అన్వేషించండి

Trinayani Serial Today September 30th: 'త్రినయని' సీరియల్: బొమ్మలో భుజంగమణి.. గజగండని కొట్టి తరిమేసిన గాయత్రీ పాప!

Trinayani Today Episode భుజంగమణి కోసం వచ్చిన గజగండని గాయత్రీ పాప తన బొమ్మతో కొట్టి ఇంటి నుంచి తరిమేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode గజగండ భుజంగమణి కోసం నయని ఇంటికి వస్తాడు. తిలోత్తమ కూడా గజగండకు సపోర్ట్ చేస్తే నయని, విశాల్, విక్రాంత్‌లు తిలోత్తమని తిడతారు. అందరూ తనని అవమానిస్తున్నారని గజగండ అంటాడు. నయని మీదకు గజగండ వెళ్లబోతే గాయత్రీ పాప చేయి ఎత్తి ఆగు అన్నట్లు చేయి చూపిస్తుంది. దాంతో గజగండ భయపడి వెనక్కి పోతాడు. అందరూ షాక్ అయిపోతారు. 

వల్లభ: ఏంటి మమ్మీ మంత్రాల్లో ఆరి తేరిపోయిన గజగండ ఈ చిన్న పిల్లకి భయపడటం ఏంటి?
సుమన: ఏమయ్యా గజగండ నీవ్వు చిన్న పిల్లకే భయపడితే భుజంగమణి ఎలా దక్కించుకుంటావ్.. పంచకమణి పట్టుకొని కూడా చేతకాని వాడిలా ఉన్నావ్ అనుకుంటా.

సుమన గజగండ దగ్గరకు వెళ్లబొతే గజగండ సుమనను పట్టుకొని చాకుతో తన మెడ మీద కత్తి పెడతాడు. అందరూ షాక్ అవుతారు. సుమనను చంపేస్తానని గజగండ అంటాడు. అందరినీ కాపాడమని సుమన వేడుకుంటుంది. తిలోత్తమ తన చిన్న కోడలిని వదిలేయమని అంటుంది. గజగండ వదలనని సుమన అంటాడు. విశాల్ సుమనను విడిపించడానికి వెళ్తుంటే నయని ఆపుతుంది. ఎందుకు ఆపావని నయనిని విశాల్ అడిగితే గాయత్రీ పాప విడిపించడానికి వెళ్లిందని అంటుంది. గాయత్రీ పాప బొమ్మ పట్టుకొని గజగండ వైపు నడుస్తుంది. అందరూ పాపని గజగండ ఏమైనా చేస్తాడని కంగారు పడితే నయని ఏం కాదు అని అంటుంది. 

గజగండ: రా పాప రా మీ పిన్ని ప్రాణాలు అంటే వీరెరికీ పట్టనట్లుంది. నిన్ను పట్టుకుంటే మీ అమ్మ భుజంగమణిని అప్పనంగా ఇస్తుంది రారా.  
వల్లభ: అమ్మ నయని వాళ్లు పాపని అలా వదిలేశారేంటి.
తిలోత్తమ: అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. 
నయని: అద్భుతాలు ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తాయి అత్తయ్య.

గాయత్రీ పాప సుమన చేయి పట్టి లాగితే గజగండ సుమన చేయి వదిలేస్తాడు. సుమన ఆశ్చర్యపోతే నిన్ను వదిలింది పాప కోసం అని ఆ పాపని పట్టుకుంటా అని గజగండ  వెళ్తాడు. దాంతో గాయత్రీ తన దగ్గరున్న బొమ్మతో గజగండకి ఒక్కటిస్తుంది. గజగండ పడిపోతాడు. పాప కొడితే పడి పోవడం ఏంటని అందరూ అంటే పాప పట్టుకున్న బొమ్మలో భుజంగమణి ఉందని నయని చెప్తుంది. విశాల్ గజగండని పంపేస్తాడు. మరోవైపు వల్లభ, తిలోత్తమలు మాట్లాడుకుంటారు. భుజంగమణి ఎలా పని చేస్తుందో ప్రత్యక్ష చూశామని అంటుంది. నయనికి భుజంగమణి దూరం చేయాలని తిలోత్తమ అంటుంది. అందుకు నయనిని దొంగతనం అయినా చేయాలి లేదంటే నయనిని చంపేయాలని అంటుంది. రెండింటిలో ఏదో ఒకటి చేయాలని తిలోత్తమ అంటుంది. 

సుమన సోఫాలో కూర్చొని భుజంగమణి భుజంగమణి అని కలవరిస్తుంది. విక్రాంత్ అది చూసి సుమనను తట్టి లేపి ఏమైందని అడుగుతాడు. దానికి సుమన ఒక్క సారి నా చేతితో భుజంగమణి చూడాలని అంటుంది. నయని వద్దని అన్నప్పుడే నీకు భుజంగమణి చూసే అర్హత లేదని విక్రాంత్ అంటాడు. భుజంగమణిని కొట్టేయాలి అని సుమన అనుకుంటుంది. ఇక రాత్రి సుమన దొంగతనానికి వస్తే తిలోత్తమ, వల్లభలు కూడా వస్తారు. గాయత్రీ పాప బొమ్మల్లో భుజంగమణి దొరుకుతుందని వ వెతుకుతారు. సుమన, తిలోత్తమ, వల్లభ ముగ్గురు తెగ వెతకడం ఇంతలో ఇంట్లో అందరూ అక్కడికి వచ్చి లైట్ వేసి నిల్చొంటారు. ముగ్గురూ తెగ టెన్షన్ పడతారు. నయని ఇంట్లో వాళ్లతో భుజంగ మణి ఎక్కడుందో చెప్తే వాళ్లకి ఇచ్చేస్తా అంటుంది. అందరూ చెప్పడానికి తెగ ట్రై చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: రౌడీని చంపేసి సత్యకు ట్విస్ట్ ఇచ్చిన మహదేవయ్య.. అదిరిపోతున్న మామకోడలి చదరంగం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget