అన్వేషించండి

Rangula Ratnam June 26th: ‘రంగుల రాట్నం’ సీరియల్: సిద్దు వాళ్లకు మాయ మాటలు చెప్పిన రేఖ, పూర్ణని మరోసారి బాధపెట్టిన శంకర్ ప్రసాద్?

తండ్రికి యాక్సిడెంట్ అయిందని భార్యతో కలిసి సిద్ధూ బయలుదేరుతుండగా రేఖ మాయమాటలు చెప్పి ఆపటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది.

Rangula Ratnam June 26th: రఘుకు నూకాలు ఫోన్ చేసి శంకర ప్రసాద్ కి యాక్సిడెంట్ అయిన విషయం చెప్పడంతో రఘు షాక్ అయ్యి ఆ విషయాన్ని తన తల్లికి, భార్యకు చెప్పటంతో వెంటనే పూర్ణ కళ్ళు తిరిగి కింద పడుతుంది. ఆ తర్వాత తనను లేపి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. మరోవైపు శంకర్ ప్రసాద్ కు హాస్పిటల్ లో డాక్టరమ్మ వైద్యం చేస్తూ ఉంటుంది.

ఇక నూకాలమ్మ అక్కడే ఉండి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అదే సమయంలో హాస్పిటల్ కి పూర్ణ తో పాటు రఘు దంపతులు చేరుకుంటారు. ఇక లోపల బెడ్ మీద ఉన్న శంకర్ ప్రసాద్ ని చూసి బాగా ఎమోషనల్ అవుతారు. ఇక పూర్ణ తట్టుకోలేక పోతుంది. ఇక పక్కనే ఉన్న సీత ధైర్యం ఇస్తూ ఉంటుంది. డాక్టరమ్మ బయటికి వచ్చి ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెబుతుంది.

కానీ కళ్ళకు కారు అద్దాలు కుచ్చుకోవడం వల్ల చూపు కోల్పోయాడు అని చెప్పటంతో షాక్ అవుతారు. దాంతో డాక్టరమ్మ పూర్ణకు ధైర్యంగా ఉండమని చెబుతుంది. ప్రాణాలు దక్కాయని సంతోషపడమని చెబుతుంది. మరోవైపు సిద్దుకి తన తండ్రి కి యాక్సిడెంట్ అయిన విషయం తెలియటంతో వెంటనే స్వప్నని పిలిచి చెబుతాడు.

అక్కడే ఉన్న రేఖ ఆ మాటలు వింటూ తనను కొట్టినందుకు తగిన శాస్త్రీ జరిగిందని అనుకుంటుంది. ఇక సిద్దు వాళ్ళు బయలుదేరుతుండగా వారిని ఆపుతుంది. కానీ వాళ్ళు మాత్రం మేము వెళ్ళాలి లేదంటే మాపైన అనుమానం పడతారు అని స్వప్న అంటుంది. ఇప్పుడు మీరు వెళ్తే అక్కడ రఘు, పూర్ణ ఉంటారు.

వాళ్లు కూడా తిరిగి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే మీ నాన్నకు అలా జరిగినందుకు సేవలు చేయటానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోతారు. అంతేకాకుండా మీ నాన్న రఘుకు ఆఫీస్ బాధ్యతలు కూడా ఇస్తాడు అని మాయ మాటలు చెప్పటంతో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇక హాస్పిటల్లో శంకర్ ప్రసాద్ ని చూడటానికి పూర్ణ వాళ్లు లోపలికి వెళ్తారు.

ఇక రఘు, పూర్ణ పలకరించడంతో శంకర్ ప్రసాద్ కోపంతో రగిలిపోతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి శంకర్ ప్రసాద్ కు చూపు పోయిందని చెప్పి స్ట్రెస్ తీసుకోవద్దని అంటాడు. కానీ శంకర్ ప్రసాద్ మాత్రం పూర్ణ వాళ్ళు ఉండటాన్ని అసలు జీర్ణించుకోలేకపోతాడు. దాంతో రఘు అక్కడి నుంచి తల్లిని, భార్యను బయటికి తీసుకెళ్తాడు. ఏమి చేయలేకపోతున్నాను అని చాలా బాధపడుతుంది పూర్ణ. తరువాయి భాగంలో వర్షకు తన తండ్రికి యాక్సిడెంట్ అయిన విషయం తెలియటంతో బాధతో గట్టిగా అరుస్తుంది.

Also Read: Madhuranagarilo June 26th: రౌడీలను చితక్కొట్టిన కాలనీ వాసులు, రాధ గురించి షాకింగ్ నిజం తెలుసుకున్న శ్యామ్?

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 13th: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
నువ్వులేక నేను లేను: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
Podarillu Serial Today August 13th:బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు
పొదరిల్లు: బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget