అన్వేషించండి

Trinayani Serial Today June 27th: 'త్రినయని' సీరియల్: లలితాదేవి వింత ప్రవర్తనకు బిత్తరపోయిన నయని, విశాల్.. అసలు ఆవిడ లలితాదేవేనా!

Trinayani Serial Today Episode విశాల్ ఇంటికి వచ్చిన లలితాదేవి గాయత్రీ దేవి ఫొటోకు పాపతో పూజలు చేయించి అది విఫలం అవ్వడంతో నయనిని మొదటి సారి గట్టిగా తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode లలితాదేవి చేతికి గాయమై పెద్ద కట్లతో ఇంటికి వస్తుంది. ఇక గదిలోకి వెళ్లిన ఆవిడ నుంచి విశాల్‌కి పదే పదే కాల్స్ రావడంతో విశాల్, నయని, హాసినిలు ఆలోచనలో పడతారు. స్నానానికి వెళ్లిన ఆమె ఫోన్ చేయడం, కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా బిజీ అని మెసేజ్ పెట్టడం ఏంటా అని ఆలోచనలో పడతారు. 

నయని: ఇంట్లోనే ఉంటే బిజీ అని మెసేజ్ పెట్టడం ఏంటి. 
విశాల్: నయని ఎందుకో నాకు కాస్త కన్ఫూజన్‌గా ఉంది. 

ఉదయం ఇంట్లో ఎడమ చేతితో లలితాదేవి ముగ్గు పెడుతుంటే హాసిని రంగులు అద్దుతుంది. ఇక లలితాదేవి వల్లభో గాయత్రీ దేవి ఫొటో తీసుకురమ్మని చెప్తుంది. విశాల్, నయని కూడా వస్తారు. ఏం చేస్తున్నారని అడుగుతారు. 

లలితాదేవి: మొన్న ఇంట్లో మా చెల్లి గాయత్రీ దేవి ఆబిద్ధకం చేశారంట కదా. నట్టింట్లో తిలోత్తమ అద్దం ముక్కలు చేసిందని తెలిసింది. చూసుకునే అద్దాన్ని పెద్ద ముత్తయిదువు అయిన తిలోత్తమ విరగ్గొట్టడం వల్ల నా చెల్లి ఆత్మకు శాంతి కలగదు. 
నయని: ఆత్మకి శాంతి కలగడం ఏంటి పెద్దత్తయ్య గారు అమ్మగారు పునర్జన్మ ఎత్తారు కదా. పునర్జన్మ ఎత్తినప్పుడు మళ్లీ ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకోవడం ఏంటి.
విశాల్: ఎవరైనా అలా అంటే వారించే మీరే అమ్మ ఆత్మకు శాంతి కలగాలి అనడం ఆశ్చర్యంగా ఉంది. 
లలితాదేవి: నాన్న విశాల్ నా చెల్లి పునర్జన్మ ఎత్తిందని నిన్ను పెంచిన తిలోత్తమకు తెలీదా. తెలుసు అయినా సరే మొండిగా వర్థంతి జరిపించింది. అది అరిష్టం కదా. అందుకే ఆత్మ విమోచనం, శాంతికి సంబంధించిన వ్యవహారాన్ని సరిదిద్దుకుంటే తప్ప పూర్వజన్మ తాలూకు ఇబ్బందులు తొలగిపోవు. 
నయని: ఇప్పుడేం చేస్తారు అమ్మగారు.
లలితాదేవి: చెప్తానుగా. హాసిని నువ్వు వెళ్లి ఐదు నిమ్మకాయలు, పసుపుకుంకుమ, ప్రమిద తీసుకురా. వల్లభ నువ్వు ఆ ఫొటోని ముగ్గు మధ్యలో పెట్టు. 
విక్రాంత్: ఇలాంటి రెమిడీ నేను ఎప్పుడూ చూడలేదు. 

ఇక లలితాదేవి పసుపు కుంకుమలను గాయత్రీ దేవి ఫొటో మీద గాయత్రీ పాపతో చల్లమని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. విక్రాంత్ పసిపాపతో అలాంటి పనులు చేయించొద్దని అంటాడు. నయని, విశాల్‌లు ఇబ్బంది పడతారు. ఇక విశాల్ పర్లేదు అంటే గాయత్రీ పాపతో నయని పసుపు కుంకుమ చల్లిస్తుంది. ఇంతలో ఇంట్లో పెద్దగా గాలి వీస్తుంది. లలితాదేవి మాత్రం అంతా మంచే జరుగుతుందని అంటుంది. ఇక పాపతో నయని ఫొటో చుట్టూ నిమ్మకాయలు పెట్టిస్తుంది. పాప చేతనే దీప కూడా పెట్టించమని లలితా దేవి చెప్తుంది. వెలిగించే టైంకి ఇంట్లో పెనుగాలి ఆగిపోతుంది. 

లలితాదేవి: మనసులో.. ఈ దీపం వెలగ్గానే అసలు విషయం బయట పడుతుంది. 
నయని: మనసులో.. విశాలాక్షి అమ్మ తల్లి నాకు ఎందుకో ఈ పరిష్కారం మార్గం మీద అనుమానంగా ఉంది. ఏదైనా తేడా ఉంటే తప్పించు తల్లి. 

దీపం వెలిగించే టైంకి ఫొటో చుట్టూ పెట్టిన నిమ్మకాయలు గాల్లోకి లేస్తాయి. అందరూ షాక్ అయిపోతారు. అంతలోనే నిమ్మకాయలు దీపం కుందె మీద పడి నూనె లలితాదేవి ముఖం మీద పడుతుంది. ఇక గాయత్రీ పాప చేతిలోని అగ్గిపుల్ల పడేయడంతో లలితాదేవి ముఖం దగ్గరకు వెళ్లి అగ్గిపుల్ల నిల్చుంటుంది. దాని నుంచి మసి కిందకి పడుతుంది. లలితాదేవి నయనిని తిడుతుంది. నూనె నా మీద పడిందని నిప్పు రవ్వ నా మీద పడితే చనిపోనా అని చనిపోవాలి అని చూస్తున్నావా అని కోప్పడి ఇంటికి వెళ్లిపోతుంది. నయని ఏడుస్తుంది. 

విశాల్: నయని పెద్దమ్మ అన్న మాటలకు ఫీలవుతున్నావా.
నయని: పర్లేదు కానీ ఎందుకు అలా మాట్లాడారో అర్థం కాలేదు. తిలోత్తమ అత్తయ్య ఏమైనట్లు. పెద్దమ్మ వస్తున్నారు అని ఎవరికీ తెలీదు కదా మరి ఏమైనట్లు. తిలోత్తమ అత్తయ్య ఇంటి పట్టునే ఉండొచ్చు కదా. ఏమైందో ఎక్కడికి వెళ్లిందో తెలీదు. పెద్దమ్మ గారు రేపు కూడా ఉంటాను అన్నారు.
విశాల్: అలా అయితే తిలోత్తమ అమ్మ రేపు కూడా రాకపోవచ్చు. వస్తే పెద్దమ్మ తన చేతి గురించి ఆరా తీస్తుంది. మనకు ఉన్నంత ఓపిక పెద్దమ్మకు లేదు. పెద్దమ్మ ఇంట్లో ఉంది అని చెప్పకుండా తిలోత్తమ అమ్మను రప్పించాలి. తిలోత్తమ అమ్మ ఇంటికి వచ్చిందని అబద్ధం ఆడుదాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూస్తావ్ కదా.

వల్లభ గంటలమ్మ దగ్గరకు వెళ్తుంది. తన తల్లి కనిపించడం లేదు అని వల్లభ గంటలమ్మకు చెప్తాడు. దాంతో గంటలమ్మ నువ్వు చూడటం లేదు అని అంటాడు. మీ అమ్మ మీ ఇంట్లోనే ఉంది అని గంటలమ్మ అంటుంది. ఇక లలితాదేవి గురించి గంటలమ్మ  అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రి తమతో కలిసి ఉంటేనే పెళ్లి చేసుకుంటానన్న స్వప్న.. త్వరలోనే కార్తీక్, జ్యోలకు నిశ్చితార్థం!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget