Vennela Kishore's Chaari 111 : 'చారి 111' ఓటీటీ మూవీనా? అసలు విషయం చెప్పిన వెన్నెల కిశోర్
Chaari 111 :కమెడియన్ 'వెన్నెల' కిశోర్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'చారి 111'. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. అయితే, దాన్ని డైరెక్టర్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్నారట.
Vennela Kishore About Chaari 111 : కమెడియన్‌గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు 'వెన్నెల' కిశోర్. ఆయన సినిమాలో ఉన్నాడంటే ఆ సినిమాలో కామెడీ పండినట్లే. ఇక ఇప్పుడు ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 'చారి 111' ద్వారా హీరోగా తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు వెన్నెలో కిశోర్. ఆయన నటించిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు 'వెన్నెల' కిశోర్. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు పంచుకున్నారు.
ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు...
'చారి 111' సినిమాని థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయాలని ముందుగా చిత్ర బృందం ప్లాన్ చేసిందని ఆయన అన్నారు. "నిజానికి ఈసినిమాని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయాలి అనుకున్నారు. నేను చాలా బిజీ నటుడిని, ప్రమోషన్స్ చేసేందుకు టైమ్ ఉండదనే ఉద్దేశంతో ఓటీటీలో రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఓటీటీలో రిలీజ్ చేయాలంటే పెద్దగా ప్రమోషన్స్‌తో పనిలేదనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఓటీటీలో మారిన రూల్స్, తదితర కారణాల వల్ల థియేటర్లలో రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు" అని చెప్పారు 'వెన్నెల' కిశోర్. థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ఇప్పటికే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. 'చారి 111' సినిమా ష్యూర్ షాట్ ఎంటర్‌టైనర్ అంటూ సినిమాకి సంగీతం అందించిన సైమన్ కె కింగ్ అన్నారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ''సినిమాను లాక్ చేశాం. లోడ్ చేశాం. థియేటర్లలో బుల్లెట్ తరహాలో పేలడానికి రెడీగా ఉంది'' అంటూ ఆయన చెప్పిన మాటలు వెన్నెల కిశోర్ అభిమానులను ఖుషి చేస్తున్నాయి.
'చారి 111' సినిమాలో 'వెన్నెల' కిశోర్ సరసన తమిళమ్మాయి సంయుక్తా విశ్వనాథన్ నటించారు. తెలుగులో ఆమెకు ఇది ఫస్ట్ సినిమా. ఇంతకు ముందు తమిళంలో వెబ్ సిరీస్, సినిమాలు చేశారు. ఈ సినిమాలో సంయుక్తతో యాక్షన్ సీక్వెన్సులు, స్టంట్స్ కూడా చేయించారు. ఈ సినిమాకి టీజీ కీర్తి కుమార్ డైరెక్టర్. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషించారు ఈసినిమాలో. బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, 'తాగుబోతు' రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. సైమన్ కె కింగ్ సంగీతం అందించారు.
ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఆసక్తిని పెంచేసింది. దీంతో సినిమా ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాలో 'వెన్నెల కిశోర్' గూఢచారిగా కనిపించనున్నారు. ప్రశాంతంగా ఉండే నగరానికి ప్రమాదం రావడంతో... ఆ కేసును పరిష్కరించడానికి కన్ ఫ్యూజ్డ్ స్పై చారి వస్తారు. అతను ఎలా సాల్వ్ చేశానేది? సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా ఛేదించాడు అనేదే ఈ సినిమా. ఇక ఈ జనరేషన్ కమెడియన్లలో తనకంటూ సెపరేట్ కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఈ సినిమాలో ఏ విధంగా నవ్విస్తారో థియేటర్లలో చూడాలి.
Also Read: అప్పుడు అలాంటి సీన్స్ చేయనని చెప్పాను - కానీ, ఇప్పుడు మనసు మార్చుకున్నా: అనన్య నాగళ్ల