అన్వేషించండి

Karthika Deepam 2 Serial October 19th: కార్తీకదీపం 2 సీరియల్: ఎంత దారుణం జరిగిపోయింది.. ఇంటిళ్ల పాది ఏడుపులు.. బావే నా మొగుడంటోన్న జ్యోత్స్న!

Karthika Deepam 2 Serial Today Episode దీప నమ్మంచి గొంతు కోసిందని కార్తీక్ ఫ్యామిలీతో పాటు దీపతో కూడా ఇక ఎలాంటి సంబంధం లేదని శివనారాయణ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode అనసూయ కార్తీక్ కాళ్ల మీద పడి థ్యాంక్స్ చెప్తుంది. పుట్టినప్పటి నుంచి దీపకు కష్టాలే అని అయిన వాళ్లు అందరూ దూరం అయ్యారని కేవలం దానికి కూతురే మిగిలిందని దాని కోసం నర్శింహ లాక్కోవాలి అనుకున్నాడని దీప జీవితంలో మీరు దీపం వెలిగించారని తన తమ్ముడు ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉంటాడని చెప్తుంది.  

శివనారాయణ: జ్యోత్స్న చెప్తుంది కానీ నాకు ఎందుకో ఇది నమ్మబుద్ధి కావడం లేదమ్మా దీపని కార్తీక్ పెళ్లి చేసుకోవడం ఏంటి. 
జ్యోత్స్న: మీకు అంతగా అనుమానం ఉంటే వెళ్లి చూసి రండి కొత్త జంటకు అక్షింతలు వేసి ఆశీర్వదించండి.
సుమిత్ర: ఉండండి మామయ్య ఇప్పుడే వదినకు కాల్ చేసి ఏం జరిగిందో తెలుసుకుంటా. 
కాంచన: వదిన కాల్ చేస్తుందిరా. చెప్పు వదిన.
సుమిత్ర: జ్యోత్స్న ఇంటికి వచ్చింది మేం విన్నది నిజమేనా.
కాంచన: నిజమే వదినా కానీ నేను 
సుమిత్ర: ఇక చాలు వదినా.. జ్యోత్స్న చెప్పింది నిజమే మామయ్య గారు దేవుడు మన మీద ఎందుకు ఇంత పగ పట్టాడు.
జ్యోత్స్న: మన మీద పగ పట్టింది దీప నా జీవితానికి ఉన్న ఒక్క ఆశ కూడా అది కాలితో తన్ని చంపేసింది. 
సుమిత్ర: కార్తీక్ మన ఇంటి అల్లుడు అవుతాడు అనుకున్నా కానీ కార్తీక్ దీపని పెళ్లి చేసుకోవడం ఏంటి మరీ ఇంత దారుణం ఏంటి అండీ. మామయ్య ఒకసారి వెళ్లి మాట్లాడుదామా.
శివనారాయణ: పెళ్లి జరిగాక ఇంకేంటి అమ్మ మాట్లాడటం నా పంతం వదులుకొని మనవరాలికి మాట ఇచ్చాను. ఇక దానికి నా ముఖం ఎలా చూపించాలి. 
పారిజాతం: ఏంటే ఇది ఈ ఆస్తిని దారిన పోయిన దానికి దానం చేయడానికా నేను ఇన్నేళ్లు కాపలా కాసింది. నువ్వు ఈ యావత్ ఆస్తికి వారసురాలు అవుతావని కార్తీక్‌ని పెళ్లి చేసుకుంటావని నువ్వే యజమానురాలివి అనుకున్నాను.
జ్యోత్స్న: బావ దీపని పెళ్లి చేసుకున్నాడు అంటే నువ్వు ఆస్తి గురించి మాట్లాడుతావేంటి గ్రానీ.
పారిజాతం: పుట్టిన దగ్గర నుంచి బావే నా మొగుడు అని బతికావ్ కానీ ఇప్పుడు అది ఏదో నీ అదృష్టాన్ని తన్నుకుపోయింది. కూతుర్ని అడ్డుపెట్టుకొని కార్తీక్‌తో తాళి కట్టించుకుంది. నా జీవితానికి ఉన్న ఒకే ఒక్క కలని నాశనం చేసేసింది. దాన్ని మనం వదలకూడదు.
జ్యోత్స్న: ఎలా వదిలేస్తా గ్రానీ నా మెడలో కట్టమని నేను తీసుకెళ్లిన తాళి బావ దాని మెడలో కట్టాడు అది నా తాళి నేను వదలను.

కాశీ ఇళ్లంతా బూజు దులుపుతుంటాడు. స్వప్న వీధిలోకి వెళ్లి నీరు తెస్తుంది. ఇద్దరూ కొట్టుకుంటారు. నా పని నా వల్ల నాకు అంటే నా వల్ల కాదు అని అనుకుంటారు. తర్వాత సరదాగా నవ్వుకుంటారు. ఇంతలో దాసు వస్తాడు. కార్తీక్, దీపని పెళ్లి చేసుకున్నాడని చెప్తాడు. ఇద్దరూ షాక్ అయిపోతారు. జ్యోత్స్నని చేసుకోవాలి కదా అన్నయ్య చేసుకోవడం ఏంటి అని స్వప్న అంటుంది. కానీ దాసు మనసులో నా కూతురికి అన్యాయం అయిపోయిందని అనుకుంటాడు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటో అని బాధ పడతాడు. మరోవైపు దశరథ్ తన కూతురి జీవితం ఏంటని తండ్రిని అడుగుతాడు. దానికి ముందు తెచ్చిన సంబంధమే చేద్దామని శివనారాయణ అంటాడు. దానికి పారిజాతం దీపకి ఎంతో కొంత ఇచ్చి పంపేసి కార్తీక్, జ్యోత్స్నల్ని పెళ్లి చేయమని అంటాడు. ఇక దానికి శివనారాయణ పారిజాతాన్ని కొట్టడానికి వెళ్లి అక్కడి నుంచి వెళ్లగొడతాడు. ఇక వాళ్ల ఫ్యామిలిని జీవితంలో వదలను అని దీప కూడా నమ్మించి గొంతు కోసిందని అంటాడు.

ఇక బయట జ్యోత్స్న అవుట్ హౌస్ చూస్తూ గ్రానీతో దీపకి బావ తాళి కట్టడం శౌర్య చప్పట్లు కొట్టడమే గుర్తొస్తుందని అంటుంది. దీప చేతిలో దారుణంగా మోసపోయానని అంటుంది. బావ తాళి కట్టేంతలా దీప ఏం చేసిందని నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావ్ అని జ్యో పారిజాతంతో అంటుంది. దీపకి బావకి మనకి ఏదో సంబంధం ఉందని అంటుంది. దాంతో పారిజాతం ముత్యాలమ్మ గూడెంలో ఉన్నప్పుడే దీప కార్తీక్ ఒకరికి తెలుసని అంటుంది. లండన్ నుంచి వచ్చి కూడా కార్తీక్ ఇంటికి రాకుండా దీపని కలవడానికే వెళ్లాడని అంటుంది. జ్యోత్స్న పారిజాతం గొంతు పట్టి నలిపేస్తుంది. ఇద్దరూ ముందే ప్లాన్ చేసుకొని పెళ్లి చేసుకున్నారని కోప్పడుతుంది. దీప మెడలో తాళి కట్టినా వదలని దీప సుఖంగా కాపురం చేయకుండా అడ్డకుంటానని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలని అంటుంది. నేను బావ పెళ్లాన్ని ఆ దీప కాదు అని వెళ్లిపోతుంది. 

దీప తులసి కోట దగ్గర దీపం వెలిగించి జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. అందరి నిందలు నిజం చేశావని కోర్టులో నర్శింహ ఈ పెద్ద మనిషితో నా భార్యకి సంబంధం ఉంది అని చెప్పినమాట నిజం చేశారని.. నడి రోడ్డు మీద నా బావతో నీకు ఏంటి సంబంధం అని అడిగిన జ్యోత్స్న మాటలు నిజం చేశారని నా వ్యక్తిత్వాన్ని చంపేశారని అంటుంది. ఈ తాళి నాకు ఎందుకు కట్టారని అడుగుతుంది. దానికి దీప నీ కూతురి కోసం చేశానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్  పూర్తయిపోతుంది. 

Also Read: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమితో గొడవ పెట్టుకున్న నక్షత్ర – నక్షత్రను గగన్‌తో తిట్టించిన భూమి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget