేసిన సందడి ఎలా ఉందో మీరూ చూడండి.
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' (Unstoppable With NBK Season 2) సెకండ్ సీజన్ సందడి మొదలైంది. అక్టోబర్ 14 (ఈ శుక్రవారం) ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఆ ఎపిసోడ్‌కు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఆయన తనయుడు లోకేష్ (Nara Lokesh) అతిథులుగా వచ్చారు. ఈ రోజు ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు.
''సదా నన్ను కోరుకునే మీ అభిమానం 'అన్‌స్టాపబుల్'ని టాక్ షోలలో టాప్ గా నిలిపింది. మొదటి ఎపిసోడ్‌కు నా బంధువును పిలుద్దాం అనుకున్నాను. కానీ, ప్రజలందరి బంధువు అయితే బావుంటుందని అనిపించింది. అందుకే... మీకు బాబు గారు, నాకు బావగారు'' అంటూ నారా చంద్రబాబు నాయుడుకు బాలకృష్ణ స్వాగతం పలికారు.
'మీ జీవితంలో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి?' అని చంద్రబాబును బాలకృష్ణ అడగ్గా... 'మీకంటే ఎక్కువే చేశాను' అని ఆయన సమాధానం ఇచ్చారు. 'మీరు సినిమాల్లో చేస్తే... నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు చేశా. అమ్మాయిలు కనిపిస్తే బైక్ సైలెన్సర్ తీసేసి డ్రైవ్ చేసేవాళ్ళం' అని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబు చేత తన చెల్లులు భువనేశ్వరికి ఐలవ్యూ చెప్పించారు బాలకృష్ణ. ఆ తర్వాత బావ డ్రసింగ్ స్టైల్ గురించి కూడా డిస్కషన్ పెట్టారు. అల్లుడు లోకేష్ వచ్చిన తర్వాత యూరోప్, మాల్దీవ్స్... ఎక్కడికి వెళ్లినా తన తండ్రి ఇదే స్టైల్ లో ఉంటారని లోకేష్ చెప్పారు. వంటలో భార్యకు సలహాలు ఇస్తానని చెప్పిన బాలకృష్ణ, భార్య మాట వింటానని పబ్లిక్ లో ఓకే అనడానికి తన ఈగో ఒప్పుకోవడం లేదన్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి తన సంసారంలో నిప్పులు పోయడానికి వచ్చారని సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు.
'అన్‌స్టాపబుల్'లో ఏపీ, కుటుంబ రాజకీయాల ప్రస్తావన కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన చంద్రబాబు... '95లో మనం తీసుకున్న నిర్ణయం తప్పా?' అని బాలకృష్ణను ప్రశ్నించారు. మంగళగిరిలో లోకేష్ ఓటమిని కూడా ప్రస్తావించారు. లోకేష్ ఫారిన్ టూర్ ఫొటోస్ కూడా చూపించారు. తన జీవితంలో ఆయన (ఎన్టీఆర్) ఆరాధ్య దైవమని, ఎప్పుడూ గుండెల్లో ఉంటారని చంద్రబాబు తెలిపారు.
'అన్‌స్టాపబుల్ 2'కు...
ఫ్యామిలీ & పొలిటికల్ టచ్!
చంద్రబాబు, బాలకృష్ణ బావ బావ మరుదులు. ఆ తర్వాత వియ్యంకులు కూడా! తన పెద్ద కుమార్తె బ్రాహ్మణిని చంద్రబాబు తనయుడు, మేనల్లుడు లోకేష్‌కు ఇచ్చి బాలకృష్ణ వివాహం చేసిన సంగతి తెలిసిందే. వీళ్ళది చాలా దగ్గరి బంధుత్వం. ఈ ముగ్గురిదీ నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రమఖ పాత్ర! ఈ విధంగా చూసుకుంటే... 'అన్‌స్టాపబుల్ 2'కు బాలకృష్ణ ఫ్యామిలీ అండ్ పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ సెన్సేషనల్ అవుతుందని 'ఆహా' వర్గాలు చెబుతున్నాయి. 'అన్‌స్టాపబుల్ 2' ఫస్ట్ ఎపిసోడ్‌కు చంద్రబాబు, లోకేష్ రావడంతో సగటు సినిమా ప్రేక్షకులు, షో అభిమానులు మాత్రమే కాదు... రాజకీయ వర్గాలు కూడా వెయిట్ చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ, ఏపీ రాజకీయాలకు సంబంధించిన చాలా విషయాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి తెలుగు దేశం పార్టీలో సరైన ప్రాముఖ్యం లభించడం లేదని కొందరు విమర్శలు చేస్తుంటారు. ఆ విషయాలు 'అన్‌స్టాపబుల్ 2' సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌లో డిస్కషన్‌కు వచ్చాయి.
Also Read : మోహన్ బాబు హీరోగా మలయాళ సినిమా రీమేక్ - కన్ఫర్మ్ చేసిన విష్ణు మంచు
విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ కూడా!
'అన్‌స్టాపబుల్ 2'లో ఒక ఎపిసోడ్‌లో యువ హీరోలు విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సందడి చేయనున్నారు. వీళ్ళిద్దరి ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అది విడుదల విడుదల అయ్యేది త్వరలో ప్రకటించనున్నారు.
Also Read : ప్రపంచంలో శ్రీరాముడికి వేల మందిరాలు ఉన్నాయి కానీ సేతు ఒక్కటే - నమ్మకాన్ని సవాల్ చేసే 'రామ్ సేతు'