అన్వేషించండి

Trinayani Serial Today December 16th Episode - 'త్రినయని' సీరియల్: తన మొదటి భర్త రావడంతో షాకైన తిలోత్తమ, గంగాధర్ చేతిలోనే చనిపోతుందా!

Trinayani Today Episode - తిలోత్తమ మొదటి భర్త గంగాధర్ విశాల్ ఇంటికి వచ్చి ఆమెను చంపాలని గన్ తీసుకొని రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Trinayani Serial Today Episode :

సుమన: ముక్కు మొహం కూడా తెలీని వాళ్లని కాపాడే మా అక్క ఇంట్లొ వాళ్లని ఎలా కాపాడుతుందో చూద్దాం అనుకుంటున్నాను.
విక్రాంత్: ఆపద ఎవరికో నయని వదినకు ఇంకా తెలీదు అనుకుంటా.
డమ్మక్క: తనకి తెలీడం కాదు పుత్రా.. నీకు తెలిస్తే ఏమైపోతారో కదా..
విక్రాంత్: ఆపద నాకే వస్తుంది అంటే వదిన నన్ను ఆదుకోవాల్సిన అవసరం కూడా లేదు.
సుమన: అయ్యో నా పసుపు కుంకుమలు అంటే మీకు అంత అలుసు అయిపోయాయా.
నయని: చెల్లి నీకు కానీ విక్రాంత్ బాబుకు కానీ ఏం జరగదు.
డమ్మక్క: ఇంకో గడియ దాటితే కళ్లముందే సాక్ష్యాత్కరిస్తుంది.
నయని:  విక్రాంత్ బాబు ఎవరికి ఏం జరిగినా కానీ అన్నింటికీ సిద్ధంగా ఉండండి.

గంగాధర్: ఓసేయ్ తిలోత్తమ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక మనం కాపురం పెట్టింది ఓ గుడిసెలో వల్లభున్ని కన్నాక నువ్వు కూడా ఉద్యోగం చేస్తాను అన్నావు. విక్రాంత్‌ను కన్నాక గాయత్రమ్మ దగ్గర పీఏగా జాయిన్ అయ్యావు. నేను నీ మొగుణ్ని అని దాచిపెట్టి ఇప్పుడు చీమలు కష్టపడి కట్టిన పుట్ట పాముల పాలైనట్లు విశాల్ బాబు, నయని అమ్మ కట్టించుకున్న ఈ బంగ్లాలో పాగా వేశావ్.. గాయత్రి అమ్మ గారిని చంపిన నిన్ను ఆ తల్లికి దహన సంస్కారాలు చేసిన ఇదే స్థలంలో హతమార్చాలి అని ఈ గన్ తీసుకొచ్చా. అంటూ మళ్లెపూలలో గన్ దాచుకుంటాడు. మరోవైపు విశాల్ పావనామూర్తి అక్కడికి వస్తారు.
విశాల్: గంగాధర్ ఇక్కడ ఉన్నావా?
గంగాధర్: అవును బాబు తిలోత్తమ వాళ్లు చూస్తారేమో అని.
విశాల్: అమ్మ దగ్గరకే నిన్ను తీసుకెళ్లాలి అనుకుంటే నువ్వేంటి భయపడుతున్నావ్. 
గంగాధర్: ఏంటో బాబు నేనంటేనే తనకు గిట్టదు
పావనా: గిట్టదు అంటేనే ఇద్దరు పిల్లలు పుట్టారా.. బలే చెప్తున్నావ్ అయ్యా.. 
గంగాధర్: నేనంటే తనకు కోపం ఉంది.
విశాల్: మా అమ్మని చంపింది నువ్వు కాదు అని నాకు తెలుసు.. పద లోపలికి ముందు నీపై కోప్పడినా తర్వాత అర్థం చేసుకుంటుంది.
పావనా: తర్వాత ఆలోచిస్తుంది నిన్ను విశాల్ బాబు ఎందుకు నమ్మాడా అని.
గంగాధర్: కేవలం విశాల్ బాబును పెంచి పెద్ద చేసింది అని మాత్రమే ఓపిక పట్టాను బాబు. లేదంటే ఎప్పుడో దాని అంతు చూసేదాన్ని.
విశాల్: నన్ను కన్న గాయత్రీ అమ్మనే పెంచిన అమ్మ అయుష్షు తెంచేస్తుంది అని ఓపికపడుతున్నాను. ఆరోజు రానే వస్తుంది.
పావనా: బుల్లి గాయత్రీ ఏం తక్కువ కాదు.. అవకాశం ఉన్నప్పుడు అంతా పంజా విసురుతుంది. మీ ఆవిడ ఒకవేళ పోతే నువ్వేం బాధపడవు కదా..
గాంగాధర్: లేదయ్యా.. తన పాపం పండింది అనుకుంటాను.. 
విశాల్: పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పి ఆశ్చర్యానికి గురి చేస్తావనే నిన్ను పిలచాను. మిగతా విషయాలు మాట్లాడుకొని మూడ్ పాడు చేసుకుంటావ్ ఎందుకు. 
గంగాధర్: విశాల్ బాబు నాదో చిన్న విన్నపం చాలా నెలల తర్వాత నా భార్యని కలుస్తున్నా కదా ముందు మీరు వెళ్లి చప్పట్లు కొట్టండి తర్వాత నేను వస్తాను.. (వెళ్లండి బాబు ఆ రాక్షసి రక్తపు మడుగులో పడ్డాక నేను చప్పట్లు కొడతాను)

మరోవైపు నయని, హాసిని, విక్రాంత్, సుమన, డమ్మక్క వాళ్లు పెళ్లి రోజు ఏర్పాట్లు చేస్తారు. ఇంతలో తిలోత్తమ అందంగా రెడీ అయి కిందకి వస్తుంది. వెనకాలే వల్లభ కూడా వస్తాడు. 
నయని: మనసులో.. మృత్యువు పలకరించబోతుంది అని తెలిస్తే ఎంత హైరానా పడతారో కానీ అత్తయ్య చావాల్సిందే గాయత్రీ అమ్మ చేతుల్లో.. మరణం ఇంకా ఏ రూపంలో రాకుండా అడ్డుకోవాలి కానీ ఎలా.. 
సుమన: అత్తయ్య ఈ రోజు చాలా అందంగా ఉన్నారు.
హాసిని: ఆ పెళ్లి కల వచ్చేసింది.
తిలోత్తమ: నీ మొహం నాకు పెళ్లి కల రావడం ఏంటి.. పెళ్లి జరగనట్లు.
హాసిని: ఎవరికి తెలుసమ్మ.. జగదీష్ మామయ్యకి మించిన కుబేరుడు తగిలితే మళ్లీ మీ గుండెల మీద ఇంకో తాళి తగలదు అని గ్యారెంటీ ఏంటీ.
 
ఇక విశాల్ సర్‌ప్రైజ్ ఇస్తా అని చెప్పి చప్పట్లు కొడతాడు. ఇక అప్పుడు లోపలికి అఖండ స్వామి వస్తారు. దీంతో తిలోత్తమ హో అఖండ స్వాముల వారిని పిలిచారా అని అంటుంది. 
వల్లభ: నమస్తే స్వామి మిమల్ని విశాల్ బ్రో పిలిచాడా.
అఖండ: నన్ను ఎవరూ పిలవలేదు వల్లభ నేనే వచ్చాను.
నయని: బాబు గారు మీరు ఇంకా ఎవరినైనా రమ్మని పిలిచారా?
విశాల్: అవును నయని.. 
విక్రాంత్: బ్రో జగదీష్ నాన్నని ఫారెన్ నుంచి రప్పించారా..పెళ్లి రోజుకు రావడం కుదరదు అని చెప్పారు కదా.. సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారా.. 

ఇక మరోసారి విశాల్ క్లాప్స్ కొడితే గురువుగారు వస్తారు.. దీంతో పావనా మూర్తి అదేంటి బాబు మనం అనుకున్నవాళ్లు తప్ప ఎవరెవరో వస్తున్నారు అంటాడు. ఇక వల్లభ ఇద్దరూ మనకు తెలిసిన వారే అంటే దానికి విక్రాంత్ కాదు బ్రో గురువుగారు మన శ్రేయాభిలాషి.. అఖండ స్వామి మీకు మాత్రమే తెలుసు అంటాడు. 

