Jayam Serial: లవ్... ఎమోషన్... మోటివేషన్ - జీ తెలుగులో సరికొత్త సీరియల్ 'జయం'... ఆ సీరియల్స్ టైమింగ్స్ మారాయ్
Jayam Serial Promo: 'జీ తెలుగు' మరో సరికొత్త సీరియల్‌తో ఎంటర్‌టైన్ చేయబోతోంది. శ్రీరామ్ వెంకట్, వర్షిణి ప్రధాన పాత్రలో 'జయం' ఈ నెల 14 నుంచి టెలికాస్ట్ కానుంది.

Sri Ram Venkat Jayam Serial Promo Released: మదిని దోచే సీరియల్స్, బ్యూటిఫుల్ ఈవెంట్స్, రియాలిటీ షోస్‌తో తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ సరికొత్తగా ఎంటర్‌టైన్‌మెంట్ అందించే 'జీ తెలుగు' మరో సరికొత్త సీరియల్‌తో వచ్చేస్తోంది. లవ్, ఎమోషన్, మోటివేషన్‌తో కూడిన కథతో ఆడియన్స్ హృదయాలను హత్తుకునే ఓ సరికొత్త లవ్ స్టోరీ 'జయం'తో రాబోతోంది.
జులై 14 నుంచి స్టార్ట్
శ్రీరామ్ వెంకట్, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సీరియల్ 'జయం' ఈ నెల 14 నుంచి 'జీ తెలుగు'లో టెలికాస్ట్ కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 8 గంటలకు ప్రీమియర్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమో వీడియోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో శ్రీరామ్ 'రుద్ర' అనే బాక్సర్‌గా కనిపించనుండగా... గంగావతి అనే ఓ పేదింటి అమ్మాయిగా వర్షిణి కనిపించనున్నారు.
స్టోరీ ఏంటంటే?
పేదింటి అమ్మాయి గంగావతి (వర్షిణి). తాగుడుకు బానిసైన తండ్రి. కిడ్నీ సమస్యతో బాధ పడే తల్లి. తనకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకుని తల్లిని చూసుకుంటూ గెలుపు కోసం ప్రయత్నిస్తుంది. మరోవైపు మంచి బాక్సర్ కావాలని కలలు కంటూ గత జ్ఞాపకాలతో సతమతం అవుతూ ఉంటాడు రుద్ర (శ్రీరామ్ వెంకట్). బాక్సింగ్ కాంపిటీషన్‌లో గెలిచి తన తల్లి వైద్యం కోసం డబ్బు సంపాదించాలని భావించే గంగావతి ఏం చేసింది.
View this post on Instagram
ఈ ప్రశ్నలకు ఆన్సర్స్ తెలియాలంటే?
అసలు రుద్ర ఎవరు? అతని గతం గుండెల్లో చేసిన గాయం ఏంటి? బాక్సింగ్‌లో అతను అనుకున్నది సాధించాడా? గంగావతి కూడా బాక్సర్ కావాలనే కలలు కందా? రుద్ర బాక్సింగ్ కోచ్‌గా ఎలా మారాడు? కాంపిటీషన్‌లో గెలిచి తన తల్లి ఆపరేషన్‌కు డబ్బు సంపాదించిందా? వీరిద్దరూ ఎలా కలిశారు? వీరి మధ్య గతం ఏంటి? ఇద్దరూ తమ లక్ష్యాలను చేరుకోవడంలో 'జయం' సాధించారా? అనేది తెలియాలంటే ఈ సీరియల్ మిస్ కాకుండా చూడాల్సిందే. మంచి మోటివేషన్ ఉన్న స్టోరీ అని ప్రోమో వీడియోస్ చూస్తేనే అర్థమవుతోంది.
Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఎమోషనల్ అయిన అమర్ - హగ్ చేసుకున్ ఆరు
సవాల్‌తో కూడిన రోల్
తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సీరియల్ టీం ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'జయం' ఓ స్పెషల్ స్టోరీ అని... ఇప్పటివరకూ తాను పోషించిన అన్నీ రోల్స్ కంటే డిఫరెంట్‌గా ఉంటుందని శ్రీరామ్ వెంకట్ తెలిపారు. 'బాక్సింగ్ కోచ్‌గా రుద్ర పాత్రలో నటించడం నాకు సవాల్‌తో కూడుకుంది. అదే టైంలో ఎంతో ఉత్సాహంగా అనిపించింది. ఆడియన్స్ ఈ సీరియల్‌ను తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం.' అని చెప్పారు.
మారిన రిమెయినింగ్ సీరియల్స్ టైమింగ్స్
'జయం' సీరియల్ ప్రసారంతో ఇతర సీరియల్స్ టైమింగ్స్‌లో స్వల్ప మార్పులు ఉంటాయని 'జీ తెలుగు' తెలిపింది. ఈ నెల 14 నుంచి 'ఛామంతి' సీరియల్ రాత్రి 8:30 గంటలకు, 'జగద్ధాత్రి' రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతాయని వెల్లడించింది.






















