Trinayani Serial Today October 22nd: 'త్రినయని' సీరియల్: ప్రాణంగా ప్రేమించిన భర్త చేతిలోనే నయని మృత్యువు.. హాసిని అబద్ధం చెప్పిందెందుకు?
Trinayani Today Episode హాసిని వల్ల నయనికి గండం లేదని విశాల్ వల్ల ఉందని విశాలాక్షి నిరూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode హాసిని జ్యూస్‌లో విషం కలిపినా ఎవరూ ఎందుకు ఏం అనలేదు అని సుమన భర్తలో లాగాడుతుంది. హాసిని మంచి మనసున్నదని తనని అనుమానిస్తే పాపం అని విక్రాంత్ అంటాడు. ఇక సుమన తన చేతిలో ఉన్న మరో విషం బాటిల్ చూపించి హాసిని అక్క జ్యూస్‌లో విషం కలిపిందని అన్నారు మరి ఇది ఎక్కడిదని అడుగుతుంది. దాన్ని విక్రాంత్ తీసుకొని ఇది ఎక్కడిది అని అడిగితే చెత్త బుట్టలో దొరికిందని చెప్తుంది. దాంతో విక్రాంత్ మనసులో ఇంకా ఎవరో దీన్ని వాడాలనుకున్నారని అనుకుంటాడు.
రాత్రి గాయత్రీదేవి ఫొటో కింద ఓ పాత్రలో నీళ్లు ఉంటాయి. వాటిలో పావనా మూర్తి చేయి తిప్పుతూ ఉంటే విశాలాక్షి వచ్చి నీటిని అలా వృథా చేయొద్దని అంటుంది. ఇక విశాలాక్షి ఆ నీటిలో నయనికి మృత్యు గండం రావడానికి కారకులు ఎవరో చూపిస్తానని చెప్తుంది.
సుమన: ఇంకెవరూ హాసిని అక్క అని చెప్పేశారు కదా.
విశాలాక్షి: చెప్పేశావా పెద్దమ్మా.
హాసిని: చెప్పాను కదా మీరు చూశారు కదా. పొద్దున్న అదే కదా జరిగిన రభస.
తిలోత్తమ: మధ్యాహ్నం విష ప్రయోగంలో ఫెయిల్ అయింది కూడా.
పావనా: జస్ట్ మిస్ అంతే.
విశాలాక్షి: సోదరా ఒక్క నిమిషం నేను వెళ్లే ముందు ఒక్క విషయం చెప్పి వెళ్లాలి. నయని అమ్మను మీలో ఎవరు కాపాడుతారు.
విక్రాంత్: అదేం ప్రశ్న విశాలాక్షి మేం అంతా ప్రాణాలు అడ్డు పెట్టి మరీ కాపాడుకుంటాం.
విశాల్: అందులో అనుమానమే లేదు నయని అంటే అందరికీ అభిమానం.
సుమన: నా కోసం నేను చెప్పుకోవడం కాదు కానీ తోడ పుట్టింది కాబట్టి ముందు ఉంటాను.
తిలోత్తమ: మేం అంతే.
హాసిని: నేను పోయినా పర్లేదు కానీ చెల్లి నిండు నూరేళ్లు ఉండాలి.
వల్లభ: చూడమ్మా హాసిని జోకులు వేస్తుంది. తన చేతిలోనే నయని మరదలు చనిపోనుంది అంటే కాపాడేస్తుందట.
హాసిని: అలా ఎవరు అన్నా ఊరు కోను చెప్తున్నా చెల్లి కోసం ఏం చేయమన్నా నేను సిద్ధమే.
విశాల్: ఎందుకు వదినా అంత ఎమోషనల్ అవుతున్నావు.
విశాలాక్షి: అంటే ఈ లెక్కన నయనికి గండం వస్తుంది నీ వల్ల కాదన్నమాట. అబద్ధాలు ఆడకమ్మా పుస్తకంలో నీ పేరు కనిపిస్తుందని నువ్వు చెప్పడం అబద్ధం కాదా.
పావనా: అయ్య బాబోయ్ ఏంటి ఈ ట్విస్ట్ మరి ఎవరి పేరు వస్తుంది.
సుమన: అంటే పేరు తప్పు చెప్పావా అక్క.
విశాల్: వదినా ఎందుకు అలా చెప్పావ్ ఎందుకు అందరూ నిన్ను వేరు చేసేలా చేశావ్.
విశాలాక్షి: నువ్వు చూసిన పేరు చెప్పకపోతే నేను చెప్పాలి కదా పెద్దమ్మ.
హాసిని: చెప్పొద్దు.
వల్లభ: అలా అన్నావ్ అంటే నిజం ఉంది అనే కదా నిజం చెప్పు.
అందరూ హాసినిని పేరు చెప్పమని అడుగుతారు. దాంతో హాసిని నేను చెప్పలేను నా వల్ల కాదు అని అంటుంది. నేను చెప్పలేను అలా ఎలా చెప్పలేను నిజం చెప్పమని ఎవరూ అడొగొద్దని అంటుంది. ఇక అందరూ విశాలాక్షికి నిజం చెప్పమని అంటారు. ఇందాక నువ్వు ఆడుకున్న నీళ్లే వారు ఎవరో చూపిస్తుందని విశాలాక్షి పావనాతో ఉంటుంది. ఇక అందరూ ఒక్కోక్కరిగా చేయిని నీటిలో ఆడిస్తే ఎవరి చేయి రంగు మారితే వాళ్ల వల్లే నయనికి ప్రాణ గండం ఉందని తెలుస్తుందని విశాలాక్షి చెప్తుంది. ఇక హాసిని నా ప్రాణం ఉండగా చెల్లికి ద్రోహం చేయను అని నీటిలో చేయి ఆడిస్తే రంగు మారదు. దాంతో అందరూ హాసిని వల్ల ప్రమాదం లేదని అంటారు. తర్వాత విక్రాంత్ వెళ్లిన నీటి రంగు మారదు.
సుమన కూడా వెళ్లుంది, తర్వాత పావనా మూర్తి చేయి పెట్టినా నీటి రంగు మారదు. వలభ చేయి వల్ల కూడా రంగు మారదు. తిలోత్తమకి వెళ్లమంటే తన చేయి వల్లే రంగు మారుతుందేమో అని టెన్షన్‌తో వెళ్లనని అంటుంది. చాలా భయపడుతుంది. చివరికి అందరూ చెప్పడంతో తిలోత్తమ వెళ్తుంది అప్పుడు కూడా నీటి రంగు మారదు. ఇక చివరిగా విశాల్ చేయి పెట్టడానికి వెళ్తాడు. ఈ నీరు రంగు మారకపోతే నయనికి గండం ఉండదని అనుకుంటారు. కానీ ఇంతలో విశాల్ చేయి పెట్టగానే పాత్రలోని నీరు ఎరుపు రంగులోకి మారిపోతాయి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.