(Source: ECI/ABP News/ABP Majha)
Krishna Mukunda Murari October 17th: ఆనందంగా సాగుతోన్న కృష్ణ, మురారీ జీవితంలో పెనువిషాదం!
కృష్ణ అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి ముకుంద భవానీకి చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna Mukunda Murari October 17th: కృష్ణ బాధగా హాస్పిటల్ లో కూర్చుని ఉండగా ఒకతను వచ్చి మురారీ లెటర్ ఇచ్చాడని చెప్తాడు. అది ఓపెన్ చేసి చదువుతుంది.
మురారీ: నేను ఇంటికి రాకపోవడానికి కారణం ముకుంద. ఒకప్పుడు మేమిద్దరం ప్రేమించుకున్నాం. కానీ మాకు వేర్వేరు పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు నా మనసు అంతా నువ్వే ఉన్నావ్ ఐలవ్యూ కృష్ణ. ముకుంద మనసులో నేను ఉన్నానని నిన్ను దూరం పెట్టాలని చూస్తుంది. నీతో ఇంట్లో ఉండటం సాధ్యం కాదు అందుకే మనం దూరంగా వెళ్లిపోదాం. నీకు ఇష్టమైతే మనం కలిసే చోటుకి వచ్చేయ్
మీరేనా నన్ను ఇలా అంది అంటే మీరు నన్ను మీ భార్యగా ప్రేమిస్తున్నారా అని కృష్ణ సంతోషపడిపోతుంది. వస్తున్నా క్షణం కూడా ఆలస్యం చేయనని నవ్వుకుంటుంది. అప్పుడే రేవతి వచ్చి పలకరిస్తుంది. చిన్నపిల్లలా ఎగురుతూ కేకలు పెడుతూ సంతోషంగా ఉంటుంది. చాలా అదృష్టవంతురాలినని అంటుంది. మురారీ రాసిన లెటర్ రేవతికి చూపిస్తుంది. వెళ్ళి మురారీని తీసుకుని భవానీ అక్క దగ్గరకి వచ్చి మీ మనసులు బయట పెట్టండి తను అర్థం చేసుకుంటుందని రేవతి సలహా ఇస్తుంది.
Also Read: అర్థరాత్రి రాజ్, కావ్య ఫన్ టైమ్ - రుద్రాణికి రివర్స్ గిఫ్ట్ ఇచ్చిన కనకం
భవానీ కృష్ణని తిట్టిన విషయం గుర్తు చేసుకుని ముకుంద సంతోషపడుతుంది. నేను చెప్పాల్సింది, చేయాల్సింది అంతా చేసేశాను. నేను అనుకున్నట్టే అత్తయ్య రియాక్ట్ అయ్యింది అది అసలైన హైలెట్. రేవతి అత్తయ్యలాగా కాకుండా కృష్ణని బయటకి పంపించేసింది. ఇక నాకు అన్నీ మంచి రోజులేనని ఆనందపడుతుంది. అప్పుడే రేవతి సంతోషంగా రావడం చూసి ఎందుకు నవ్వుతుందని అనుకుని వెళ్ళి పలకరిస్తుంది.
ముకుంద: కృష్ణ ఏడ్చుకుంటే వెళ్తే మీరు నవ్వుకుంటూ వస్తున్నారు ఏమైంది
రేవతి: నీకు లోపల ఏం జరిగిందో తెలుసు నాకు బయట ఏం జరిగిందో తెలుసు. నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావా? ఇంకాసేపు ఆగితే నాకు కాదు నీకు పిచ్చి పడుతుంది
కృష్ణ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, మురారీ ఎక్కడ ఇంత జరుగుతున్నా ఇంటికి రాలేదని అలేఖ్య ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మధుకర్ వస్తే ఇదే విషయం గురించి అడుగుతుంది. మధు ఆవేశంగా లాగిపెట్టి ఒకటి పీకుతాడు. ఇంకోకసారి ముకుంద చుట్టూ తిరిగితే ఊరుకొనని వార్నింగ్ ఇస్తాడు. కృష్ణ సంతోషంగా మురారీని కలిసేందుకు వెళ్తుంది. తన కొడుకు, కోడలు అందరికీ దూరంగా ఆనందంగా ఉంటే చాలని రేవతి దేవుడి ముందు నిలబడి మొక్కుకుంటుంది.
రేవతి: కృష్ణ వాళ్ళ జీవితంలో సంతోషమే విషాదానికి తావు లేదని మురారీ లెటర్ రాసిన విషయం మధుకర్ కి చెప్తుంది. ఇప్పుడు చెప్పు సంతోషమే కదా. మొదట ఆనందంగా ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉండటం మనం చూడలేం కదా అంటాడు. సరిగా అప్పుడే దేవుడి ముందు ఉన్న దీపాలు ఆరిపోతాయి. మురారీ ఎక్కడికి వెళ్లాడని భవానీ ఇంట్లో అందరినీ అడుగుతుంది. అసలు వాడికి నన్ను మోసం చేయాలని ఎలా అనిపించిందని రగిలిపోతుంది. రేవతి వచ్చి పలకరిస్తే ఇష్టం లేకుండా మాట్లాడుతుంది. పెద్దపల్లి ప్రభాకర్ వచ్చి కృష్ణ గురించి అడుగుతాడు. అందరూ కోపంగా ఉండటం చూసి ఏమైందని అనుకుంటాడు. కృష్ణ వాళ్ళు గదిలో ఉన్నారా అని వెళ్లబోతుంటే ముకుంద ఆగమని గట్టిగా అంటుంది.
Also Read: కిచెన్లో ముచ్చట్లు, కాలేజీలో బాధ్యతలు - బలపడిన రిషిధార బంధం!
ముకుంద: అసలు వాళ్ళు లేనప్పుడు కొసరు వాళ్ళకి మర్యాదలు ఎందుకు. మీ అమ్మాయిని మేమే మెడ పట్టుకుని బయటకి గెంటేశాము
ప్రభాకర్: నా బిడ్డని గెంటేయడం ఏంటి?
భవానీ: ముకుంద చెప్తుంది నిజమే
రేవతి: అక్క చెప్తుంది నిజమే మీరు అవమానాలు పడటం నాకు ఇష్టం లేదు మీరు వెళ్లిపోండి
ప్రభాకర్: వియ్యంకులతో మాట్లాడే పద్ధతి ఇదేనా
భవానీ: ఎవరు ఎవరికి వియ్యంకులు. మీ కూతురు అసలు మా కోడలే కాదు