అన్వేషించండి

Facial Surgeries in Telugu Serials: అరె ఏంట్రా ఇది.. ఫేస్ సర్జరీలతో పాత్రదారుల మార్పు, ‘కృష్ణ ముకుంద మురారి’లో ముకుందాకు కొత్త ముఖం!

Krishna Mukunda Murari: సీరియల్‌ నటులను మార్చేందుకు ఫేస్ సర్జరీ కాన్సెప్ట్‌ను డైరెక్టర్లు ఎంచుకోవడంతో ఆడియన్స్ హర్ట్ అవుతున్నారు.

Serial Directors Are Changing Famous Characters: టీవీ సీరియల్స్‌లో నటీనటులను ప్రేక్షకులు ఎంత గానో ఆదరిస్తారు. తమ ఇంటి మనుషుల్లా దగ్గర చేసుకుంటారు. సంవత్సరాలుగా ఒక పాత్రలో ఒక పేరుతో వాళ్లని చూసి యాక్టర్స్ సొంత పేరును కూడా మర్చిపోయి సీరియల్‌ పేర్లనే కంటిన్యూ చేస్తారు. కొందరి నటులు కూడా తాము పాపులర్ అయిన వారికి పేరు వచ్చిన క్యారెక్టర్ నేమ్స్‌ను బయట కూడా కంటిన్యూ చేస్తారు. అంతలా ప్రేక్షకులు నటుల్ని దగ్గర చేసుకుంటారు. అయితే ఈ మధ్య సీరియల్స్‌లో రకరకాల కారణాల వల్ల ఏన్నో ఏళ్లుగా నటిస్తున్న నటులను డైరెక్టర్లు ఉన్నట్టుండి మార్చేస్తున్నారు. దీని వల్ల అప్పటి వరకు తన ఫేవరెట్ పర్సన్ అనుకున్న తన అభిమాన నటుల స్థానంలో వేరే వాళ్లని చూడటం ఇష్టం లేక డిసప్పాయింట్ అవుతున్నారు. దీని వల్ల చాలా సీరియల్స్ రేటింగ్ మీద బాగా ఎఫెక్ట్‌ పడుతుంది. తాజాగా ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్‌లో ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్న ముకుందను మార్చేయనున్నట్లు తెలుస్తోంది.

దాదాపు అన్ని సీరియల్స్‌లోనూ కొంత మంది నటులను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అది హీరో అయినా, విలన్ అయినా సైడ్ క్యారెక్టర్‌ అయినా.. సరే వాళ్ల కోసమే ఈ సీరియల్ చూస్తున్నాం అనేంతలా కొంతమంది నటులు తమ నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటారు. అయితే అనుకోని కారణాల వల్ల వాళ్లు మధ్యలోనే సీరియల్ నుంచి తప్పించుకోవాల్సి వస్తే దాని ప్రభావం సీరియల్ మీద చాలా పడుతుంది. ఇక ప్రేక్షకులు అయితే చాలా బాధపడిపోతారు. కొంత మంది బాధతో.. మరికొంత మంది తమ అభిమాన నటులు లేకపోతే సీరియల్‌ చూడలేము అనేంతలా హేట్ చేస్తారు. తాజాగా కొన్ని సూపర్ హిట్ సీరియల్స్‌ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాయి.

గందరగోళంగా ‘గుప్పెడంత మనసు’

స్టార్‌మాలో నెంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోయిన ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌కు రిషి, వసుధర, జగతి ఆయువు పట్టులాంటి వాళ్లు. తల్లీ కొడుకుల ఎమోషన్‌, లవ్‌తో సాగిన ఈ సీరియల్‌కు క్రేజ్‌ మమూలుగా ఉండేది కాదు. తల్లీ కొడుకులు ఎప్పుడెప్పుడు దగ్గర అవుతారా అని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూసేవాళ్లు. అయితే డైరెక్టర్‌ తల్లీ కొడుకుల్ని దగ్గర చేసినట్లే చేసి అర్థాంతరంగా జగతి క్యారెక్టర్‌ని హత్య చేసి చంపేశారు. దీంతో సీరియల్ మీద చాలా ప్రభావం పడింది. తర్వాత తన తల్లిని చంపిన వాళ్లని చంపాలని కొడుకు రంగంలోకి దిగడం, కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. అంత వరకు బాగున్నా ఈ మధ్య రిషిని కూడా చంపేశారు. రిషి ప్లేస్‌ని రీప్లేస్ చేయడానికి మను అనే కొత్త క్యారెక్టర్‌ని తీసుకొచ్చారు. స్టార్ హీరోకి ఇచ్చిన రేంజ్‌లో మనుకి ఎలివేషన్లు ఇచ్చారు. ఇందుకు వసు క్యారెక్టర్‌ని కూడా కన్ఫ్యూజన్‌లో పెట్టాశారు. అయితే ఆడియన్స్ మాత్రం రిషి లేని ‘గుప్పెడంత మనసు’ దండగ అనేంత నెగిటివిటీని ఈ సీరియల్‌ మీద పెంచుకున్నారు. ఇక ఇదే రూట్‌ని ఫాలో అవుతుంది మరో సీరియల్.

అప్పుడు మురారి.. ఇప్పుడు ముకుంద..

ఒక కృష్ణుడి కోసం ఇద్దరు రాధలు కొట్టుకున్నట్లు సాగుతోంది ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్.. ముందు మురారి, ముకుంద ప్రేమించుకున్నారు. అన్న ప్రేమిస్తున్నాడు అని తెలిసి మురారి తాను ప్రేమించిన ముకుందను అన్నకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ప్రియుడ్ని మర్చిపోలేని ముకుంద అతడ్ని దక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అయితే అప్పట్లో పాత మురారికి యాక్సిడెంట్ చేసి ఆ స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. అతన్ని ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సీరియల్‌కి కృష్ణ, ముకుంద, మురారి నువ్వా నేనా అన్నట్లు నటిస్తున్న టైంలో ముకుందను మార్చేయాలి అని డైరెక్టర్ డిసైడ్ అయ్యారు.

అయితే ఈ సీరియల్ గత కొన్ని రోజులుగా రెండు జంటల శోభనం మీదే సా..గదీస్తున్నారు. అందుకే ఇక రూట్ మార్చాలి అని ఏకంగా ముకుందను మార్చేందుకు నిర్ణయించారు. ఇందుకు తగ్గట్లు. ముకుంద ఇంకా మురారిని మర్చిపోలేదు అని ఫస్ట్ నైట్ రోజు రచ్చ రచ్చ చేయించి.. ముకుంద ఇంటి నుంచి పారిపోయేలా చేసి ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకునేలా చేశారు. అయితే అందరూ ముకుంద చనిపోయింది అనుకున్నా ముకుంద బతికే ఉంది. తాజా ఎపిసోడ్‌లో ముకుంద తన తండ్రితో మురారిని దక్కించుకునేందుకు రూపం మార్చుకుంటున్నా అని చెప్తుంది. దీని బట్టి ముకుందను డైరెక్టర్ మార్చేందుకు నిర్ణయించుకున్నారని అర్థమైంది. ఇప్పటి వరకు టాప్‌లో రన్ అవుతున్న ఈ సీరియల్‌లో ముకుందను మార్చడం అంటే సాహసమే అని చెప్పాలి చూడాలి మరి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు.

‘ఊర్వశివో రాక్షిసివో’లో కూడా ఇదే పరిస్థితి

‘ఎవడు’ సినిమాలో యాక్సిడెండ్ తర్వాత అల్లుఅర్జున్‌కి ఫేస్ సర్జరీ చేసి రామ్‌ చరణ్‌లా మార్చేస్తారు. ఫేస్ సర్జరీ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘ఎవడు’ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అదే కాన్సెప్ట్‌ను ఇప్పుడు సీరియల్స్‌లో కూడా బాగా వాడేస్తున్నారు. ఉన్నట్లుండి ఆయా క్యారెక్టర్లను యాక్సిడెంట్ చేసేసి ముఖాలు మార్చేస్తున్నారు. ఇది వరకు మురారిని అలాగే ఫేస్ సర్జరీ చేసి క్యారెక్టర్ మార్చేశారు. ఇక మా టీవీలో వస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ సీరియల్‌లో కూడా వైష్ణవి చెల్లెలు పవిత్రపై ధీరు అత్యాచారం చేయడంతో న్యాయం కోసం వైష్ణవి ఏకంగా ముఖం మార్చుకొని దుర్గలా ధీరుకి దగ్గరై అతని మీద అతని కుటుంబం మీద పగ తీర్చుకోడానికి పన్నాగాలు పన్నుతుంది. ఇక ఇప్పుడు ముకుంద కూడా తన రూపం మార్చుకుంటా అని చెప్పేసింది.

Also Read: భ్రమయుగం: ఓటీటీలోకి వ‌చ్చేసిన 'భ్రమయుగం', స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget