అన్వేషించండి

Ali Reza: ఎంత చెప్పినా వినలేదు, బిగ్‌బాస్‌కి వెళ్లివచ్చాక బ్యాన్‌ చేశారు

Ali Reza: అలీ రెజా... పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరలో, వెండితెరలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ కండల వీరుడు. అయితే, తనను రెండేళ్లు ఎందుకు బ్యాన్‌ చేశారో చెప్పుకొచ్చాడు.

Ali Reza Emotional About Ban On Him: అలీరెజా.. బుల్లితెర కండలవీరుడు. అమ్మాయిల్లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న నటుడు. అటు సీరియల్లు, ఇటు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. మంచి మంచి క్యారెక్టర్లు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బిగ్‌బాస్‌లో అయితే, మంచి ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్నాడు అలీ. అయితే, అలీ రెజాని ఒక ఛానెల్‌ బ్యాన్‌ చేసింది. దాదాపు రెండేళ్ల పాటు ఆయనతో ఎలాంటి షోలు, సీరియల్స్‌ చేయొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. దానిపై క్లారిటీ ఇచ్చారు అలీ. అసలు ఏం జరిగిందో ఒక ఇంటరవ్యూలో చెప్పారు ఆయన. ఆ టైంలో చాలా బాధపడ్డానని, కానీ.. జీవితంలో ఏది జరిగినా మన మంచికే అని అనుకున్నానని చెప్పారు ఆయన. 

ఎంత చెప్పినా వినలేదు.. చాలా బాధపడ్డాను.. 

తను ఎంత చెప్పినా వినకుండా తనపై బ్యాన్‌ విధించారని చెప్పాడు అలీ. బ్యాన్‌కి గల కారణాలను వివరించారు ఆయన."నేను బిగ్‌బాస్‌కి వెళ్లినందుకు బ్యాన్‌ చేశారు. ముందు వెళ్లేందుకు పర్మిషన్‌ ఇచ్చారు. బయటికి వచ్చాక తిరిగి సీరియల్‌లో జాయిన్‌ అవ్వాలి అనుకున్నాను. సీరియల్‌ క్లోజ్ చేయాలి అనుకుంటున్నారని వేరేవాళ్లు చెప్పారు. ఇక బిగ్‌బాస్‌ స్టేజ్‌ మీద ఉన్నప్పుడే నాగార్జున గారు 'వైల్డ్‌డాగ్‌ 'గురించి చెప్పారు. రేపు వెళ్లి సాల్మన్‌ డైరెక్టర్‌ని కలవాలి అన్నారు. వెళ్లి కలిశాను. వెంటనే ఓకే అయిపోయింది. ఫైటింగ్‌ సీన్స్‌ కోసం స్పెషల్‌గా థాయిలాండ్‌ నుంచి ఫైట్‌ మాస్టర్స్‌ వచ్చారు. చాలా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లో ఉంది సినిమా. కానీ, కరోనా వల్ల చాలా మార్చారు. ఇక రోజూ పొద్దున్నే ప్రాక్టిస్‌ ఉండేది. రెండు రోజులు రాకపోతే.. సినిమాలో నుంచి వెళ్లిపోవాలి అని ముందే చెప్పారు. అప్పుడే సీరియల్‌ వాళ్లు కూడా పిలిచి సీరియల్‌ క్లోజ్‌ చేసేస్తున్నాం.. నువ్వు రావాలి అన్నారు. నేను వస్తాను అని చెప్పాను. కానీ, టైమింగ్స్‌ని బట్టి వస్తానని చెప్పాను. దీనిపై చర్చలు జరుగుతుండగానే.. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌కి పిలిచారు. అక్కడ వాళ్లకు అన్నీ వివరించాను. ఆ తర్వాత ఒకరోజు 'వైల్డ్‌డాగ్‌' షూట్‌లో ఉన్నాను. నేను నాగార్జున గారు షూట్‌ చేస్తున్నాం. అప్పుడు ఫోన్‌ వచ్చింది కౌన్సిల్‌లో మీటింగ్‌ ఉంది రావాలి అని అన్నారు. నేను రాలేను.. సాయంత్రం ఒక గంట పర్మిషన్‌ తీసుకుని డైరెక్ట్‌గా మీ దగ్గరికి వస్తాను అని చెప్పాను. "మేం పిలిచినా వాడు రావట్లేదు, బలుపు" అనుకున్నారు. రెండు రోజులు తర్వాత అకస్మాత్తుగా ఒక స్క్రీన్‌షాట్‌ వచ్చింది. దాంట్లో నన్ను బ్యాన్‌ చేసినట్లు ఉంది. రెండేళ్లు ఎవ్వరూ షూటింగ్‌కి పిలవొద్దు అని ఉంది. చాలా బాధపడ్డాను. ఇలా ఎలా చేస్తారు? అని అనుకున్నాను. కానీ, ప్రతీది మన మంచికే జరుగుతుంది అనుకోవాలి" అని అన్నారు అలీరెజ. 

సీరియల్స్‌తో తన కెరీర్‌ మొదలుపెట్టారు అలీరెజ. ఆ తర్వాత బిగ్‌బాస్‌కి వెళ్లారు. బిగ్‌బాస్‌ తర్వాత సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి అతనికి. వెబ్‌సిరీస్‌, సినిమాలతో బిజీ అయిపోయారు అలీ. అప్పట్లో ఒక సినిమాలో హీరోగా కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. అయితే, అలీ రెజాతో పాటు ‘పసుపు కుంకుమ’ సీరియల్‌లో నటించిన పల్లవి గౌడపైన కూడా గతంలో బ్యాన్‌ విధించిన విషయం తెలిసిందే. ఆ బ్యాన్‌ అయిపోవడంతో ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. 

Also Read: 'చారి 111' ఓటీటీ మూవీనా? అసలు విషయం చెప్పిన వెన్నెల కిశోర్

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today November 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి నిజం చెప్పిన ఎస్సై – భయంతో పార్థు కోసం వెతికిన మను
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి నిజం చెప్పిన ఎస్సై – భయంతో పార్థు కోసం వెతికిన మను
Meghasandesam Serial Today November 14th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్ చంద్రకు మీరా వార్నింగ్‌ - కోపంతో రగిలిపోయిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్ చంద్రకు మీరా వార్నింగ్‌ - కోపంతో రగిలిపోయిన అపూర్వ
Jagadhatri Serial Today Nov 13:సుధాకర్‌ కుటుంబాన్ని పండుగకు ఆహ్వానించిన జగధాత్రి తండ్రి..అత్తింట్లో కేదార్‌కు అవమానాలు
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌ కుటుంబాన్ని పండుగకు ఆహ్వానించిన జగధాత్రి తండ్రి..అత్తింట్లో కేదార్‌కు అవమానాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌కి అమ్మవారు! కనికరం లేకుండా బయటకు గెంటేసిన పద్మాక్షి, సహస్ర!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌కి అమ్మవారు! కనికరం లేకుండా బయటకు గెంటేసిన పద్మాక్షి, సహస్ర!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Gautam Gambhir Fire: బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Bigg Boss Season 10 Today November 13th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Embed widget