అన్వేషించండి

Trinayani Serial Today April 24th: 'త్రినయని' సీరియల్: బెడిసికొట్టిన తిలోత్తమ పౌడర్ ప్లాన్.. తింగరి చేష్టలతో తారుమారు చేసేసిన హాసిని!

Trinayani Serial Today Episode గాయత్రీ దేవి జాడ తెలుసుకునేందుకు అఖండ స్వామి ఇచ్చిన పౌడర్‌ని తిలోత్తమ ప్రయోగించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode విశాల్ కావాలనే గాయత్రీ దేవి జాడ తెలీకుండా చేశాడని సుమన అంటుంది. దీంతో నయని కూడా విశాల్‌ని ప్రశ్నిస్తుంది. విక్రాంత్ సుమనను తిడతాడు. ఇంతలో నయనికి తన దివ్య దృష్టి వల్ల పోలీస్‌ అధికారికి ప్రమాదం జరిగినట్లు కనిపిస్తుంది. దీంతో నయని పోలీసన్నకు ఏం అవుతుందా అని కంగారు పడుతుంది. 

విశాల్: నయని ఏమైంది..
విక్రాంత్: వదినా.. చూశావా నీ మూలంగా వదిన ఎంత హర్ట్ అయిందో..
సుమన: అందుకు కాదు లెండీ పూజలు అని కడుపులో ఏం వేసుకోకపోతే కళ్లు తిరగవా.. 
విశాల్: సుమన ఇందాక నన్ను అడిగావ్ కదా జూస్ కావాలా పాలు కావాలా అని మీ అక్క కోసం తీసుకురా.
సుమన: నా కన్నా మా అక్కే అవి బాగా చేయగలదు.
నయని: పర్వాలేదు బాబుగారు నేను బాగానే ఉన్నాను. ఎవరికి ఏం కాకపోతే అంతే చాలు.

తిలోత్తమ అఖండ స్వామి తనకు ఇచ్చిన పౌడర్‌ని గాయత్రీ దేవి ఫొటోకు రాస్తుంది. ఇక వల్లభ గాయత్రీ పాపను తీసుకొని వస్తాడు. పాప ముఖానికి వల్లభ అదే పౌడర్ రాస్తాడు. ఒక పావనామూర్తి, డమ్మక్క అక్కడికి వస్తారు. పౌడర్ గురించి ఆరా తీస్తారు. వాళ్లు అడిగితే తిలోత్తమ వాళ్లు చెప్పడం లేదని అందర్ని పిలుస్తాడు. ఇక పాప ముఖం, గాయత్రీ దేవి ఫోటోలకు పౌడర్ చూసి అందరూ షాక్ అవుతారు. 

