Vintara Saradaga Teaser: లవ్... ఎక్కడైనా తప్పించుకోలేని ప్రాబ్లమ్ - ఆసక్తికరంగా 'VISA - వింటారా సరదాగా' టీజర్
Vintara Saradaga: సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ 'వింటారా సరదాగా' టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అమెరికా నేపథ్యంలో సాగే స్టోరీ ఆకట్టుకుంటోంది.

Ashok Galla's Vintara Saradaga Teaser Released: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ 'వింటారా సరదాగా'. ఇప్పటికే ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుండగా... తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అదిరిపోయింది. రొమాంటిక్, లవ్, యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా కొత్త దర్శకుడు ఉద్భవ్ మూవీని తెరకెక్కించారు.
టీజర్ అదుర్స్
అమెరికా నేపథ్యంలో సాగే స్టోరీ 'VISA - వింటారా సరదాగా'. భారత్ నుంచి చదువుల కోసం అమెరికాకు వెళ్లిన యూత్ లైఫ్, వారి ఇబ్బందులు, లవ్, ఫ్రెండ్స్ అన్నింటినీ ఎమోషనల్‌గా చూపించనున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. 'ఆంధ్ర తెలంగాణ తర్వాత మన తెలుగు వారు బాగా కనెక్ట్ అయిన స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్...' అంటూ అశోక్ గల్లా రేడియో జాకీగా పాడ్ కాస్ట్‌లో చెప్పే డైలాగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అక్కడక్కడ కామెడీ పంచులు అదిరిపోయాయి. 'అక్కడైనా ఇక్కడైనా తప్పని తప్పించుకోలేని ప్రాబ్లం లవ్.' అంటూ లవ్ ట్రాక్ చూపించడం హైప్ క్రియేట్ అవుతోంది.
Also Read: 'అవతార్' టెక్నాలజీతో డ్రీమ్ ప్రాజెక్ట్ - కొత్త మూవీపై డైరెక్టర్ శంకర్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్
మూవీలో అశోక్ గల్లాతో పాటు శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, వైవా హర్ష, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.అమెరికాలో చదివి బాగా సెటిల్ కావాలని ఎంతో మంది ఇండియన్ స్టూడెంట్స్ కలలు కంటారు. వారి డ్రీమ్స్, అక్కడ ఎదుర్కొనే అనుభవాలు, వారు పడే ఇబ్బందులు, లవ్, కామెడీ, ఫ్రెండ్స్, ఎమోషన్ అన్నీ కలగలిపి మూవీలో చూపించనున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.
If a VISA was ever required to enter a love story… this is your stamp in! 💖✈️
— Sithara Entertainments (@SitharaEnts) July 12, 2025
A quirky rom-com with all the feels and fun! 😍😉#VISA ~ #VintaraSaradaga Teaser is out now!
— https://t.co/eVQ4vnjYx4 @AshokGalla_ @srigouripriya @ActorRahulVijay @ShivathmikaR @itsudbhav… pic.twitter.com/TCIZsvTO1s
అశోక్ గల్లా 'హీరో' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా కాకుండా ఫస్ట్ మూవీతోనే యూత్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'దేవకీ నందన వాసుదేవ' అనుకున్నంత సక్సెస్ కాలేదు. తాజాగా... మరో యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌తో ముందుకొస్తున్నారు. ఈ మూవీతో భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నారు.





