సుమన: ఏది ఏమైనా అత్తయ్యని ఆశీర్వదించడానికి ఇద్దరు స్వామీజీలు వచ్చారు కదా.
గురువుగారు: అఖండ వచ్చింది తిలోత్తమని ఆశీర్వదించడానికి కాదు సుమన.. 
హాసిని: ఇంకెందుకు వచ్చారు.
తిలోత్తమ: చెప్పండి స్వామి చెప్పిన తర్వాత నన్ను ఆశీర్వదించండి.
అఖండ: గురువుగారు చెప్పినట్లే నేను వచ్చింది నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికే తిలోత్తమ. గండం మీ అమ్మ వైపునకే మళ్లింది కాబట్టి.. 
విక్రాంత్: బ్రో మీరు ఎవర్నో పిలిపించాను అన్నారు కదా.. 
సుమన: రెండు సార్లు చప్పట్లు కొట్టినా సర్‌ప్రైజ్ లేదు.. అనుకోకుండా స్వాములు వచ్చారు.. 
డమ్మక్క: ఈ సారి పిలవండి తప్పక వస్తారు.
విశాల్: అమ్మ కేక్ కట్ చేయక ముందు మీరు వస్తే బాగుంటుంది రండి అంటూ చప్పట్లు కొడతాడు. దీంతో గంగాధర్ లోపలకి వస్తాడు.. అతన్ని చూసి ఇంట్లో వాళ్లు అందరూ షాక్ అయిపోతారు. ఇక గురువుగారు గాంగాధరం అంటూ పలకరిస్తారు. ఇక నయని పెద్దయ్య అని అంటుంది. 
గంగాధర్: అందరూ బాగున్నారు కదా.. ఏంటి అందరూ అలా చూస్తున్నారు.
విక్రాంత్: మీరు వస్తారు అని మేము ఎవరూ ఊహించలేదు నాన్న.
డమ్మక్క: పుత్రా నువ్వు నాన్న అని పిలుస్తుంటే చూడముచ్చటగా ఉంది.
సుమన: అత్తయ్య గారికి ఎందుకో ఇబ్బందిగా ఉన్నట్లుంది.
హాసిని: ఎందుకు ఉండదు చిట్టీ సర్‌ప్రైజ్అంటూ షాకిచ్చారు కదా విశాల్ వాళ్లు.. 
గురువుగారు: వస్తే గిస్తే గనుక జగదీష్ గారే వస్తారు అని భ్రమ పడి బయపడ్డారు కాబోలు.. 
తిలోత్తమ: విశాల్ మీరు ఏం చేశారో మీకు అయినా తెలుసా.. మీ అమ్మ గాయత్రీ దేవి చావుకి కారణమయిన వాడిని ఇంట్లోకి ఆహ్వానించారు.
విక్రాంత్: నాన్నే పెద్దమ్మని చంపేశాడు అని కథనాలే కానీ సాక్ష్యాలు, ఆధారాలు లేవు కదా అమ్మ.
విశాల్: అన్నయ్య విక్రాంత్ అన్నదాంట్లో నిజం ఉంది. నిందలు, ఆరోపణలు ఎవరు ఎవరిమీదైనా వేస్తుంటారు.. కానీ సత్యం వేరుగా ఉంటుంది.
గంగాధర్: తిలోత్తమ నేను గాయత్రీ అమ్మగారి బంటుని ఆమె సేవలు చేస్తూ నిన్నూ వల్లభుడ్ని, విక్రాంత్‌ని ముగ్గురిని పెంచి పోషించినవాడిని.. అప్పుడు డ్రైవర్‌గా ఉన్న నేను ఇప్పుడూ అలాగే ఉంటాను కానీ.. నేనే కోటీశ్వరుణ్ని అనుకోను నీ భర్తను అయినా సరే.. 
అఖండ: గండం వచ్చినప్పుడు ఎవరూ తప్పించుకోలేరు.. 
సుమన: గండం గండం అంటున్నారు ఎక్కడు ఉంది స్వామి.
డమ్మక్క: ఇక్కడే ఉంది కాబోలు.. గండ అంటే కన్నడ  భాషలో భర్త.. గంగాధరుడు తిలోత్తమ భర్త అయితే తనే గండం కద అని డమ్మక్క అనడంతో అందరూ షాక్ అవుతారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్అర్జున్ టెండూల్కర్‌ని కొనుక్కున్న ముంబయి ఇండియన్స్13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Realme GT 7 Pro: ఐఫోన్ రేట్‌తో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ 7 ప్రో - అంత రేటు వర్తేనా?
ఐఫోన్ రేట్‌తో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ 7 ప్రో - అంత రేటు వర్తేనా?
Samlan Khan : మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
SCR  Sabarimala Special Trains:  ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!
ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!
AR Rahman's bassist Mohini Dey : రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే  
రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే  
Embed widget