అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today June 26th: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రి తమతో కలిసి ఉంటేనే పెళ్లి చేసుకుంటానన్న స్వప్న.. త్వరలోనే కార్తీక్, జ్యోలకు నిశ్చితార్థం! 

Karthika Deepam 2 Serial Today Episode దీప కాంచన ఇంటికి వెళ్లి వంటలు చేసిందని అందరూ కార్తీక్‌ దీపలకు సంబంధం ఉందని అనుకుంటారు అని పారిజాతం సుమిత్రతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప నర్శింహ మాటలు తలచుకొని ఏడుస్తుంటే కార్తీక్ అది చూసి దీప దగ్గరకు వెళ్తాడు. సమస్య రౌడీది అయితే తనకు కచ్చితంగా చెప్పాలని అంటాడు. శౌర్య తనకు ఫ్రెండ్ అని తనకు కూడా బాధ్యత ఉందని కార్తీక్ అంటాడు. ఇక దీప తన తండ్రి విషయంలో తాను చూసింది తప్పని నిజం తెలిశాక తన తప్పు తెలిసిందని అందుకు కార్తీక్‌కి క్షమాపణ అడుగుతుంది. ఇక కార్తీక్ తన తప్పు లేదు అని దీపకు తెలియడంతో తన మనసులోని బాధ అంతా తీరిపోయిందని కార్తీక్ అంటాడు. చాలా సంతోషిస్తాడు. ఎవరి దృష్టిలో తాను నేరుస్తుడు కాదు అని అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతాడు. 

శ్రీధర్, కావేరి, స్వప్నలు హ్యాపీగా ఉంటారు. కావేరి స్వప్నకి పెళ్లి చేసేద్దామని భర్తతో చెప్తుంది. శ్రీధర్ మనసులో కాంచనకు కావేరి గురించి తెలిసేలోపు పెళ్లి చేసేయాలి అని కావేరి కంగారు పడుతుందని అనుకుంటాడు. శ్రీధర్ కూడా స్వప్నకు పెళ్లికి ఒప్పించాలి ప్రయత్నిస్తాడు. కానీ స్వప్ప ఒప్పుకోదు.

స్వప్న: నాకు వంద కారణాలు ఉన్నాయి డాడీ. అన్నీ నువ్వే. నువ్వు ఎప్పుడైతే బిజినెస్ పనులు అన్నీ పూర్తి చేసుకొని మాతో కలిసి ఉంటావో అప్పుడే నేను పెళ్లి చేసుకుంటా. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు లేకపోతే మమ్మీకి నేను తోడు ఉంటాను. నేను అత్తారింటికి వెళ్లిపోతే మమ్మీ పరిస్థితి ఏంటి. 
శ్రీధర్: డాడీని విలన్‌ని చేశావు చిట్టితల్లి. నువ్వు అత్తారింటికి వెళ్లిపోతే నా కావేరిని ఒంటరిని చేసేస్తా అనుకున్నావా ఏంటి. నో వే. మీ అమ్మ పక్కన ఉంటే నేను ఎవ్వరు ఫోన్ చేసినా ఫోన్ కూడా ఎత్తును అంతే. 

ఇంతలో శ్రీధర్‌కి కాంచన కాల్ చేస్తుంది. శ్రీధర్ తెగ కంగారు పడతాడు. కావేరి కూడా చూసి స్వప్నకు తెలిసిపోతుంది. ఏమో అని టెన్షన్ పడుతుంది. ఇక స్వప్న అడిగితే శ్రీధర్ కనకరాజు అని అబద్ధం చెప్తాడు. కాల్ లిఫ్ట్ చేసి ఆఫీస్‌లో బిజీగా ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను అని అంటాడు. కాంచన అటువైపు నుంచి ఎప్పుడు వస్తారు అండీ అని అడిగితే వస్తాను అని కాల్ కట్ చేసేస్తాడు. 

స్వప్న: డాడీ ఇంట్లో ఉండి ఆఫీస్‌లో ఉన్నాను అని అబద్ధం ఎందుకు చెప్తావు.
శ్రీధర్: కొన్ని సార్లు అలాగే చెప్పాలి. లేదంటే మన టైం వేస్ట్ చేస్తారు చిట్టితల్లి. సరేరా నేను వెళ్తాను. 
స్వప్న: మమ్మీ డాడీ ఇప్పటి వరకు చాలా రిలాక్స్‌గా ఉన్నారు. కాల్ రాగానే కంగారు పడ్డారు ఏంటి.
కావేరి: స్వప్నకి అనుమానం వచ్చినట్లు ఉంది. ఆయన పనులు ఆయనకు ఉంటాయ్ అమ్మా.
స్వప్న: బిజినెస్ పార్ట్‌నర్ అయితే ఇంత కంగారు పడరు. ముందు నేను ఆ కొబ్బరి బొండాం మనిషిని కనిపెట్టాలి.

దీప శౌర్య కోసం భోజనం తీసుకొచ్చి పాపని పిలుస్తుంది. ఇక శౌర్య తల్లిని ఆట పట్టించాలి అని దాక్కుంటుంది. దీప కంగారుగా వెతుకుతుంది. శౌర్యని చూసి ఊపిరి పీల్చుకుంటుంది. ఇక కావాలనే దీప కూడా శౌర్యని వెతికినట్లు వెళ్లి దాక్కుంటుంది. శౌర్య దీపని వెతుక్కుంటూ వస్తే దీప భయపెడుతుంది. ఇక నర్శింహ మాటలు తలచుకొని దీప ఏడుస్తూ నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లకని అంటుంది. ఇక దీప శౌర్య సరదాగా నవ్వుకుంటారు. దీప శౌర్యకి సరదాగా అన్నం తినిపిస్తుంది. ఆ సీన్ చూడటానికి చాలా బాగుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ రేలా రేలా సాంగ్ వస్తుంది. 

సుమిత్ర: మామయ్య ఇక ఆలస్యం చేయకుండా మనమంతా ఓ మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకుంటే మంచిదేమో. 
శివనారాయణ: నువ్వు అన్నది బాగుంది అమ్మ కాకపోతే కార్తీక్ రెస్టారెంట్ పనుల్లో బిజీగా ఉన్నాడని కాంచన మాట్లాడి చెప్తా అంది. 
సుమిత్ర: పర్వాలేదు మామయ్య గారు పిల్లల ఇష్ట ప్రకారమే చేద్దాం.
పారిజాతం: అలా అని ఇంకో ఐదేళ్లు ఆగండి. అప్పుడు చేసుకుంటా అంటాడు. అప్పుడు సరిపోతుంది. 
శివనారాయణ: పారిజాతం నువ్వు వస్తా అంటే తీసుకెళ్లాను అంతే. ఇది నా మనవడు, మనవరాలి పెళ్లి విషయం. నా కొడుకు కోడలు మేం చూసుకుంటా నువ్వు మధ్యలోకి రాకు. 
పారిజాతం: నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగా ఉందా. ఆ దీప విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాంచనకు బాలేదు అని కార్తీక్ చెప్తే ఆ దీప వెళ్లి వంటలు చేసి వచ్చింది. ఇప్పుడు కాంచనకు బాగానే ఉంది అనుకో. నిజంగానే ఆ విషయం నీకు చెప్తే మనం క్యారేజీ పంపేవాళ్లం కదా. నిజంగానే దీప ఆ ఇంటికి ఏ ఉద్దేశం లేకుండా వెళ్లిందా. ఈ విషయం దీప మొగుడికి తెలిస్తే వాడి అనే మాటలు మీరు పడగలరా. వాడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా. హవ్వా.. ఇది ఆ నోటా ఈ నోటా అందరికి తెలిస్తే మన పిల్లకి పెళ్లి చేస్తే విలువ ఉంటుందా. 
శివనారాయణ: పారిజాతం ఇప్పుడు నువ్వు నోరుముయ్యక పోతే నా ఓర్పు సహనం నశించిపోతాయ్. మనం ఎలా చూస్తే ప్రపంచం అలా చూస్తుంది.
పారిజాతం: నా మనవరాలి మెడలో మూడు ముళ్లు పడితే నేను నోరు ఎత్తను. ఆ పని ముందు చేయండి.
సుమిత్ర: మామయ్య గారు మనలో మనకు మనస్పర్థలు ఎందుకు ముందు నిశ్చితార్థం చేసేద్దాం. అందరూ ఇక దీపని పొగిడేస్తారు. 

శౌర్య పేపర్‌తో బొమ్మలు చేస్తుంది. ఒక్కోటి టేబుల్ మీద పెట్టి ఇది నువ్వు, నేను, నాన్న అని అంటుంది. రేపు ఫాదర్శ్‌ డే కదా నాన్న మనతో లేడు అని ఇలా చేశాను అంటుంది. ముగ్గురం ఉంటే బాగుంటుంది అని నాన్నని తీసుకొచ్చా అని పేపర్ బొమ్మ పట్టు కొని శౌర్య తన తండ్రితో మాట్లాడుతున్నట్లు మురిసిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రేవతిని ఇంటి నుంచి పంపేయడానికి పెళ్లి ప్లాన్ చేసిన మహాలక్ష్మి.. ఎమోషనలైన సీత, రామ్‌లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Embed widget