Kalavari Kodalu Kanaka Mahalakshmi September 30th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం నల్లపూసల్ని తాకిన విహారి.. కుటుంబం మొత్తం ఆశీర్వదించేసిందిగా, హోమంలో తప్పిదం ఎవరిది?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి, సహస్రలు చేస్తున్న హోమంలో అనుకోకుండా అగ్ని కీలలు రావడం అందరూ టెన్షన్ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీకి నల్లపూసలు వేసే కార్యక్రమం కొనసాగుతుంటుంది. పంతులు అందరి దగ్గరకి నల్లపూసలు పట్టుకొని వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటుంటారు. మరోవైపు విహారి, సహస్రలతో హోమం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. విహారి, సహస్ర హోమం దగ్గర కూర్చొంటారు. ఇక విహారి తల్లికి కాల్ చేస్తుంటాడు కానీ ఫోన్ లిఫ్ట్ చేయదు. యమున ఫోన్ ఇంట్లో ఉండిపోయి ఉంటుంది.
విహారికి ఫోన్ పక్కన పెట్టమని పూజ మీద దృష్టి పెట్టమని పద్మాక్షి వాళ్లు చెప్తారు. ఇక కనకం నల్లపూసలు పట్టుకొని పంతులు అక్కడికి వస్తాడు. పద్మాక్షితో పాటు అందరూ నల్లపూసలకు దీవించి ఆశీర్వదిస్తారు. ఇక పంతులు వాళ్లని కూడా రమ్మని అంటే పద్మాక్షి సున్నితంగా చెప్పి రాము అంటుంది. ఇక పంతులు విహారి, సహస్రలను చూసి త్వరలో పెళ్లి చేసుకునేలా ఉన్నారు పెళ్లి కావాల్సిన అమ్మాయి ఈ నల్లపూసలు తాకితే తనకు తన కాబోయే భర్తకు మంచిదని పంతులు చెప్పి సహస్రకి కూడా నల్లపూసలు తాకి నమస్కారం చేయమంటారు. సహస్ర నల్లపూసలను తాకి దండం పెట్టుకుంటుంది. తర్వాత అనుకోకుండా ఆమె చేతిలోకి నల్లపూసలు గుచ్చిన పసుపు తాడు రావడంతో కింద పడబోతే విహారి పట్టుకుంటాడు. సహస్ర క్షమాపణలు అడుగుతుంది. ఇక నల్లపూసలు కింద పడకుండా చేసింనందుకు పంతులు విహారికి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు.
మరోవైపు కనకం నల్లపూసల కార్యక్రమానికి చాలా మంది ముత్తయిదువులు వస్తారు. ఆమె భర్త రాలేదా అని అడుగుతారు. దాంతో పంతులు ఆయన రాలేకపోవడం వల్ల మిమల్ని పిలిచామని అంటారు. కనకం ఆ మాటలకు అదంతా తన దురదృష్టమని ఫీలవుతుంది. రెండు చోట్లా పూజ మొదలవుతుంది. ముత్తయిదువులంతా కలిసి కనకం మెడలో పుస్తెలు వేస్తారు. ముత్తయిదువుల దగ్గర ఆశీర్వాదం తీసుకోమని పంతులు చెప్తారు. లక్ష్మీ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. యమున దగ్గరకు వెళ్లి ఎమోషనల్ అయి హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఏ దిక్కూ లేని నాకు మీరే దిక్కు అయి నా కోసం చాలా చేశారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలని కనకం ఏడుస్తుంది. కనకాన్ని చూసి యమున ఏడుస్తుంది. నీ భర్త నీకు ఎంత కష్లాల్లో నెట్టేసిన నువ్వు మాత్రం ఆయన గౌరవిస్తూనే ఉన్నావని అంటుంది. ఇక యమున తన కన్నకొడుకు చేసే పూజలో నాకు పాల్గొనే అవకాశం ఇవ్వలేదని యమున ఏడుస్తుంది. భర్తని దూరం చేసి కుటుంబాన్ని కూడా దూరం చేస్తున్నావ్ అని ఏడుస్తుంది.
విహారి హోమం చేస్తూనే తల్లికి ఫోన్ చేస్తుంటాడు. ఎవరూ తన తల్లి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని అనుకుంటాడు. అందరూ సంతోషంగా ఉన్నారు కానీ తాను లేనని కనక మహాలక్ష్మీని వదిలేసినందుకే ఇలా మనస్శాంతి లేకుండా బతుకుతున్నానని విహారి అనుకుంటాడు. యమున నడుస్తూ విహారి వాళ్ల పూజ వైపు వస్తుంటుంది. మరోవైపు యమున బట్టలు మార్చుకొని వస్తూ జారిపోయి తలుపునకు తల తగిలి రక్తం వస్తుంది. మరోవైపు సహస్ర చేస్తున్న అగ్నిహోమంలో అగ్ని కీలలు ఏగిసి పడతాయి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.