Raghava Lawrence: 'అవసరం ఉన్నప్పుడు సాయం తీసుకున్నా, ఇకపై వద్దు' - రాఘవ లారెన్స్ నుంచి రెండు అప్డేట్స్!
ఇప్పటివరకు తన ట్రస్ట్ కోసం ఇతరుల సాయం తీసుకున్నారు లారెన్స్. చాలా మంది లారెన్స్ చేసే పనిని కొనియాడుతూ డొనేషన్స్ ఇచ్చేవారు.
నటుడు,కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరోగా.. రాఘవ లారెన్స్ తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఓ పక్క తన వర్క్ తో బిజీగా ఉంటూనే.. మరోపక్క సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. 'లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్' పేరుతో ఎందరినో ఆదుకున్నారు. వృద్ధులతో పాటు అనాథలను కూడా చేరదీశారు. ఎందరో పిల్లలను పెంచి.. వారికి ఉన్నత భవిష్యత్తు అందేలా చూస్తున్నారు.
అయితే ఇప్పటివరకు తన ట్రస్ట్ కోసం ఇతరుల సాయం తీసుకున్నారు లారెన్స్. చాలా మంది లారెన్స్ చేసే పనిని కొనియాడుతూ డొనేషన్స్ ఇచ్చేవారు. ఇకపై తనకు డొనేషన్స్ పంపించొద్దని లారెన్స్ రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం తన పరిస్థితి బాగుందని.. కాబట్టి తన ట్రస్ట్ కి సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలన్నీ తానే చూసుకుంటానని.. అవసరం ఉన్నప్పుడు ఎందరో సాయం చేశారని.. ఇకపై ఆ బాధ్యతలన్నీ తానే చూసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు లారెన్స్.
అలానే ఆయన నటిస్తోన్న 'చంద్రముఖి2' సినిమా అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ సినిమా కోసం బాగా కండలు పెంచారు లారెన్స్. తన మేకోవర్ ఫొటోలను షేర్ చేస్తూ.. ట్రైనర్ శివకి ధన్యవాదాలు చెప్పారు. పి.వాసు దర్శకత్వంలో 'చంద్రముఖి2' సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత సంస్థ లైకా.. 'చంద్రముఖి2'ని నిర్మించనుంది. పార్ట్ 1లో నటించిన కమెడియన్ వడివేలు పార్ట్ 2లో కూడా కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. తోటతరణి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేయనున్నారు.
Hi everyone! I want to share a small update about Chandramukhi 2 and my trust! pic.twitter.com/jLPrVm7q3N
— Raghava Lawrence (@offl_Lawrence) September 13, 2022
కృష్ణంరాజుకి లారెన్స్ నివాళి:
ఈ విషయం పక్కన పెడితే.. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న రాఘవ లారెన్స్ ఎమోషనల్ అయ్యారు. కడసారి చూపు నోచుకోలేక పోవడం నా దురదృష్టం అంటూ తన సంతాపాన్ని తెలిపారు. గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి 'రెబల్' అనే సినిమాను తెరకెక్కించారు లారెన్స్. తాను కృష్ణంరాజు గారిని మిస్ అవుతున్నానని ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని తన పిల్లలలాగే చాలా కేర్ తీసుకుంటారని అన్నారు.
ఒక తల్లి పిల్లలకు ఎలా అయితే ఆలనా పాలనా చూస్తుందో ఆయన కూడా సెట్లో ప్రతి ఒక్కరు తిన్నారా లేదా అనే విషయాన్ని చూస్తూ ఉంటారని, తినని వారికి తల్లి లాగే కొసరి కొసరి తినిపిస్తారని చెప్పుకొచ్చారు. తాను ఆ ప్రేమను, కేర్ ని మిస్ అవుతున్నానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం తన దురదృష్టం అని అందుకే ఆయనను కడసారి చూసుకోలేకపోయాను అని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఆయన లెగసీ ప్రభాస్ గారి ద్వారా కొనసాగుతుందని తాను ఆశిస్తున్నట్లు రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు.
Also Read : గుణశేఖర్ అవుట్ - త్రివిక్రమ్ చేతికొచ్చిన రానా డ్రీమ్ ప్రాజెక్ట్!
Also Read : మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలే - సినిమా జానర్ రివీల్ చేసిన రాజమౌళి