Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం
ప్రతీ వారం కూడా ఏదొక స్ఫెషల్ కామెడీ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తారు. తాజాగా ‘జబర్దస్త్’ లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
బుల్లితెర పై ‘జబర్దస్త్’ షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. కామెడీకు సరికొత్త రూపం ఇస్తూ ఎంతో మంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకు పరిచయం చేసింది ఈ జబర్దస్త్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ కావడంతో ‘ఎక్స్ట్రా జబర్దస్త్’, ‘శ్రీ దేవి డ్రామా కంపెనీ’ లాంటి మరికొన్ని కామెడీ ప్రోగ్రాం లు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది కమెడియన్స్ ఈ వేదికపై తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని సినిమా అవకాశాలు కూడా సంపాదిస్తున్నారు. ప్రతీ వారం కూడా ఏదొక స్ఫెషల్ కామెడీ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తారు. తాజాగా ‘జబర్దస్త్’ లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక ఈ ‘జబర్దస్త్’ కార్యక్రమంలో నటి ఇంద్రజ, కమెడియన్ కృష్ణ భగవాన్ లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్ గా సౌమ్య రావు చేస్తుంది. సీరియల్స్ లో నటిస్తోన్న సౌమ్య రావు ఓ ప్రోగ్రాంలో కనిపించి ఆకట్టుకుంది. దీంతో ఆమెను యాంకర్ గా ఎంపిక చేశారు మల్లెమాల టీమ్. సాధారణంగా ప్రతీ ఎపిసోడ్ ప్రోమోలోనూ చివరల్లో ఏదొక ట్విస్ట్ లు పెడుతుంటారు. అవి ప్రేక్షకల్లో ఎంతో ఆసక్తిని రేకెక్కిస్తాయి. తాజాగా విడుదల చేసిన ప్రోమోలోనూ కొసమెరుపు ఉంది.
ఈ ప్రోమోలో ఇంద్రజ, సౌమ్యలు కాస్త ఓవర్ డ్రామా చేసినట్టుగా కనిపిస్తోంది. అసలు విషయం ఏంటంటే.. ఈ వారం కాన్సెప్ట్ శ్రీరామనవమి పండుగ. శ్రీరామ నవమి రోజు పానకం స్పెషల్ అని అందరికీ తెలుసు. అయితే ఈ ఎపిసోడ్ లో రాకెట్ రాఘవ టీమ్ అలాగే తాగుబోతు రమేష్, వెంకీ టీమ్ లు పానకం తయారు చేశాయి. అవి టేస్ట్ చేసిన జడ్జి ఇంద్రజ రాఘవ పానకం బాగుందని తెలిపారు. ఇంతలో యాంకర్ సౌమ్య కలుగజేసుకొని వెంకీ టీమ్ చేసిన పానకం బాగుందని, కావాలంటే కృష్ణ భగవాన్ ను అడుగుదామని అంది. దీంతో ఇంద్రజకు కోపం వచ్చి ఆ మాత్రం దానికి నన్ను అడగడం ఎందుకు, ఇది కరెక్ట్ కాదు అని అసహనం వ్యక్తం చేసింది. దీంతో రాఘవ స్టేజ్ దిగి వెళ్లిపోవడం కనిపించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా షాకయ్యారు. ఇది కూడా టీఆర్పీ డ్రామా కావచ్చని నెటిజన్స్ అంటున్నారు. ఈ ఫుల్ ఎపిసోడ్ మార్చి 30 న టెలికాస్ట్ కానుంది.
ఇక టీవీ ప్రోగ్రాం ప్రోమోలలో వచ్చే ఇలాంటి ట్విస్ట్ లు ఈ మధ్య ఎక్కువగానే కనిపిస్తున్నాయి. టిఆర్పీ రేటింగ్ కోసమే ఇలాంటి ప్రోమోలు కట్ చేస్తారని పబ్లిక్ కు కూడా తెలుసు. అయినా వాటిని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. అలా ప్రోమోలో సీరియస్ గా చేయడం, తీరా ప్రోగ్రాం టెలికాస్ట్ అయిన తర్వాత దాన్ని ఒక ఫన్ మూమెంట్ లాగా మార్చడం కూడా ఎంటర్టైన్ గానే చూస్తారు ప్రేక్షకులు. ఏదేమైనా ఈసారి ప్రోమోలో జడ్జి ఇంద్రజ, యాంకర్ సౌమ్య ల మధ్య గొడవ కాబట్టి దీనిపై ఆసక్తి పెరగిందనే చెప్పాలి. పూర్తి పోగ్రాం కోసం ఎదురుచూస్తున్నారు జబర్దస్త్ ఫ్యాన్స్.
Also Read : 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా