అన్వేషించండి

Balakrishna: బుల్లితెరపై బాలయ్య హంగామా.. టాక్‌షోపై ‘ఆహా’ క్లారిటీ.. ఇక పైసా వసూలే!

ఆహాలో బాలయ్య టాక్ షో గురించి చాలా రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. దానిపై క్లారిటీ వచ్చిసింది.

ఆయన కనిపిస్తే.... ఫ్యాన్స్ పండుగ.. డైలాగు చెప్తే.. డైనమైట్లే.. ఇక అడుగేసి షో మెదలుపెడితే.. ఫాన్స్ కు పూనకాలే.. అవును ఇప్పుడు ఇది అఫీషియల్.. బాలకృష్ణ హోస్ట్‌ చేయబోయే.. టాక్‌ షో... ఆహా.. లో స్ట్రీమ్ కాబోతోంది. బాప్‌ ఆఫ్ ది ఆల్ టాక్‌ షో స్ అని ఆహా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. 

నటనలో నలభై ఏళ్లకు పైగా అనుభవం ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు నయా అవతార్‌లో కనిపించనున్నారు. "ఆహా.." వేదికపై "ఓహో" అనిపించడానికి రెడీ అవుతున్నారు. నటనలో, నేచర్‌లో టిపికల్‌ టైప్‌ గా ఉండే... ఎన్బీకే టాక్‌షో చేస్తుండటం... ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బాలయ్య ఫాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. సినిమాల్లో సీరియస్‌ డైలాగులతో అదరగొట్టే బాలకృష్ణ టాక్‌షో ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ టాక్‌షో చేస్తున్నారు అనే వార్త బయటకు వచ్చినప్పుడు ఇండస్ట్రీలో చాలామంది నమ్మలేదు. ఇదేదో రూమర్‌ అనుకున్నారు. కానీ.. ఇప్పుడు ఆహా.. అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో ఆశ్చర్యం.. థ్రిల్‌ కలిసిన ఫీల్‌తో ఉన్నారు. 

వాళ్ల బాటలోనే

లెజండరీ యాక్టర్స్ బుల్లితెర పైకి రావడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. ఆలిండియా సూపర్‌స్టార్ అమితాబ్‌ దీనికి నాంది పలికాడు అనుకోవచ్చు. ఆయన KBC తో వేసిన పునాదితో చాలామంది టీవీతెరపైకి వచ్చారు. షారూఖ్, సల్మాన్ లు టీవీ కార్యక్రమాలు హోస్ట్ చేశారు. మన తెలుగులో కింగ్‌ నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడుతో ఇంట్లోకి అడుగుపెట్టేశాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంట్రీ ఇచ్చేశారు.  బిగ్‌బాస్ మొదటి సీజన్‌ను ఊపేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరుడు... అంటూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. మధ్యలో నానీ కూడా బిగ్‌బాస్ హోస్ట్ చేశారు. చాలా ఏళ్ల క్రితం జగపతిబాబు ఒక షో చేశారు.  సౌత్‌లో కమలహాసన్, సూర్య, కిచ్చా సుదీప్ లాంటి వాళ్లు కూడా టీవీషోలు చేశారు.

 

బాప్‌ ఆఫ్‌ ఆల్‌ టాక్‌షోస్

చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ వీళ్లంతా టీవీ షోస్ చేసినప్పటికీ.. డిజిటల్‌ వేదికపై ఎంట్రీ ఇస్తున్న.. లెజండరీ యాక్టర్.. బాలకృష్ణనే.. అందుకే ఆహా.. దీనిని బాప్‌ ఆఫ్ ఆల్ టాక్‌షో స్‌ అని ప్రచారం చేస్తోంది. ఆహా ప్లాట్‌ఫామ్ పై ఇంతకు ముందు సమంత టాక్‌ షో చేయగా.. రానా దగ్గుబాటి నెంబర్‌వన్ యారీ షో చేశాడు. సో.. తెలుగులో ఓటీటీ వేదికపై డైరక్ట్‌ టాక్‌ షో చేయబోతున్న సీనియర్‌ హీరో బాలకృష్ణనే..  సినిమాల్లో ఎెంత సీరియస్‌ డైలాగులు చెప్పినా బయట మాత్రం బాలకృష్ణ బాగా సరదాగా ఉంటారు. ముఖ్యంగా ఫ్రెండ్సుతో ఉంటే ఆ జోష్ మామూలుగా ఉండదు. రానా దగ్గుబాటి షోలో పూరీ జగన్నాథ్‌తో కలిసి బాలకృష్ణ చేసిన రచ్చ అందరూ చూసే ఉంటారు. తండ్రి వారసత్వం ఉండటంతో బాలకృష్ణకు.. అలనాటి నటులతో సంబంధాలు,  కనెక్టివిటీ ఎక్కువ. బాలకృష్ణకు స్వయంగా భాషా పరిజ్ఞానం ఎక్కువ. మరి బాలకృష్ణకు మాత్రమే సాధ్యమయ్యేలా.. పాత నటులతో రెట్రో ప్ర్రోగ్రామ్ డిజైన్ చేశారో.. లేక బాలయ్య జోష్‌ను ఎలివేట్ చేసేలా.. మాంచి ఎనర్జటిక్‌ ప్రోగ్రామ్ చేస్తున్నారో ట్రైలర్‌ వస్తేనే కానీ తెలీదు. టీజర్‌ పోస్టర్‌ చూస్తే.. మంచి "పైసావసూల్‌" లా కనిపిస్తోంది. చూద్దాం.. ఎలా ఉంటుందో..!

Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Embed widget