Rangula Ratnam July 13th: ‘రంగులరాట్నం’ సీరియల్: నవ్వుతూనే లోకం విడిచిన వర్ష, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు?
వర్ష ఈ లోకాన్ని వదలడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Rangula Ratnam July 13th: సీతా రఘు కి ఫోన్ చేసి వర్ష పరిస్థితి బాలేదు అని.. మరికొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పటంతో రఘు తట్టుకోలేక ఏడుస్తాడు. అంతేకాకుండా వర్ష మామయ్య గారికి కళ్ళు ఇస్తానని అన్నదని అంటుంది. దాంతో రఘు తను చనిపోతానని తెలిసి నాన్నకు కళ్ళు ఇవ్వటానికి సిద్ధమయింది అని బాధపడతాడు. అప్పుడే పూర్ణ వచ్చి ఫోన్ లో ఎవరు అని ఫోన్ లాక్కొని మాట్లాడుతుంది.
దాంతో సీత వర్ష పరిస్థితి బాలేదు అత్తయ్య అంటూ ఏడుస్తుంది. ఏం జరిగింది అని పూర్ణ అడగటంతో.. మొత్తం విషయం చెబుతుంది సీత. దాంతో పూర్ణ ఫోన్ కింద పడేసి కుప్పకూలి ఏడుస్తుంది. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని బాధపడుతుంది. వెంటనే హాస్పిటల్ కి వెళ్దాము అని బయలుదేరుతుంది. మరోవైపు హాస్పిటల్లో డాక్టర్ ఆకాష్ దగ్గరికి వచ్చి ఆశలు వదులుకోమని చెప్పి అందరికీ కబురు చేయమని అంటాడు.
దాంతో ఆకాష్ చాలా బాధపడతాడు. అక్కడే ఉన్న సీత మీ అమ్మానాన్నలకు కూడా ఈ విషయం చెప్పు అని అంటుంది. రఘు, పూర్ణ కారులో బాగా ఎమోషనల్ గా వస్తూ ఉంటారు. ఇక ఆకాష్ వర్ష దగ్గరికి వెళ్లి ఎమోషనల్ గా మాట్లాడుతూ బాగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే పూర్ణ అమ్మ వర్ష అని ఏడుస్తుంది. ఇక వర్ష తన తల్లి తో ఆఖరి చూపులు చూసుకుంటూ నవ్వుతూ మాట్లాడుతుంది.
నువ్వు నాన్న కలవాలన్న కోరిక కోరిక లాగానే మిగులుతుంది అని బాధపడుతుంది. అప్పుడే తన అత్తమామలు కూడా వచ్చి.. ఇలా జరిగిందేంటమ్మా అని ఏడుస్తూ ఉంటారు. ముందే ఈ విషయం ఎందుకు చెప్పలేదు అనటంతో.. మీరు తట్టుకోలేరని చెప్పలేకపోయాను అని అంటుంది. ఇక అదే సమయంలో సత్యం, జానకి వస్తారు.
ఇక సత్యంని చూసి మామయ్య అంటూ పిలుస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కడుపు నింపావు అని అంటుంది. తాకట్టు పెట్టిన తాళిని విడిపించి తీసుకొచ్చావు అని అంటుంది. నాకోసం మరో పని చేయవా అని అంటుంది. దాంతో సత్యం ఏదైనా చేస్తాను అనడంతో.. నాన్న అమాయకుడు అని.. ఎవరు ఏది చెప్పినా నమ్ముతాడు అని.. కాబట్టి నాన్నను చూసుకోవాలి అని అంటుంది.
దానితో సత్యం శంకర్ ప్రసాద్ నే కాదు తన ఫ్యామిలీని కూడా చూసుకుంటాను అని మాట ఇస్తాడు. ఇక సిద్దు దంపతులు కూడా వచ్చి.. గతంలో చాలా సార్లు బాధ పెట్టాము అని క్షమాపణలు చెప్పుకుంటారు. స్వప్న కూడా ఆడపడుచు అని చూడకుండా చాలా కష్టాలు పెట్టాను.. ఇప్పుడు మారిపోయాక నువ్వు మాకు దూరం అవుతున్నావు అని అంటుంది.
ఇక అందరూ ఒకేసారి రావడానికి చూసి వర్ష సంతోషంగా కనిపిస్తుంది. అందరూ ఎప్పుడు ఇలా కలిసి ఉంటే బాగుంటుంది అని అంటుంది. అంతే కాకుండా తన కళ్లను తన తండ్రికి ఇవ్వటానికి సిద్ధమయ్యాను అని.. ఆ కళ్లతోనైనా అందర్నీ చూస్తాను అనడంతో అందరూ బాధపడతారు. ఇక పూర్ణని తన కళ్ళు నాన్నకు ఇవ్వమనడానికి మాట ఇవ్వమని అంటుంది. దాంతో పూర్ణ ఒప్పుకోవటంతో వర్ష నవ్వుతుంది. నవ్వుతూనే కాలం విడుస్తుంది. ఇక వర్షను చూసి అందరూ కన్నీరు మున్నీరవుతారు.
తరువాయి భాగంలో శంకర్ ప్రసాద్ తో మీకు ఒక మంచి మనసున్న వ్యక్తి కళ్ళు ఇచ్చారు అని సత్యం వాళ్ళు చెప్పటంతో దాంతో ప్రసాద్ తనకు కళ్ళు ఎవరు ఇచ్చారు వాళ్ళకు నమస్కారాలు అని చేతులు జోడించి అనటంతో.. వెంటనే పూర్ణ మీరు ఆ వ్యక్తికి అలా దండం పెట్టొద్దు అని అంటుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial