అన్వేషించండి

'Trinayani Serial Today February 29th: త్రినయని' సీరియల్: తాను తీసిన గోతిలో తానే పడ్డ తిలోత్తమ.. మత్తు మందు కలిపిన పాలు తాగించేసిన హాసిని!

Trinayani Serial Today Episode గాయత్రీ పాపని ఇంట్లో ఎవరికీ తెలీకుండా అఖండ స్వామి దగ్గరకు తీసుకెళ్లాలి అని తిలోత్తమ, వల్లభ ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode వల్లభ, తిలోత్తమలు గాయత్రీ పాప కోసం వెతుకుతారు. పాపని ఎవరు చూడకుండా అఖండ స్వామి దగ్గరకు తీసుకెళ్లాలి అనుకుంటారు. పాప ఏడ్వకుండా ఉండటానికి మత్తు మూలిక వేరు కూడా తీసుకొస్తారు. అయితే వల్లభ ఆ మత్తు కోసం తెచ్చిన వేరు ఎలా పని చేస్తుందా అని చూడాలి అని ఆ వేరును తన తల్లి ముక్కు దగ్గర పెడతాడు. దీంతో తిలోత్తమ స్పృహా కోల్పోతుంది. హాసిని వచ్చి అత్త చచ్చిపోయింది అని హడావుడి చేస్తుంది. కింద పడుకోపెట్టి ఏడుస్తుంది. ఇక నయని, హాసిని కలిని తిలోత్తమ కాలి చిటికెన వేలు గట్టిగా లాగి స్పృహలోకి వచ్చేలా చేస్తారు. 

హాసిని: బతికి పోయింది.
విశాల్: అమ్మా ఇటు చూడు.
తిలోత్తమ: ఎక్కడున్నాను నేను..
హాసిని: ఊటీలో ఉన్నాను అని ఫీలవుతున్నారేమో.. మొత్తానికి బతికిపోయారు. 
తిలోత్తమ: వల్లభను గట్టిగా చెంప మీద కొడుతుంది.. 
విశాల్: అమ్మ నిన్ను కొట్టింది అంటే నీ వల్లే స్పృహా కోల్పోయింది అని అర్థం అన్నయ్య.
నయని: బావగారు ఏం చేశారు.
వల్లభ: అది ఏం చేశాను అంటే.. అని వేరు తీయబోతుంటే
తిలోత్తమ: ఏమీ చేయకుండా సైలెంట్‌గా చూస్తూ కూర్చొన్నందుకే కొట్టాను. ఆరింటి నుంచి ఆకలిగా ఉందిరా అంటే కనీసం పాలు అయినా తెచ్చి ఇవ్వకుండా నేను కళ్లు పడిపోయేంతవరకు చూస్తూ ఉన్నాడు ఈ వేస్ట్ ఫెలో. 
సుమన: నాకు చెప్పాల్సింది కదా అత్తయ్య.
విక్రాంత్: నువ్వు నయని వదినకు చెప్తావ్ అంతే కదా.
ధురందర: సర్వీస్ చేయనివాళ్లు చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వకండి. వదినను కాస్త కనిపెట్టుకొని ఉండండి.
హాసిని: ఇక నేను కనిపెట్టుకొని ఉంటాను కదా మీ అత్తయ్యని ఎప్పుడు ఎలా ఉంటుందో బాగా చూస్తూ ఉంటాను. 
తిలోత్తమ: సర్లే. పిల్లలు ఏం చేస్తున్నారు.
పావనా: వాళ్లు ఇంకా లేవలేదు అక్క.
విశాల్: అమ్మా వాళ్లతో ఆడుకుంటే ఇంకా అలిసిపోతావ్. నువ్వు టిఫెన్ చేసి రెస్ట్ తీసుకో.
డమ్మక్క: వాళ్లకి పాలు పట్టడానికి తల్లులు ఉన్నారు. ముందు నువ్వు పాలు తాగమ్మా. 
హాసిని: నేను వెళ్లి పాలు తీసుకొని వస్తా.. కిచెన్‌లో రెండు ఒకేలాంటి గిన్నెలతో పాలు ఉంటే చూసిన హాసిని ఇలా ఎందుకు ఎవరు ఉంచారు అనుకుంటుంది.
తిలోత్తమ: మనసులో.. ఈ హాసిని పాలు తీసుకొని వస్తాను అని వెళ్లింది ఏం పాలు తెస్తుందో ఏంటో. 
డమ్మక్క: తిలోత్తమకు కొత్త భయం పట్టుకున్నట్లు ఉంది.
విక్రాంత్: అమ్మ ఎప్పుడూ లేనిది ఈ రోజే ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు.
తిలోత్తమ: అలాంటిది ఏమీలేదే.
నయని: గంధరగోళానికి గురైనట్లు కనిపిస్తున్నారు అత్తయ్య.
హాసిని: అయోమయానికి గురైంది నేను చెల్లి. అంటూ రెండు గిన్నెల్లో పాలు తీసుకొని వస్తుంది. పాలు తీసుకొద్దామని వెళ్తే రెండు గిన్నెల్లో ఉన్నాయి. 
వల్లభ: పిల్లలకు పెద్దలకు అని వేరు చేసి పెట్టి ఉంటారు.
విశాల్: అన్నయ్య అలా ఎందుకు చేస్తారు. ఆవుపాలు గేదె పాలు అని వేరు చేసి పెట్టి ఉంటారు. 
నయని: ఒకే గిన్నెలో పాలు పెట్టాను కదా. సుమన ఉలూచి కోసం నువ్వు పాలు తీసుకొచ్చావా.
సుమన: లేదే..
డమ్మక్క: పాలు పోసే అతను ఉదయమే వచ్చాడు. సాయంత్రం వరకు రాడు. ఈ మధ్యలో ఈ పాలను ఎవరు ఎక్కడి నుంచి తెచ్చారో కొంచెం ఆలోచించాలి. 
 
తిలోత్తమ ఆ పాల ప్యాకెట్ తెచ్చి. అందులో మత్తు మందు కలిపి వాటిని గాయత్రీ పాపకు పట్టిస్తే గాఢ నిద్రలోకి జారుకుంటుంది. అఖండ స్వామి ఇచ్చిన మత్తు వేరుని ఇంకోలా వాడొచ్చు అని తలోత్తమ అనుకుంటుంది. ఇక తిలోత్తమ ఆ పాలను తాగను అనేస్తుంది. జ్యూస్ కావాలని అంటుంది. ఇక హాసిని పాలు తాగమని బలవంతం చేస్తుంది. తిలోత్తమ భయపడుతుంది. వద్దు అంటే బలవంతం చేస్తున్నారు అని అంటుంది. ఇక తిలోత్తమ ఈ గిన్నెలో పాలు వద్దు అని అంటుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: హన్సిక మోత్వాని: చీరకట్టులో చందమామల కవ్విస్తున్న హన్సిక

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 13th: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
నువ్వులేక నేను లేను: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
Podarillu Serial Today August 13th:బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు
పొదరిల్లు: బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget