Karthika Deepam 2 Serial September 30th: కార్తీకదీపం 2 సీరియల్: భర్తని సవతితో పంపేసిన కాంచన.. పాపం కాంచనకకు షాక్ మీద షాక్‌లు.. కార్తీక్, జ్యోత్స్నల పెళ్లి కూడా క్యాన్సిల్!
Karthika Deepam 2 Serial Episode కాంచనతో పుట్టింటి వాళ్లు వచ్చి జ్యోత్స్న, కార్తీక్‌ల పెళ్లి క్యాన్సిల్ అని చెప్పడం దీప దగ్గర జ్యోత్స్న తన బాధ చెప్పుకొని ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కాంచన తన సవతి కావేరిని ఇంటికి పిలిచి తాంబూలం ఇస్తుంది. శ్రీధర్‌తో పాటు దీప, కార్తీక్‌లు కూడా షాక్ అయిపోతారు. తర్వాత కాంచన కార్తీక్‌కి లోపల బ్యాగ్ ఉంది తీసుకొని రా అని చెప్తుంది. కార్తీక్ తీసుకురావడంతో మీ నాన్న ముందు పెట్టు అని చెప్తుంది.
కాంచన: నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు దానికి కట్టుబడి ఉంటా అని చెప్పారు కదా. ఇదేం అండీ నేను తీసుకున్న నిర్ణయం మీ బట్టలన్నీ సర్ది అందులో పెట్టాను కావేరిని తీసుకొని బయల్దేరండి. ఇప్పుడు కావేరికి మీ అవసరం చాలా ఉంది.
కార్తీక్: మనసులో ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నావమ్మా.
కాంచన: ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇక మీరు బయల్దేరండి.
శ్రీధర్ కావేరిని తీసుకొని వెళ్లిపోతాడు. కాంచన చాలా ఏడుస్తుంది. కార్తీక్ దీప వైపు కోపంగా చూస్తాడు. దీప కూడా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ వెళ్లిపోతుంది. మరోవైపు స్వప్న, కాశీలను తీసుకొని దాసు వస్తాడు. నిన్ను పేర్లు చెప్పుకొని రండి అని అడగటానికి ఆడపడుచు కట్నం ఇమ్మని సతాయించడానికి ఎవరూ లేరని అంటాడు. ఆడ పడుచు దీప ఉందని స్వప్న అంటుంది. ఇక దాసు కోడలికి హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తాడు. స్వప్న లోపలికి వస్తుంది. దానికి దాసు మాది మీ ఇళ్లంతా పెద్దళ్లి కాదు పైగా సొంత ఇళ్లు కాదని అంటాడు. కాశీ ఉంటే చాలు అని అంటుంది. ఇక కాశీ స్వప్నతో ఇది నీ ఇళ్లు నీకు నచ్చినట్లు ఉండు నా కంటే మా నాన్నని బాగా చూసుకో అని అంటాడు. ఇక మామకోడళ్లు ఒకటై కాశీని ఆటపట్టిస్తారు. స్వప్న తన అన్నయ్య కార్తీక్ గురించి ఆలోచిస్తుంది. నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నా కానీ మా అన్నయ్య ఎలా ఉన్నాడో అని అనుకుంటుంది.
కాంచన: దీప పరాయిది కాబట్టి నిజం తెలిసిన చెప్పలేదు. నువ్వు నా కొడుకువే కదరా నాకు ఎందుకు నిజం చెప్పలేదు.
కార్తీక్: నీకు నిజం తెలిస్తే మనిషివి మిగలవేమో అని భయం వేసిందమ్మా.
కాంచన: ప్రాణం పోతేనే చచ్చిపోయినట్లు కాదురా నమ్మకం పోయినా చచ్చిపోయినట్లే. నా నమ్మకం మోసం చేసి మోసం చేసి నా జీవితం నుంచి బయటకు పోయింది. నా ప్రాణం మాత్రం నీ కోసమే మిగిలిందిరా.
కార్తీక్: ఇలాంటి ఓ రోజు మన జీవితాల్లోకి వచ్చుండకూడదురా.
శివనారాయణ: నేను కూడా అదే అనుకున్నారా. దశరథ మనం అనుకున్నది మీ చెల్లితో చెప్పు.
కాంచన: చెప్పు అన్నయ్య ఇంట్లో మనం తప్ప ఇంకెవరూ లేరు.
దశరథ్: ఎవరు ఉన్నా నిర్ణయం తీసుకున్నాక చెప్పక తప్పదు కదమ్మా. నీకే ఓ కూతురు ఉండి నీకు కాబోయే వియ్యంకుడికి అక్రమ సంబంధం, సంతానం ఉంటే నీ కూతుర్ని ఆ ఇంటికి కోడలిగా పంపంగలుగుతావా. నిన్నేనమ్మా అలాంటి మర్యాద కోల్పోయిన ఇంటికి కోడలిగా పంపాలి అనుకుంటావా.
కాంచన: కుమిలిపోతుంది. నాన్న అని పిలిస్తే వాడు అడిగిన ప్రశ్నకు నువ్వు ఇంకా సమాధానం ఇవ్వలేదని అంటాడు. దాంతో కాంచన మర్యాద పోయిన ఆ ఇంటికి కోడలిగా పంపలేను అంటుంది. ఇక దశరథ్ కాంచనతో నేను కూడా నా కూతురిని నీ ఇంటికి అని అంటే కాంచన ఆపి.. వద్దు అన్నయ్య వద్దు. నీ కూతుర్ని నా కోడలిని చేయాలని నేను తీసుకున్న మాట నాతో చెప్పడానికి అడ్డుపడుతుందని అర్థమైంది. మర్యాద కోల్పోయింది నా మెట్టెనిల్లు పుట్టినిల్లు కాదు. నా పుట్టింటి బాధ్యత కూడా నా గౌరవమే కదా అన్నయ్య. నేను తలదించుకోవడానికే ఒప్పుకోను అలాంటిది మీరు తలదించుకోవాలని ఎందుకు అనుకుంటా అన్నయ్య. నా మేనకోడలిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయను అంటారు ఇదే కదా మీ నిర్ణయం. నేను గౌరవిస్తాను అన్నయ్య. ఇక్కడ జీవితాలే గంగలో కలిసిపోయినప్పుడు ఇచ్చిన మాటకేముంది. పైగా అది నేను తీసుకున్న మాట. నాకిచ్చిన మాట ఏమైంది అని అడిగే అర్హత నేను కోల్పోయాను అన్నయ్యా. అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. కార్తీక్ కూడా ఏడుస్తాడు. పెద్దాయన, దశరథ్ కూడా కంటిలో నీళ్లు తిప్పుకుంటారు. మీ నిర్ణయానికి నేను నా కొడుకు గౌరవిస్తాం. మేనకోడలు నా ఇంటి కోడలు అవ్వాలి అనుకున్నా.. కావాలి అనుకోవడానికి ఆశపడితే సరిపోతుంది. అందుకోవడానికి అదృష్టం కూడా ఉండాలి కదా అన్నయ్య. అన్నయ్యా.. సంబంధాన్ని వద్దు అనుకున్నావా ఈ చెల్లితో బంధాన్ని కూడా వద్దు అనుకున్నావా? నాన్నా నువ్వు అయినా చెప్పు. అల్లుడినే వద్దు అనుకున్నావా ఈ కూతురిని కూడా వద్దు అనుకున్నావా.
శివనారాయణ: దశరథా వచ్చిన పని అయిపోంది వెళ్లిపోదాం పద ఇంకాసేపు ఇక్కడే ఉంటే గుండె ఆగిపోయేలా ఉంది.
కాంచన, కార్తీక్ చాలా ఏడుస్తారు. మరోవైపు జ్యోత్స్న బయట చాలా టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతుంది. ఇంతలో దీప వస్తుంది. జ్యోత్స్న దీపతో నీ కోసమే వేయి కన్నులతో వేచి చూస్తున్నా దీప కంగ్రాట్స్ ఏ లక్ష్యంతో నువ్వు ఈ ఇంట్లో ఉన్నావ్ అది సాధించావ్. నాకు తెలిసి నువ్వు ఇక ఈ ఇంట్లో ఉండవు వచ్చిన పని అయిపోయింది కాదా. ఇక మా బావ ఈ ఇంటికి రాడు నీ ప్లాన్ సక్సెస్ అయింది కదా ఇక పర్మినెంట్‌గా ఆ ఇంట్లోనే మా బావతో ఉండిపో అని జ్యోత్స్న దీపతో అంటుంది. పుట్టక ముందే నాకు బావకి పెళ్లి అయిపోంది నేను బావకి భార్యని అని అనుకున్న నా కలలు అన్నీ నువ్వు నాశనం చేసేశావ్ అని జ్యోత్స్న ఏడుస్తుంది. ఏం జరిగింది అని అలా మాట్లాడుతున్నావ్ అని దీప అంటే పారిజాతం వచ్చి నువ్వు చేసిన పని వల్ల జ్యోత్స్న పెళ్లి ఆగిపోయిందని అంటుంది. తప్పుచేసిన వాడి కొడుకుతో నా మనవరాలికి పెళ్లి వద్దని చెప్పాడని జ్యోత్స్న చెప్పి చాలా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: బొమ్మలో భుజంగమణి.. గజగండని కొట్టి తరిమేసిన గాయత్రీ పాప!