SSMB On Unstoppable: ఆహా ‘సూపర్’ ఎపిసోడ్ తేదీ వచ్చేసింది.. ఎప్పుడు ప్రసారం కానుందంటే?
అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌కు మహేష్ బాబు గెస్ట్‌గా రానున్నారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో మొదటి సీజన్ ముగింపుకు వచ్చేసింది. సీజన్ చివరి ఎపిసోడ్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా రానున్నారు. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. గతంలో ఈ ఎపిసోడ్ షూటింగ్ అయినప్పుడు కూడా ఫొటోలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి నాలుగో తేదీన ఈ ఎపిసోడ్ స్ట్రీమ్ కానుంది.
ఇంతకుముందు అబ్బాయ్ తారక్ హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు ఫైనల్‌లోనూ, ఇప్పుడు బాబాయ్ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ ఫైనల్ ఎపిసోడ్‌లోనూ మహేష్ బాబే గెస్ట్ కావడం విశేషం. ఈ ఎపిసోడ్ కోసం నందమూరి అభిమానులతో పాటు, సూపర్ స్టార్ అభిమానులు కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు.
అన్‌స్టాపబుల్ మొదటి సీజన్‌లో ఇప్పటివరకు తొమ్మిది ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. మహేష్ బాబు ఎపిసోడ్ 10వది. అయితే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా ఇంకా విడుదల చేయలేదు. ఇప్పటివరకు ఈ షోకు మోహన్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, అనిల్ రావిపూడి, నాని, రానా, ఎస్ఎస్ రాజమౌళి, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ వంటి స్టార్లు వచ్చారు. మహేష్ బాబు ఎపిసోడ్‌తో ఈ సీజన్‌కు ముగింపు పలకనున్నారు.
మొదటి సీజన్ విజయవంతం అయింది. రెండో సీజన్ గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ఐఎండీబీలో కూడా ఈ షో ఏకంగా 9.8 రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇంత సక్సెస్ అయింది కాబట్టి కచ్చితంగా రెండో సీజన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
The most awaited update is here 🤩#UnstoppableWithNBK season finale ft. Superstar @urstrulyMahesh Premieres February 4.
— ahavideoIN (@ahavideoIN) January 20, 2022
Promo soon 💥💥#SSMBOnUnstoppable#NandamuriBalakrishna #MansionHouse @tnldoublehorse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustriesltd #CellPoint pic.twitter.com/DcRBuscgm7
Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!
Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!
Also Read: జయమ్మ జోరు తగ్గట్లేదుగా... మరో పాన్ ఇండియా సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్
Also Read: అమ్మాయిలు స్కూల్ ఎందుకు మానేస్తున్నారో తెలుసా? తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మీ మంచు మద్దతు
Also Read: జనవరి 20 ఎపిసోడ్: తండ్రిని తల్లి దగ్గరకు పంపించేసి రిషి ఒంటరి కానున్నాడా... 'గుప్పెడంత మనసు' గురువారం ఎపిసోడ్...
Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి