Ammayi garu Serial Today September 30th: అమ్మాయి గారు సీరియల్: శ్వేతతో తనకు పెళ్లని రూపతో చెప్పిన రాజు.. హారతి ఇంట్లో మందారం, ఇద్దరి పెళ్లాల మధ్య చిక్కుకున్న దీపక్!
Ammayi garu Today Episode హారతి రిపోర్ట్స్ తీసుకొని మందారం హారతి ఇంటికి రావడం అక్కడ దీపక్ ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Ammayi garu Serial Today September 30th: అమ్మాయి గారు సీరియల్: శ్వేతతో తనకు పెళ్లని రూపతో చెప్పిన రాజు.. హారతి ఇంట్లో మందారం, ఇద్దరి పెళ్లాల మధ్య చిక్కుకున్న దీపక్! ammayi garu serial today september 30th episode written update in telugu Ammayi garu Serial Today September 30th: అమ్మాయి గారు సీరియల్: శ్వేతతో తనకు పెళ్లని రూపతో చెప్పిన రాజు.. హారతి ఇంట్లో మందారం, ఇద్దరి పెళ్లాల మధ్య చిక్కుకున్న దీపక్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/30/dfb7f434657c4763611a308d4b5a8ad71727697440238882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ammayi garu Serial Today Episode శ్వేతని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని ముత్యాలు కొడుకుతో అంటుంది. దానికి రాజు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు అమ్మాయి గారిని అర్థం చేసుకో అంటాడు. శ్వేతని అర్థం చేసుకో అని ముత్యాలు అంటే శ్వేతని చంపి అయినా సరే పెళ్లి ఆపుతానని అంటాడు. ఇక రాజుని తండ్రి అవన్నీ వదిలేయమని అంటాడు.
మరోవైపు జరిగిన విషయాలన్నీ రూప ఆలోచిస్తూ ఉంటుంది. రాజు కూడా ఇంట్లో జరిగిన విషయాలు రూపకి చెప్పాలి అనుకుంటాడు. శ్వేత తన తల్లితో సంబంధం మాట్లాడుతుందని తల్లి కూడా శ్వేతని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుందని అంటాడు. నేను నిన్ను ప్రేమించినట్లుగా నువ్వు నన్ను ప్రేమించడం లేదని ఇంట్లో తన తల్లి అనుకుంటుంది రాజు రూపతో చెప్తాడు.
రూప: అదేంటి రాజు నువ్వంటే ప్రాణం నాకు నేను దూరంగా ఉన్నాను కానీ నా మనసంతా నీ దగ్గరే ఉంది.
రాజు: అది మనకు తెలుసు కానీ ఇంట్లో వాళ్లకి తెలిసేలా చేయాలి అమ్మాయిగారు. మనం తిరుగుబాటు చేయకపోతే మనల్ని విడదీస్తారు.
హారతి రిపోర్ట్స్ మర్చిపోయానని చెప్పడంతో వాటిని తీసుకురావడానికి దీపక్ బయల్దేరుతాడు. ఇక విజయాంబిక దీపక్ కాల్ చేసి రాఘవని చంపేశావా అంటే మందారం రావడంతో పని అవ్వలేదని అంటాడు. మరోవైపు మందారం రిపోర్ట్ తీసుకొని దీపక్ ఉన్న ఇంటికి వస్తుంది. మందారం డోర్ కొడితే దీపక్ తీస్తాడు. ఇంతలో మందారానికి రూప కాల్ చేయడంతో దీపక్ మాత్రమే మందారాన్ని చూసి దాక్కుంటాడు. మందారం దీపక్‌ని చూడదు. ఇక దీపక్ పరుగున వచ్చి వాష్ రూమ్‌కి వెళ్లాలని హారతిని డోర్ తీయమంటాడు. మందారం దగ్గరకు హారతి వెళ్లి రిపోర్ట్స్ తీసుకుంటుంది. హారతి మందారాన్ని లోపలికి తీసుకొస్తుంది. మందారం ఇంట్లో ఉండగానే హారతి దీపక్‌ని పిలుస్తుంది. మందారం వెళ్లిపోయిందని బయటకు వచ్చి మళ్లీ చూసి లోపలికి వెళ్లిపోతాడు. ఇక బాత్‌రూమ్ నుంచి దీపక్ మందారానికి కాల్ చేసి కాఫీ ఇవ్వమని అంటాడు. మందారాన్ని త్వరగా రమ్మంటాడు. ఇక మందారం దీపక్ అనడం హారతిలో అనుమానం వస్తుంది.
మందారం వెళ్లిపోగానే దీపక్ బయటకు వస్తాడు. మందారం, హారతిల ఫ్రెండ్‌షిప్ చెడగొట్టాలని దీపక్ అనుకుంటాడు. ఇక హారతి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతుంది. త్వరలోనే చేసుకుంటా అని దీపక్ అంటాడు. మరోవైపు రూప తండ్రి దగ్గరకు వెళ్లి రాజు గురించి మాట్లాడుతుంది. రాజుకి వేరే పెళ్లి చేయాలని అనుకుంటున్నారని అంటుంది. భర్త లేకుండా ఓ అమ్మాయి ఎలా ఉంటుందో మీకు తెలుసా అని అడుగుతుంది. ఆ ముత్యాలు నిన్ను కోడలిగా కాదు గడ్డి పోచలా కూడా చూడటం లేదని కడుపులో బిడ్డ లేదని తెలియగానే మీ అత్త నిన్ను దేనికి పనికిరాని వాళ్లులా వదిలేసిందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)