Nindu Noorella Saavasam Serial Today July 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఎమోషనల్ అయిన అమర్ - హగ్ చేసుకున్ ఆరు
Nindu Noorella Saavasam Today Episode: ఆరు తన పక్కనే ఉందని అమర్ ఎమోషనల్ అవ్వడం చూసిన ఆరు వెళ్లి హగ్ చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి పీక పట్టుకుని పైకి లేపేస్తుంది ఆరు. గుప్త వచ్చి చెప్పినా వినదు. మనోహరి ఏడుస్తూ వదిలేయ్ అరు అంటూ ప్రాధేయపడుతుంది. దీంతో మనోహరిని వదిలేస్తుంది ఆరు. ఫంక్షన్‌లో రణవీర్ మనుషులు అంజు కోసం వెతుకుతుంటారు. రూంలోంచి బయటకు వచ్చిన ఆరు కోపంగా చూస్తుంది.
గుప్త: బాలికా ఏంటా ఆవేశం
ఆరు: లేకపోతే ఏంటి గుప్త గారు.. నా కుటుంబం జోలికి వస్తుందా..? అందుకే దాన్ని చంపేద్దాం అనుకున్నాను.. అయినా..గుప్త గారు నాకు శక్తులు లేవు కదా మనును ఎలా పట్టుకోగలిగాను.. గుప్త గారు మిమ్మల్నే అడుగుతున్నాను.. నాకు శక్తులు వచ్చాయా..?
గుప్త: అవును వచ్చాయి బాలిక
ఆరు: అవునా నాకు శక్తులు వచ్చాయా..? ఇంతకీ నాకు శక్తులు ఎలా వచ్చాయి గుప్త గారు.
గుప్త: నీ పిల్ల పిచ్చుక ఆ పూలు తీసుకెళ్లి నీ ఫోటో దగ్గర పెట్టింది.
ఆరు: గుప్త గారు మీరు చెప్పేది నిజమేనా..?
గుప్త: నిజమే.. బాలిక
అని గుప్త చెప్పగానే.. ఆరు ఎమోషనల్‌గా అంజును నా బంగారు తల్లి అనుకుంటూ ఫంక్షన్ హాల్‌లోకి వెళ్తుంది.
గుప్త: నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటున్నావో.. లేక నీ కుటుంబమే నిన్ను కాపాడుకుంటుందో తెలియడం లేదు. అంతా జగన్నాథుడి లీల
అందరూ టార్చి లైట్స్ వేసుకుని అంజును వెతుకుతుంటారు. రణవీర్ మనుషులు అంజుకోసం వెతుకుతుంటారు. అంజు ఎక్కడా కనిపించడదు.
భాగీ: ఏమైంది అంజు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లి ఉంటుంది
అమర్: రాథోడ్ పవర్ రావడానికి ఎంత టైం పడుతుంది
రాథోడ్: సార్ ఇక్కడ వైర్లు అన్ని కట్ అయి పోయాయి
అమర్: భాగీ నేను వెళ్లి చూసి వస్తాను జాగ్రత్త..
కరెంట్ వస్తుంది. చిత్ర కనబడటం లేదని వినోద్ కంగారు పడుతుంటాడు. అంజు కోసం భాగీ గట్టిగా పిలుస్తుంది. అంజు, రణవీర్ టేబుల్ కింద నుంచి వస్తుంది. రణవీర్ షాక్ అవుతాడు.
రణవీర్: ఇంతసేపు నేను వెతుకుతున్న అంజు నా టేబుల్ కిందే దాక్కుందా..? ( మనసులో అనుకుంటాడు)
భాగీ: ఎక్కడికి వెళ్లిపోయావు అంజు ఎంత భయం వేసిందో తెలుసా..?
అంజు: ఇందాకా వాష్‌రూం కు వెళ్లి వస్తుంటే.. సడెన్‌గా కరెంట్ పోయింది. నీకు తెలుసు కదా నాకు కరెంట్ లేకపోతే భయం వేస్తుందని.. వెతుక్కుంటూ వచ్చి అక్కడ టేబుల్ కింద కూర్చున్నాను.. కరెంట్ పోయినప్పుడు భయం వేసింది మిస్సమ్మ అందుకే చెవులు మూసుకుని కూర్చున్నాను.. పాపం నా కోసం మీరు గట్టిగా అరిచి ఉంటారు కదా..?
వినోద్: చిత్ర కనిపించడం లేదు
లోపలి నుంచి చిత్ర కంగారుగా వస్తుంది.
చిత్ర: వినోద్ ఇంతకుముందు కరెంట్ పోయినప్పుడు ఎవరో నన్ను లాక్కెళ్లి నా నగలు ఎత్తుకెళ్లారు
అమర్: చిత్ర.. కంగారు పడకు ఆ నగలు ఎత్తుకోని వెళ్తున్నవాడు నాకు దొరికాడు. నగలు కూడా సేఫ్‌గా ఉన్నాయి
శివరాం: నాన్నా నీకేం కాలేదు కదా..?
అమర్: ఏం కాలేదు నాన్నా
భాగీ: ఎవ్వరూ భయపడకండి అందరికీ భోజనాల రెడీగా ఉన్నాయి చేద్దాం పదండి
అని చప్పగానే అందరూ భోజనాలకు వెళ్తారు. తర్వాత గార్డెన్‌లో కూర్చుని గుప్త ఆలోచిస్తుంటే ఆరు డాన్స్ చేస్తుంది. ఇంతలో బయటకు వెళ్లిన అమర్ వచ్చి కారు దిగి గార్డెన్ దగ్గర నిలబడి ఆరును గుర్తు చేసకుని ఎమోషనల్ అవుతుంటాడు. అంతా వింటున్న ఆరు దగ్గరకు వెళ్లి అమర్‌ను హగ్ చేసకుంటుంది. అప్పుడే ఇంట్లోంచి వచ్చిన భాగీ ఆరు, అమర్‌ను హగ్ చేసుకోవడం చూసి షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















