Satyabhama Serial Today October 21st: సత్యభామ సీరియల్: గుండెల మీద చిన్నా పేరు పచ్చబొట్టు పొడిపించుకున్న మహదేవయ్య.. క్రిష్‌కి ఎమోషనల్ బ్లాక్ మెయిల్!
Satyabhama Today Episode క్రిష్‌ని తన వైపునకు తిప్పుకోవడానికి మహదేవయ్య క్రిష్ పేరు పచ్చబొట్టుగా గుండెల మీద పొడిపించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode మహదేవయ్య గోడ మీద ఉన్న ఫ్యామిలీ ఫొటో దగ్గరకు వెళ్లి చూస్తుంటే భైరవి అక్కడికి వస్తుంది. ఆ ఫొటోలో అందరూ ఉన్నారు ఇంట్లోనే మన పెద్ద కొడుకు లేడు తెలుస్తుందా అని అడుగుతుంది. మహదేవయ్య అంటే పులి అని మహదేవయ్య పేరు చెప్తే గుండె ఆగి చినిపోవాలి అది మహదేవయ్య ఫవర్. అలాంటి మహదేవయ్య ఇంటికి ఒక ఎస్‌ఐ వచ్చి ఆయన కొడుకుని తీసుకెళ్లిపోతే ఏం ప్రశ్నించలేదని నీ పౌరుషం, పంతం ఏమైందని భైరవి అంటుంది. రుద్రని విడిపించుకురమ్మని చెప్తుంది.
మహదేవయ్య: ఏంటే విడిపించుకువచ్చేది నీ కొడుకుని పశువుల మందలో కట్టారా విడిపించడానికి పెళ్లాన్ని చంపబోయి దొరికిపోయాడు వాడు.
భైరవి: వాడు ఏం చేశాడో నాకు అనవసరం అయ్యా నా కొడుకు ఇంటికి రావాలి.
మహదేవయ్య: నీ చిన్న కోడలు కంప్లైంట్ చేసింది. పెద్ద కోడలు మొగుడు తప్పు చేశాడని చెప్పింది. చిన్నా గాడు దగ్గరుండి పోలీసులకు అప్పగించాడు. ఫ్యామిలీ మొత్తం వాడికి వ్యతిరేకంగా తిరిగితే నేనేం చేయలేను. పండగ పూజ ఏ పిచ్చోడు అయినా పెళ్లాన్ని మర్డర్ చేయాలి అనుకున్నాడా. అయినా పెళ్లాన్ని చంపాల్సిన అవసరం వాడికేం వచ్చింది. ఎలక్షన్ల టైంకి ఆ గాడిద వెదన నా పరువు తీసేశాడు. రాజకీయం గురించి నేను ఏమైనా చేస్తా ఇంకోసారి ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకు. ఫ్యామిలీ ఫొటోలో క్రిష్‌ని చూసి ఇన్నేళ్లు నిన్ను గుండెల మీద పెంచింది నన్ను ఎదరు తిరగడానికి కాదు. ఇప్పుడు నీ పెళ్లాం మాటలు విని నాకే ఎదురు తిరుగుతావా. నా ఆయుధాన్ని తన చేతిలోకి గుంజుకుంటుంది. సత్య పిచ్చుక అనుకున్నా గద్ద లెక్క మారింది. నేను గేరు మార్చుతా నా స్పీడ్ చూపిస్తా.
సత్య చీర ఇస్త్రీ చేస్తుంటే క్రిష్ చూసి తెగ ముద్దొస్తుంది ఇప్పుడు వెళ్లి ముద్దు పెడితే నన్ను ఇస్త్రీ చేస్తుంది. దేవుడా అని అనుకుంటాడు. ఏం చేస్తున్నావ్ అని సత్య అడిగితే వేడి వేడి ముద్దులతో ఐరెన్ చేస్తావా అని నా మనసు అడగమని అంటుందని అని అంటాడు. దానికి సత్య ఐరెన్ బాక్స్ చూపిస్తూ తోలు ఊడే అంత వేడి చేయమంటావా అని అంటుంది. ఇక క్రిష్ తన షర్ట్ బటన్ లాగేసి చూసుకోవా సత్య బటన్ చూసుకోవా నేను ఎలా వెళ్లాలి. తొందరగా కుట్టు అంటాడు. సత్య కుడుతూ ఉంటే క్రిష్ నడుము గిల్లుతాడు. ఇక క్రిష్ సత్యని దగ్గరకు తీసుకుంటుంటే పంకజం వచ్చి పెద్దయ్య గారు పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారు. అని తొందరగా రమ్మని పిలుస్తుంది. పచ్చబొట్టు పొడిపించుకుంటే ఏమవుతుందని సత్య అంటుంది. ఇక క్రిష్, సత్య మహదేవయ్య దగ్గరకు వెళ్తారు.
వెళ్లి చూస్తే గుండె మీద చిన్నా మహదేవయ్య పచ్చబొట్టు పొగిపించుకుంటాడు. అది చూసిన క్రిష్ ఏంటి బాపు ఇది అని అంటే నా గుండెల్లో కొట్టుకునే పేరు గుండెల మీద పొడిపించుకున్నా అంటాడు. క్రిష్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఈ పేరు నా గుండె మీద ఉంటే నా చిన్నా నా గుండె మీద ఉన్నట్లు ఉంటుందని, ఇది చూస్తే చిన్నా ఎప్పుడూ నాతోనే ఉంటాడని ఎప్పుడైనా వాడు నా చేయి వదిలేస్తే దీనితో నా ప్రేమ పంచుకుంటా అని అంటాడు. క్రిష్ ప్రేమతో మహదేవయ్యని హత్తుకుంటే మహదేవయ్య సత్యని చూసి కన్ను ఏగరేస్తాడు. ఇక భైరవి పెద్ద కొడుకు గురించి అడిగితే వాడి గురించి నా దగ్గర మాట్లాడకని సీరియస్ అవుతాడు. పెద్దొడిని వదిలేస్తున్నా అని చిన్న కొడుకుదే ఇక పరువు బాధ్యత అని అప్పగిస్తాడు. దానికి సత్య మామయ్యకి బావగారు జైలులో ఉండటం గుండె పిండేస్తుందని కానీ ఏం చేయలేకపోతున్నారని అంటుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత మహదేవయ్య సత్యతో ఎలా ఉంది నా దెబ్బ అని అడుగుతాడు. దానికి సత్య క్రిష్ మీ చేయి జారిపోతాడని అందుకే పచ్చబొట్టు వేసుకొనేంత దిగజారిపోయారని అంటుంది. మరోవైపు భైరవి పోలీస్ స్టేషన్‌లో రుద్రని కలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.