విశాల్: అమ్మా ఈ పని కూడా నీదేనా..
తిలోత్తమ: అవును నాన్న..
నయని: ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవచ్చా అత్తయ్య.
తిలోత్తమ: పిచ్చి పని అని ఎందుకు అనుకుంటావ్ నయని. నీకు సాయం చేస్తున్నాం అనుకోవచ్చు కదా.. గాయత్రీ అక్కయ్య కోసం నయని ఎన్ని ప్రయత్నాలు చేసినా అచూకీ లేకపోవడంతో అఖండ స్వామిని కలిశాం. ఆయన సూచక మేరకు ఇలా చేస్తున్నాం. 
విశాల్: అన్నయ్య ఏ పౌడర్ తీసుకొచ్చి అమ్మ ముఖానికి రాశావ్ నువ్వు.
వల్లభ: ఫొటోకే కదా తంబి.. ప్రాణం లేని వాటికి ఏం రాసినా స్పందనలేదు.
నయని: మరి గాయత్రీ పాపకు ఎందుకు రాశారు.
తిలోత్తమ: అఖండ స్వామి ఇచ్చిన పౌడర్ అక్క ఫొటోతో పాటు అక్క పేరు పెట్టుకున్న ఈ పాప ముఖానికి రాసి బూడిద రాసిన అద్దాన్ని ఈ పాపకు చూపిస్తే అసలైన గాయత్రీ దేవి ప్రస్తుతం ఉన్న చిరునామా తెలుస్తుందని చెప్పారు. 
పావనా: వారెవ్వా ఏం చెప్పాడు ఆ స్వామి.
హాసిని: పొగుడుతారు ఏంటి బాబాయ్..
నయని: ఎవరో ఏదో చెప్పారు అని మీరు వాటిని మాకు చెప్పకుండా చేస్తే ఎలా.. పాపకు ఏమైనా అయితే ఎలా..
విశాల్: అయినా పిల్లల మీద ఏంటి అమ్మా మీ ప్రయోగాలు.
తిలోత్తమ: ఫీలవ్వకు విశాల్ ఒక వేళ ఫీల్ అవ్వాల్సి వచ్చినా నిన్ను కన్నతల్లి అలియాస్ నువ్వు కన్న కూతురు కనపడకుండా పోయింది అని బాధ పడాలే కానీ కోప్పడకూడదు. 
నయని: విసిగించకుండా ఒక్క మాటలో మీరు చేయబోయే మంచి ఏంటో చెప్తారా. 
తిలోత్తమ: అఖండ స్వామి ఇచ్చిన పౌడర్ గాయత్రీ పాపకు, గాయత్రీ అక్కయ్య ఫొటోకి రాసి బూడిద రాసిన అద్దంలో గాయత్రీ పాపని చూసిస్తే గాయత్రీ అక్క జాడ తెలుస్తుంది. 
విక్రాంత్: పిచ్చా వెర్రా.. ఈ అద్దంలో ఏం చూసినా కనిపించదు.  
డమ్మక్క: పాప చూస్తూ ఉన్నప్పుడు ఆ బూడిద చెరుపుతూ ఉండాలి అప్పుడే కనిపిస్తుంది. 
సుమన: ఎవరు కనిపిస్తారు. 
తిలోత్తమ: గాయత్రీ పాప చూస్తే గాయత్రీ అక్కయ్య కనిపిస్తుంది. 
పావనా: గాయత్రీ అక్క కనిపించినా పాప కనిపించినా ఒకటే కదా.. 
నయని: బాబుగారు చూద్దాం వీళ్లు మంచి పని చేస్తున్నాం అంటున్నారు కదా ఏదైనా జరగాలి అప్పుడు అత్తయ్య బావగారు అని కూడా చూడను..
సుమన: మా అక్క అన్నింటికి తెగించినట్లుంది. 

తిలోత్తమ అద్దం పట్టుకుంటే.. వల్లభ గాయత్రీ పాపను ఎత్తుకుంటాడు. తిలోత్తమ అద్దంపై బూడిద చెరుపుతూ ఉంటుంది. ఇంతలో అందులో హాసిని ముఖానికి పిండి రాసుకొని మేకప్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అందరూ షాక్ అవుతారు. హాసిని సెటైర్లు వేస్తారు. 

డమ్మక్క: గాయత్రీ దేవి కనిపిస్తారు అని అందరూ అనుకుంటే నువ్వు కనిపించావ్ అని అందరూ షాక్ అవుతున్నారు. 
హాసిని: నేనే కనిపిస్తాను అని నాకు ముందే తెలుసు.
సుమన: ఏం చెప్తున్నావో అర్థం కావడం లేదు అక్క. ఇప్పుడు కట్టుకున్న చీర వేరు అద్దంలో కట్టుకున్న చీర వేరు.
తిలోత్తమ: మన గదిలో పెట్టిన పౌడర్‌ని ఈ తింగరిది తీసింది. 
హాసిని: అవును.. అసలు ఏం జరిగిందంటే.. అని హాసిని తిలోత్తమ వాళ్ల గదిలోకి వెళ్లి వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అనుకుంటుంది. వాళ్లు ముందే ఈ విషయం గురించి మాట్లాడుకోవడం విని ఆ పౌడర్ వల్లభ ఎక్కడ పెడతాడో చూసి దాన్ని తీసుకొంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘పుష్ప 2’ నుంచి క్రేజీ అప్డేట్ - మొదటి పాట వచ్చేస్తుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget