అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Trinayani Serial Today October 1st: 'త్రినయని' సీరియల్: ఉలూచిని పెద్దబొట్టమ్మకు దానం ఇస్తున్న సుమన.. గాయత్రీ పాప ఇచ్చిన ఫోన్‌లో ఏముంది?

Trinayani Today Episode భుజంగమణి కోసం సుమన తన బిడ్డ ఉలూచిని పెద్దబొట్టమ్మకు శాశ్వతంగా ఇచ్చేయాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode భుజంగమణి ఎవరు కనిపెడితే వాళ్లకి ఇచ్చేస్తానని నయని ఇంట్లో వాళ్లతో అంటుంది. అందరూ తెగ ఆలోచించి నోటికి వచ్చింది చెప్తారు. బొమ్మల్లో, విశాల్ జేబులో, నయని చీర కొంగులో, సోఫా కింద, బెడ్ రూమ్‌లో ఇలా రకరకాలు చెప్తారు. పూజ గదిలో ఉందని సుమన అంటే నయని కాదు అంటుంది.

తిలోత్తమ: విక్రాంత్ నువ్వు చెప్పరా.
విక్రాంత్: నాకు దాని అవసరం లేదు కాబట్టి అది ఎక్కడున్నా నాకు అనవసరం. తెలిసినా చెప్పను కూడా. 
తిలోత్తమ: హాసిని నువ్వు చెప్పు.
హాసిని: ఉండకూడని చోటులో ఉందేమో. ఎక్కడుందో తెలీదు కానీ ఎవరి దగ్గర ఉండొచ్చో చెప్పగలను.
తిలోత్తమ: గాయత్రీ పాప దగ్గరుందేమో.
నయని: ఇంకా ఎవరూ వెతికి విసిగిపోకండి. ఎందుకంటే భుజంగమణిని నేను దాచి పెట్టడం లేదు గాయత్రీ పాపనే భద్రంగా దాచి పెడుతుంది. ఎప్పుడైనా అవసరం అయితే నోటితో చెప్పలేదు కానీ ఆ అని నోరు తెరుస్తుంది. చూపిస్తుంది పాప. 

ఇక అందరూ ఎక్కడ దాచిపెట్టిందో పాప అని అనుకుంటే గాయత్రీ పాప నోరు తెరచి ఆ అని నోరు తెరుస్తుంది. నోటిలో భుజంగమణి ఉండటం చూసి అందరూ నోరెళ్ల బెడతారు. నయని భుజంగమణిని బయటకు తీస్తుంది. ఇలా నోట్లో పెట్టుకోవడం ప్రమాదమని విశాల్, హాసిని చెప్పి జాగ్రత్తలు చెప్తారు. ఇక సుమన ఉలూచిని రెడీ చేస్తుంది. నిన్ను రెడీ చేయడం నాకు పెద్ద తలకాయ నొప్పి అని అలా కాకుండా మా అక్కకు ఉన్నట్లు నా దగ్గర ఆస్తి ఉండి ఉంటే ఒక్కో పనికి ఒక్కో పని మనిషిని పెట్టేదాన్నని అంటుంది. ఇంతలో పెద్ద బొట్టమ్మ వస్తుంది. సుమన పెద్ద బొట్టమ్మని నెట్టేస్తే భుజంగమణి నీకు వద్దా అని పెద్ద బొట్టమ్మ అడుగుతుంది. నీ చేతికి వచ్చే మార్గం చెప్తానని అంటుంది పెద్దబొట్టమ్మ. 

పెద్దబొట్టమ్మ: నయని దగ్గర లేకుండా మానసాదేవి ఆలయానికి చేరకుండా భుజంగమణి నీ దగ్గరే ఉంటే ఎలా ఉంటుంది సుమన. 
సుమన: కల కనడానికి బాగుంది కానీ మా అక్క కనీసం దాన్ని తాకనివ్వడం లేదు కూడా.
పెద్దబొట్టమ్మ: ఆ మణి నయని చేయి జార్చుకున్నంత వరకే. ఉలూచిని నువ్వు నా వెంట నాగలోకం పంపించావంటే అక్కడికి రావాలి అంటే భుజంగమణి కచ్చితంగా వెంట ఉండాల్సిందే. అది లేకుండా రాలేరు.
సుమన: అంటే నీకు నేను పిల్లను ఇచ్చేస్తే నువ్వు తీసుకొని పారిపోతావ్ అన్నమాట.
పెద్దబొట్టమ్మ: నా మీద నమ్మకం లేకపోతే నీ చేతికి ఆ మణి అయితే రాదు. బాగా ఆలోచించుకో.
సుమన: అలా అయితే ఈ రోజే నేను నీకు ఉలూచిని దానం చేస్తాను. తర్వాత పాప కావాలని ఏడుస్తా. దాంతో నాగలోకం రావడానికి నాకు భుజంగమణి ఇస్తారు. నీ దగ్గరకు వస్తాను. ( ముసలిదానా భుజంగమణి దక్కితే నీ దగ్గరు ఎందుకు వస్తానే నా ప్లాన్స్ నాకు ఉన్నాయ్) 

ఉదయం అందరూ హాల్‌లో కూర్చొని ఉంటారు. అక్కడికి సుమన పాపని తీసుకొని వస్తారు. ఈ రోజు చాలా మంచిదని దానం చేయాలని అనుకుంటున్నానని అంటుంది సుమన. నీ దగ్గర దానం చేయడానికి ఏముందని వల్లభ అడిగితే ఉలూచి పాప ఉందని సుమన అంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. షాక్‌లో లేచి నిల్చొంటారు. నీకు ఏమైనా పిచ్చా అని తిడతారు. ఇక పెద్ద బొట్టమ్మ వస్తుంది. దాంతో సుమన నీకే ఉలూచిని ఇచ్చేయాలి అనుకుంటున్నా పెద్దబొట్టమ్మ అని అంటుంది. అందరూ షాకైపోతారు. సుమన తన బిడ్డని దానం చేస్తుందంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదని తిలోత్తమ అంటుంది. 

విక్రాంత్: ఉలూచిని ఇస్తే పెద్దబొట్టమ్మ నీకు ఏం ఇస్తానని చెప్పింది.
సుమన: తను నాకేం ఇస్తుంది.
నయని: సుమన ఇప్పుడు నువ్వు పాపని సర్పజాతికి చెందిని పెద్దబొట్టమ్మకి ఇచ్చేస్తే మళ్లీ జీవితంలో నీ పాపని దక్కించుకోలేవు. 
సుమన: పర్వాలేదక్క..
దురంధర: నీ మొహం మండ పాపని ఎంత కష్టపడి కన్నావే ఇలా ఎలా వదిలేస్తావే.
తిలోత్తమ: ఊరికే ఇవ్వదురా.
సుమన: నేను ఏం ఆశ పడటం లేదు.
పెద్దబొట్టమ్మ: ఇచ్చేయ్ సుమన పాపని తీసుకెళ్తాను.
దురంధర: నీ దొంగ బుద్ధి పోనిచ్చుకోలేదు చూశావా. 
నయని: బిడ్డని తీసుకొని నువ్వు నాగలోకం వెళ్లిపోతే తిరిగి రమ్మన్నా రావు పెద్దబొట్టమ్మ అప్పుడు నా చెల్లి పరిస్థితి ఏంటి.
విక్రాంత్: కుమిలి కుమిలి ఏడ్వని వదినా. తనకు లేని ఆరాటం ఎవరికీ అవసరం లేదు.
నయని: సుమనకు మంచి చెడు చెప్పండి అత్తయ్యా కన్న బిడ్డని ఎలా దానం చేస్తుందని అడగండి.
తిలోత్తమ: నా మాట వింటే ఎందుకు ఆగుతుంది. తనకి ఏం అవసరం ఉందో ఏంటో.

ఎవరు ఎన్ని చెప్పినా సుమన పాపని ఇచ్చేస్తా అంటుంది. నయని చాలా కంగారు పడుతుంది. సమయానికి విశాల్ బాబు కూడా లేరని ఫీలవుతుంది. తండ్రిగా మీకు హక్కు ఉంది అడ్డుకోమని నయని అంటుంది. సాయంత్రానికి బిడ్డ కావాలని గుండెలు బాదుకుంటుందని నయన అంటే దానికి సుమన రెండేళ్లుగా నీ తొలి బిడ్డ కనిపించకపోతే నువ్వేందుకు గుండెలు బాదుకోవడం లేదని సుమన అంటుంది. పాపని మనకు చూడాలి అనిపిస్తే ఎలా అని నయని అంటే దురంధర నాగయ్య వెంట వెళ్లడమే అని అంటుంది. దానికి పెద్దబొట్టమ్మ మీరు ఎవరూ  నాగలోకం రాలేరని అంటుంది. నయని ఇప్పటికైనా గ్రహించమని సుమనతో అంటుంది. ఎంత చెప్పినా సుమన వినదు. ఇక సుమన పాపని పెద్దబొట్టమ్మకి దానం ఇవ్వబోతే గాయత్రీ పాప వచ్చి అడ్డుకుంటుంది. నయని చేతిలో ఫోన్ పెడుతుంది గాయత్రీ పాప. ఫోన్ చూసి నయని షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: అమ్మాయి గారు సీరియల్: శ్వేతతో తనకు పెళ్లని రూపతో చెప్పిన రాజు.. హారతి ఇంట్లో మందారం, ఇద్దరి పెళ్లాల మధ్య చిక్కుకున్న దీపక్!  
  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget