అన్వేషించండి

Trinayani November 17th Today Episode: దీపాలు వెలిగించిన పాము, సుమన చెంప పగలగొట్టిన నయని!

Trinayani Serial Today Episode: పాము వచ్చి దీపాలు వెలిగించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది

Trinayani Serial November 17th Episode: తిలోత్తమ అఖండ దీపం తీసుకొని వస్తుంది. దేవుడు దగ్గర పెడుతుంది. 
వల్లభ: లక్ష్మీ దేవి దగ్గర దీపారాధన చేశాక పెద్ద మరదలు నయని భక్తికి మెచ్చి దీపాలు వాటంటత అవే అతుక్కుంటే ఎంత బాగుంటుందో కదా 
తిలోత్తమ: అలా ఎలా జరుగుతాయిరా అద్భుతాలు అడగగానే జరగాలి అంటే కుదరదు
విక్రాంత్: బ్రో లేనిపోని కోరికలు కోరుకోవద్దు
సుమన: అలా ఎందుకు అనుకుంటారు మా అక్క పరమశివుడి భక్తురాలు కాబట్టి జరిగినా జరగొచ్చు
నయని: మీమాటలకు ఏం కానీ దీపారాధన చేసి టపాసులు కాల్చుదాం పిల్లలు సరదా పడతారు

ఇక సుమనకు అందరూ ఉలూచీని తీసుకురమ్మాంటారు. తాను భయం అని తీసుకురాను అని చెప్తుంది. ఇక పూజ అయ్యాక నయని అందరికీ హారతి ఇస్తుంది. మరోవైపు తిలోత్తమ, సుమన, వల్లభ వాళ్లు దీపాలు వాటంతట అవే వెలిగే వరకు వేచి చూద్దాం అంటారు. దీంతో డమ్మక్క నయనికి కాకరపువ్వును అమ్మవారి దేవుడి దగ్గర వెలిగించి పట్టుకోమంటుంది. ఎవరు వచ్చినా కాకరపువ్వు ఇవ్వు అని చెప్తుంది. మరోవైపు అందరూ ఏ దేవుడు వచ్చి దీపాలు వెలిగిస్తారో చూద్దాం అని అంటారు. 
సుమన: ఎవరు వస్తారో తెలీదు. మనిషి కాదు అంటారు. దీపాలు వాటంతట అవే వెలుగుతాయి అంటున్నారు. అసలు ఏం జరగబోతుంది
హాసిని: అద్భుతం చిట్టీ అలా చూడు వస్తున్నారు నాగయ్య అని పామును చూపిస్తుంది. ఇక పాము వచ్చి దీపాలను వెలిగిస్తుంది. అందరూ షాక్ అవుతారు. 
హాసిని: డమ్మో డమ్మ ఎలా ఉంది అమ్మ బొమ్మ
పావనామూర్తి: నేను ఈ అద్భుతాన్ని పై నుంచి చూడాలి నన్ను ఎత్తుకో విశాల్ బాబు అంటే విశాల్ పావనామూర్తిని ఎత్తుకుంటే పాము దీపాలు వెలిగించడాన్ని చూస్తారు. బతికుండగానే భగవంతుని దర్శనం అయిందని పావనా మూర్తి సంతోషిస్తాడు. అదేంటి అమ్మ నాగయ్య ప్రమిదలు అన్నీ వెలిగించాడు కానీ అక్కయ్య తెచ్చిన అఖండ దీపం వెలిగించలేదు
సుమన: భయమేస్తుందేమో చిన్న చిన్న దీపాలు వెలిగించింది కానీ పెద్ద దీపం వెలిగిస్తే మూతి కాలుతుందని ఆగిపోయింటుంది
నయని: లేదు లేదు నాగయ్య వెలిగించకపోవడానికి కారణం ఉంటుంది 
విశాల్: మరి నాగయ్య వెలిగించకుండా ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు
తిలోత్తమ: అందరూ నాకు అడుగుతున్నారు ఎందుకు
హాసిని: మూకుడు తెచ్చిందే మీరు కనుక
సుమన: అక్క ఇందాకైతే సరదాగా దీపాలు వాటికవే వెలుగుతాయేమో చూద్దాం అనుకున్నాం. ఇంతలో నాగయ్య వచ్చి దీపాలు వెలిగించాడు. కానీ ఇప్పుడు అత్తయ్య తెచ్చిన దీపాలు వెలిగించలేదు అంటే దాని అర్ధం అత్తయ్య ఏమైనా చేసింది అనా. 
నయని: నేనేం అనలేదే
తిలోత్తమ: నువ్వు అనవు నయని అందరూ అన్నా కూడా చూస్తూ ఉంటావు
వల్లభ: అమ్మా నువ్వే ఆ దీపం వెలిగించు 
నయని: ఆగండి అత్తయ్య ఆ అఖండ దీపం తెచ్చింది మీరైనా వెలిగించాల్సింది మా చెల్లి. (తిలోత్తమ దీపం సిద్ధం చేయడం చాటుగా చూసిన సుమన ఆ దీపంలో  నువ్వుల నూనె బదులు విస్పోటనం అయ్యే నూనె పెడుతుంది. దీపాల దగ్గర ఉండే నయనికి ప్రమాదం జరగాలని అలా చేస్తుంది )

అది గుర్తొచ్చి సుమనను ఎందరు పిలిచినా వెళ్లడానికి వెనకడుగు వేస్తుంది. ఇక హాసిని నేను వెలిగిస్తా అని చెప్తే నయని వద్దు అంటుంది. ఇంతలతో నాగయ్య ఆ దీపాన్ని విసిరి ఆ విస్పోటనం నూనెను సుమన మీదకు విసిరేస్తుంది. దీంతో నయని నాగయ్య మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. పాము వెళ్లిపోతుంది. 

తిలోత్తమ: అఖండ దీపం వెలిగించకుండా చేసింది ఆ పాము. దానికి అంత చనువు ఇస్తే ఇలానే చేస్తుంది
సుమన: ముందు మా అక్కను అనాలి అని అంటే నయని సుమనను చెంప దెబ్బ కొట్టి జుట్టు పట్టుకొని 
నయని: సుమనతో మెల్లగా ఎప్పుడైతే అత్తయ్య అఖండ దీపం పట్టుకొని ముందుకు వచ్చిందో అప్పుడు తనకి మంటలు అంటుకున్నట్లు నాకు కనిపించింది. అప్పుడు నీలో భయం చూశా నువ్వు ఏదో చేశావ్ అని అర్థమైంది. అందుకే నువ్వు ముందుకు రాలేక పోయావ్. ఇక సమన అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అందరూ ఏదో జరిగింది అని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP DesamTirumala Bramhotsavam Simha vahanam | యోగ నారసింహుడి అలంకారంలో తిరుమల శ్రీవారు | ABP DesamPrakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Embed widget