News
News
X

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

బాలయ్య షోలో సమంత కనిపించనుందని టాక్. 

FOLLOW US: 
 
తెలుగులో మొదలైన ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మొదటి నుంచి సరికొత్త షోలతో ఆడియన్స్ ను అలరిస్తోంది. అన్నిటికంటే 'అన్ స్టాపబుల్' షో పెద్ద హిట్ అయింది. తొలిసారి బాలయ్య హోస్ట్ చేసిన షో కావడంతో దీనిపై విపరీతమైన బజ్ వచ్చింది. బాలయ్య లాంటి అగ్ర హీరో మిగిలిన స్టార్స్ ను ఇంటర్వ్యూ చేయడంతో ఈ షోకి భారీ పాపులారిటీ వచ్చింది. ఈ ఒక్క షో చూడడానికే సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఒక్కో సెలబ్రిటీని బాలయ్య హ్యాండిల్ చేసిన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన పంచ్ లు, జోక్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.

ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంలో రెండో సీజన్‌కు బాలకృష్ణ, ఆహా ఓటీటీ నిర్వాహకులు రెడీ అయ్యారు. ఇప్పుడు సీజన్ 2కి ముహూర్తం ఫిక్స్ చేశారు. అతి త్వరలోనే కొత్త సీజన్ ప్రారంభం కానుంది. 'దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా'.. అనే క్యాప్షన్ తో మరోసారి బాలయ్య హడావిడి చేయబోతున్నారు. 

మొదటి సీజన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి, రష్మికా మందన్నా తదితరులు సందడి చేశారు. ప్రతి ఎపిసోడ్ ఎంతో ఫన్ గా నడిచింది. ఇప్పుడు సీజన్ 2 కోసం కోసం స్టార్స్ ను గెస్ట్ లుగా తీసుకురాబోతున్నారు. 

అయితే మొదటి ఎపిసోడ్ ఎంతో స్పెషల్ గా ఉండేలా చూస్తున్నారు. ఈ క్రమంలో గెస్ట్ గా చాలా మంది స్టార్స్ పేర్లు వినిపించాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మొదటి ఎపిసోడ్ కి సమంతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. నిజానికి పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ సెట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ ఈ షోకి వచ్చే ఛాన్స్ లేదనిపిస్తుంది. అందుకే వారిద్దరి స్థానంలో సమంతను తీసుకురావాలనుకుంటున్నారు. 

News Reels

గతంలో 'ఆహా' షోలో సమంత 'సామ్ జామ్' అనే టాక్ షోని హోస్ట్ చేసింది. కాబట్టి అల్లు అరవింద్ పిలిస్తే ఆమె కచ్చితంగా బాలయ్య షోలో కనిపించే ఛాన్స్ ఉంది. విడాకులు తీసుకున్న తరువాత సమంత ఒక్క కరణ్ జోహార్ షోలో మాత్రమే కనిపించింది. చాలా మంది ఆమెని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు కానీ ఆమె ఎవరికీ దొరకడం లేదు. ఇప్పుడు 'ఆహా'తో పాటు బాలయ్య హోస్టింగ్ అంటే నో చెప్పకపోవచ్చు. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం బాలయ్య-సమంతల మధ్య సంభాషణ ఎలా ఉంటుందనే ఆసక్తి క్రియేట్ అవుతుంది. మరేం జరుగుతుందో చూడాలి!

Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ

Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్

Published at : 25 Sep 2022 07:56 PM (IST) Tags: samantha Balakrishna Unstoppable Show Unstoppable 2

సంబంధిత కథనాలు

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్  శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

Urvasivo Rakshasivo OTT Release : ఆహా ఓటీటీలోకి 'ఊర్వశివో రాక్షసివో' - రిలీజ్ ఎప్పుడంటే?

Urvasivo Rakshasivo OTT Release : ఆహా ఓటీటీలోకి 'ఊర్వశివో రాక్షసివో' - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి?  పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల