(Source: ECI/ABP News/ABP Majha)
Trinayani October 17th: సుమన ముందు నయనిని అడ్డంగా బుక్ చేసిన తిలోత్తమ -పెద్ద బొట్టమ్మకు ఘోర అవమానం!
పెద్దబొట్టమ్మకి, సుమనకి పెద్ద గొడవ జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Trinayani October 17th Written Update: ఈరోజు ఎపిసోడ్ లో పెద్దబొట్టమ్మ అక్కడున్న వాళ్ళందరికీ నుదుటన కుంకుమ పెట్టి ఫంక్షన్ కి పిలుస్తుంది. అప్పుడే హాసిని పైనుంచి చీర పట్టుకుని కిందకి వస్తుంది.
హాసిని: ఇదిగో నాగలక్ష్మి పిన్ని మా ఇంటి నుంచి వాయినం గా ఈ చీర తీసుకో.
తిలోత్తమ: నీకు ఈవిడ ముందే తెలుసా హాసిని?
హాసిని: హా! పక్కనే ఉంటాం కదా చాలాసార్లు కనిపిస్తూ ఉంటారు.
సుమన: గడప దాటితే మొఖం కప్పుకుంటారు అంటున్నారు. మరి నీకెలా కనిపించారు అక్క?
డమ్మక్క: ఒక రోజు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కనిపించారు లే సుమన అని కవర్ చేస్తుంది.
తర్వాత హాసిని చేతిలో నుంచి నయని ఉలూచి ఉన్న చీరని పట్టుకొని పెద్ద బొట్టమ్మకు ఇవ్వబోతుండగా సుమన ఆపుతుంది
సుమన: ఆపండి!!మీరు చీర ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. కానీ నా చీరే దొరికిందా ఇవ్వడానికి? నా చీరను ఇవ్వడానికి నేను ఒప్పుకోను.
డమ్మక్క: ఒక్క పనిని కూడా సరిగ్గా చేయవు కదా హాసిని అని హాసినితో నెమ్మదిగా అంటుంది. అప్పుడు హాసిని, కంగారులో సుమన చీర తెచ్చి ఇచ్చేసాను అని అంటుంది.
దురంధర: దానికేముందు లేవే, ఇప్పుడు నువ్వు కోటీశ్వరురాలు అయిపోయావు. అలాంటి చీరలు వేలకు వేలు కొనుక్కోవచ్చు.
విశాల్: ఇప్పుడు దానికోసం గొడవెందుకు సుమన? ఆ చీరెంతో చెప్తే నేనే నీకు ఇచ్చేస్తాను
సుమన: 30 వేలు
పావనమూర్తి: మొన్నే కదే పదివేలు అన్నావు.
సుమన: నేను కట్టుకున్నప్పుడు పది వేలు. నా దగ్గర నుంచి ఇంకొకరికి వెళ్తే దాని విలువ రెట్టింపు అవుతది నాకు ఇప్పుడు ఆ 30 వేలు కావాలి
నయని: సరే ఆ డబ్బులు నేను ఇస్తాను ఇక గొడవ చేయకండి అని ఆ చీరని పెద్ద బొట్టమ్మకి ఇస్తుంది.
పెద్దబొట్టమ్మ: ఫంక్షన్ కి పిలవడానికి మీ ఇంటికి వచ్చాను అలాగే మీ దేవుడికి దండం పెట్టుకొని వెళ్లొచ్చా?
వల్లభ: అలా వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న నగలన్నీ ఆ చీరలో దాచుకొని వెళ్ళిపోవు అని నమ్మకం ఏంటి? అని అనగా ఒకేసారి హాసిని వాళ్ళందరూ ఉలిక్కిపడతారు
నయని: మీకంత అనుమానంగా ఉంటే నేను కూడా పిన్ని గారితో వెళ్తాను అని పెద్దబొట్టమ్మని దేవుడి గది దగ్గరికి తీసుకొని వెళ్తుంది.
అప్పుడు పెద్దబొట్టమ్మ చీరలో నుంచి ఉలూచి ని బయటకు తీస్తుంది. ఉలూచి తాగి వదిలేసిన ఆ పాలని, అలాగే దేవుడి దగ్గర ఉన్న ఆకుని తీసుకొని వస్తుంది నయని. అప్పుడు ఉలూచి ఆ ఆకుతో ఆ పాలను పెద్ద బొట్టమ్మ ముఖం మీద కాలిన ప్రదేశాలలో తడుముతూ ఉంటుంది. ఇంతలో హాసిని అక్కడికి వస్తుంది.
హాసిని: ఎంతసేపు చెల్లి. త్వరగా కానివ్వు అక్కడ మళ్ళీ వాళ్ళందరికీ అనుమానం వస్తాది
డమ్మక్క: ఉలూచి మందు రాస్తుంది కదా. వైద్యం జరుగుతుంది ఇంకొంచెం సేపు మాత్రమే అని అనగా ఇంతలో వాళ్లకి ఎవరో చప్పట్లు కొడుతున్న శబ్దం వినిపిస్తుంది. తీరా చూడగా అక్కడ తిలోత్తమ, వల్లభలు ఉంటారు.ఒకేసారి వాళ్ళని చూడడంతో నయని వాళ్ళందరూ షాక్ అవుతారు.
Also Read: ఆనందంగా సాగుతోన్న కృష్ణ, మురారీ జీవితంలో పెనువిషాదం!
తిలోత్తమ: ఈ గుజరాతి భామ పెద్ద బూట్టమ్మా?ఎంత మోసం చేశారు ఈ విషయం కాని సుమన కి తెలిస్తే మీ పరిస్థితి ఏంటో?
వల్లభ: దీనికి నా పెళ్ళాం కూడా వత్తాసు పలుకుతుంది. చిన్న మరదలా ఒకసారి ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందో చూడు అని గట్టిగా అరవగా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అక్కడున్న వాళ్ళందరూ పెద్ద బొట్టమ్మ ని చూసి ఆశ్చర్యపోతారు. సుమన అయితే కోపంతో రగిలిపోతుంది.
సుమన: పెద్ద బొట్టమ్మ ఏంటి ఇక్కడుంది? మళ్ళీ నా కూతుర్ని నా నుంచి లాగేసుకోవడానికి ట్రై చేస్తుందా దానికి మా అక్క వత్తాసు కూడా పలుకుతుంది.
విక్రాంత్: అయినా పెద్ద బొట్టమ్మ మనం ఎవరికీ కనిపించదు కదా. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది?
పెద్ద బొట్టమ్మ: అమ్మవారి చీర కట్టుకున్నందుకు మీ అందరికీ నేను కనిపిస్తున్నాను
వల్లభ: అయితే వాయినంగా ఇచ్చిన చీరతో పాటు ఈ చీర కూడా నొక్కేసావ్ అన్నమాట. మంచిది.
Also Read: అర్థరాత్రి రాజ్, కావ్య ఫన్ టైమ్ - రుద్రాణికి రివర్స్ గిఫ్ట్ ఇచ్చిన కనకం
పెద్ద బొట్టమ్మ: దయచేసి అలా మాట్లాడకండి. నా ముఖానికి అయిన గాయాన్ని ఉలూచి తీరుస్తుంది అని ఇక్కడికి వచ్చాను తప్ప మరే దురుద్దేశం లేదు
తిలోత్తమ: అవన్నీ కాదు ముందు ఈవిడని బయటకు గెంటేయు సుమన అని అనగా సుమన పెద్ద బొట్టమ్మ దగ్గరికి వస్తుంది. అప్పుడు పెద్ద బొట్టమ్మ ఒడిలో ఉన్న ఉలూచి సుమన వైపు బుస్ కొడుతుంది.
పెద్దబొట్టమ్మ: తప్పు ఉలూచి అలా చేయకూడదమ్మా. మీ అమ్మ వైపు ఎప్పుడూ పడగ విసరకూడదు. నేను ఇంక వెళ్తాను గాయానికి మందు వేసావు కదా రేపటికి సర్దుకుంటుంది. ఇంక నువ్వు నీ గదిలోకి వెళ్ళిపో అని అనగా ఉలూచి తన గదిలోకి వెళ్ళిపోతుంది.
నయని: సరే పెద్దమ్మ ఇంక నువ్వు బయలుదేరు అని అనగా పెద్ద బొట్టమ్మ అక్కడినుంచి వెళ్ళిపోతూ ఉంటాది. ఇంతలో సుమన తనని ఆపుతుంది.
Also Read: కిచెన్లో ముచ్చట్లు, కాలేజీలో బాధ్యతలు - బలపడిన రిషిధార బంధం!
సుమన: ఇంకొకసారి ఈ ఇంటి వైపు కానీ నా కూతురువైపు కానీ వస్తే చంపేస్తాను. నిన్ను కాదు ఉలూచిని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి పెద్ద బొట్టమ్మకి చాలా కోపం వస్తుంది.
పెద్ద బొట్టమ్మ: నయనీ నీ చెల్లికి చెప్పు ఒకవేళ ఉలూచి కి ఏమైనా అయితే తను సుమంగళీ గానే చచ్చిపోతుంది అని చెప్పి కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
తిలోత్తమ: చూసావా నయని నువ్వు తెచ్చిన దరిద్రాలే ఇంట్లో మనుషుల ప్రాణాలు మీదకు వచ్చాయి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత సీన్లో విశాల్ గాయత్రమ్మ ఫోటో ఎదురుగా నుంచుని ఉంటాడు.
విశాల్: అమ్మ ఇంట్లో అన్ని మంది పిల్లలు ఉన్నారు. పెద్ద బొట్టమ్మ, నాగయ్య లాంటి వాళ్ళు వస్తే ఆ పిల్లలకి ప్రమాదం. ఈరోజు కూడా అలాంటిదే జరిగింది అని అనగా నయని అక్కడికి వచ్చి ఆ మాటలు వింటుంది.
నయని: నా వల్లే కదా బాబు గారు తప్పు జరిగింది. నాతోనే ఆ మాట చెప్పండి. అయినా నేనే అలా చేసి ఉండాల్సింది కాదు. పెద్దమ్మ మొఖానికి గాయమైంది కనుక ఇలా చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial