News
News
X

Prabhas : రియల్ లైఫ్‌లోనూ బాహుబలే - పులులను పెంచుకోవాలని ఉందని చెప్పిన ప్రభాస్

శత్రువుకు అన్నం పెట్టే విషయంలో రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్ తనది బాహుబలి అంత విశాలమైన మనసు అని చాటుకున్నారు. 'అన్ స్టాపబుల్' షోలో తనకు పులులు పెంచుకోవాలని ఉందని చెప్పారు.

FOLLOW US: 
Share:

'బాహుబలి' సినిమా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ గుర్తు ఉందిగా! తనను కట్టప్ప వెన్నుపోటు పొడిచినా... తల్లి గురించి జాగ్రత్తలు చెబుతాడు. ప్రాణం తీసిన శత్రువును సైతం ప్రేమగా పలకరిస్తాడు. రియల్ లైఫ్‌లోనూ తనది 'బాహుబలి' లాంటి మనసు అని చాటుకున్నారు.

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ 2' టాక్ షో (Unstoppable With NBK 2)లో ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 1 గురువారం రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. ఆల్రెడీ దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. ప్రభాస్ పెళ్లి చుట్టూ తిరిగిన షోలో కొన్ని ఎమోషనల్ అంశాలు ఉన్నాయి. ప్రత్యేకించి తన పెద్దనాన్న కృష్ణం రాజు నేర్పిన విషయాలపై ప్రభాస్ మనసు విప్పి మాట్లాడారు. కృష్ణం రాజు కాలం చేసిన తర్వాత బయట ఎక్కడా మాట్లాడని ప్రభాస్ పెదనాన్నకు తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

వందల రకాలు వంటలు ఎందుకు అంటే
కృష్ణంరాజు (Krishnam Raju) తిథి రోజున మొగల్తూరుకు అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ప్రభాస్ కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వేల మంది అభిమానులతో మొగల్తూరు నిండిపోయింది. ఆ స్థాయిలో అంత మంది వచ్చినా అందరికీ కడుపునిండా భోజనం పెట్టి ప్రభాస్ పంపించిన తీరును బాలకృష్ణ అభినందించారు. కృష్ణంరాజు వంశం ఆ మర్యాద, ఆ ప్రేమ మీకే సాధ్యం అంటూ బాలయ్య ప్రశంసించారు. ఈ సందర్భంగా తన పెద్దనాన్న తనకు చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నాడు ప్రభాస్. 

ఇంటికి వచ్చిన వాడు శత్రువైనా సరే భోజనం పెట్టి పంపించాలని కృష్ణం రాజు చెబుతూ ఉండేవారన్నాడు ప్రభాస్. వచ్చిన వాడి మీద ఎంత కోపం ఉన్నా వాడు భోజనం చేసే వరకూ ఉండి తిరిగి వాడి ఇంటికో, ఊరికో వెళ్లిన తర్వాత అక్కడకు వెళ్లి గొడవ పడమని చెప్పేవారని గుర్తు చేసుకున్నాడు. కృష్ణం రాజు చెప్పిన మాటలు తన మనసులో బలంగా నాటుకుపోయాయనన్న ప్రభాస్. అందుకే ఆ రోజు అంత మంది వస్తారని ఊహించే భారీగా భోజనాల ఏర్పాట్లు చేశామన్నారు. నాన్ వెజ్ అంటే కృష్ణంరాజుకు విపరీతమైన ఇష్టం అన్న ప్రభాస్... ఆయనకు ఇష్టమైనవన్నీ వండించి ఫ్యాన్స్ కు పెట్టానని గుర్తు చేసుకున్నాడు. మొగల్తూరులో ఆ రోజు వండించిన వంటకాల వీడియోను బాలకృష్ణ షోలో ప్లే చేయించి చూపించారు. 

అడవిని దత్తత తీసుకోవటం ఎందుకు?
హైదరాబాద్ శివార్లలో అడవిని దత్తత తీసుకోవటంపై ప్రభాస్ (Prabhas) ను ప్రశ్నించారు బాలయ్య. ఎవరైనా ఇల్లు కట్టుకుంటారని... పొలం కొనుక్కుంటారని... అడవి పెంచుకోవటం ఏంటని NBK ఫన్ జనరేట్ చేశారు. నేచర్ అంటే ఉన్న ఇష్టం వల్లే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ప్రభుత్వంతో మాట్లాడి ఓ అడవిని దత్తత తీసుకోవటంతో పాటు తన ఖర్చుతో అక్కడికి దగ్గర్లో ఓ ఫామ్ హౌస్ ను ఏర్పాటు చేసుకున్నా అని చెప్పాడు. తనకు బోర్ కొట్టినప్పుడల్లా ఫ్రెండ్స్ ను తీసుకుని దేశంలో ఉన్న అన్ని అడవులు తిరుగుతుంటానని...ఇప్పుడు అంతగా టైం ఉండటం లేదని ఇక్కడే అడవిని దత్తత తీసుకున్నా అని ప్రభాస్ నవ్వేశాడు.

పులులను పెంచుకోవాలనుంది! 
అడవులన్నా, వన్య ప్రాణులన్నా ఏదో తెలియని ఓ ఎమోషన్ అని చెప్పాడు ప్రభాస్. అడవిని దత్తత తీసుకుంటున్నప్పుడు ఇందులో పులులను పెంచుకోవచ్చా? అని ప్రభుత్వ అధికారులను అడిగానని కూడా చెప్పాడు. వాళ్లంతా షాకై అలాంటి పనులు చేయకండని టెన్షన్ పడ్డారని చెప్పాడు ప్రభాస్. ప్రభుత్వం అనుమతిస్తే అడవిలో జంతువులను తీసుకొచ్చి పెంచాలని అనుకుంటున్నట్లు తనలోని వైల్డ్ లైఫ్ లవర్ ని పరిచయం చేశాడు ప్రభాస్.

Also Read : చేసుకుంటా, రాసి పెట్టిలేదు, క్లారిటీ లేదు - పెళ్ళిపై కన్‌ఫ్యూజ్‌ చేసిన ప్రభాస్   
 
నన్ను ఎందుకు పిలవలేదు? - బాలకృష్ణ
ఫామ్ హౌస్ కట్టుకుని తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అందరూ హీరోలను ఇన్వైట్ చేసిన ప్రభాస్...తనను మాత్రం ఎందుకు చేయలేదని బాలకృష్ణ స్ట్రైట్ క్వశ్చన్ అడిగేశాడు. వచ్చే నాలుగు నెలల్లో ఫామ్ హౌస్ లో కలుద్దాం అని...మీకు ఇష్టమైన మందేస్తూ కబుర్లు చెప్పుకుందామని కవర్ చేశాడు ప్రభాస్. ఇప్పుడిలాగే అన్నా..కనీసం తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయవని కోపం ప్రదర్శించగా... అలాంటిది ఏమీ లేదని బాలకృష్ణ నుంచి వచ్చే ఫోన్ కోసం అవసరమైతే నలుగురు మనుషులను ప్రత్యేకంగా పెడతానని బుజ్జగించాడు ప్రభాస్.

Also Read : 'లక్కీ లక్ష్మణ్' రివ్యూ : 'బిగ్ బాస్' సోహైల్ సినిమా ఎలా ఉందంటే?

Published at : 30 Dec 2022 02:32 PM (IST) Tags: Balakrishna Krishnam Raju Prabhas Unstoppable 2 Prabhas Adopted Forest

సంబంధిత కథనాలు

K Viswanath Death: కె.విశ్వనాథ్ కెరీర్‌లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!

K Viswanath Death: కె.విశ్వనాథ్ కెరీర్‌లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!

Sankarabharanam: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ‘శంకరాభరణం’ రిలీజైన రోజే అస్తమించిన కళాతపస్వి!

Sankarabharanam: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ‘శంకరాభరణం’ రిలీజైన రోజే అస్తమించిన కళాతపస్వి!

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Gruhalakshmi February 3rd: ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయేందుకు అభి ప్లాన్- నందు వ్యాపారానికి లాస్య కండిషన్

Gruhalakshmi February 3rd: ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయేందుకు అభి ప్లాన్- నందు వ్యాపారానికి లాస్య కండిషన్

Guppedantha Manasu February 3rd Update: రాజీవ్ అరెస్ట్ తో రిషికి నిజం తెలిసిపోయింది, తనెవరో తెలియాలన్న రిషికి ఫజిల్ వదిలేసిన వసు!

Guppedantha Manasu February 3rd Update: రాజీవ్ అరెస్ట్ తో రిషికి నిజం తెలిసిపోయింది, తనెవరో తెలియాలన్న రిషికి ఫజిల్ వదిలేసిన వసు!

టాప్ స్టోరీస్

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!